గుసగుస.. మిల్కీ తమన్నాలో దాగిన భడభాగ్ని
కచ్ఛితంగా ఇది తమన్నా వ్యక్తిగత జీవితానికి సంబంధించినది అయి ఉంటుందని అంతా ఊహిస్తున్నారు.;
ప్రేమను పొందడంలో రహస్యం మీరు ఇతరులను ప్రేమించడమే.... ఆసక్తికరంగా ఉండటంలో రహస్యం ఆసక్తిని కలిగి ఉండటమే.... ఇతరులు మీలో అందాన్ని కనుగొనడంలో రహస్యం ఇతరులలో మీరు అందాన్ని కనుగొనడం.. స్నేహితుడిని కలిగి ఉండటానికి రహస్యం స్నేహితుడిగా ఉండటం... ఇలాంటి ఒక భావోద్వేగమైన పోస్ట్ తో హృదయాలను తాకింది మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా.
రెండు దశాబ్ధాల సుదీర్ఘ కెరీర్ లో ఇలాంటి ఎమోషనల్ క్షణం తన జీవితంలో లేదు. నటుడు విజయ్ వర్మతో స్నేహం.. ప్రేమాయణం .. బ్రేకప్ అంటూ రకరకాలుగా ప్రచారం సాగుతోంది. ఇలాంటి సమయంలో తమన్నా క్రిప్టిక్ పోస్ట్ ఆశ్చర్యపరిచింది. మిల్కీ ఇచ్చిన సందేశంలో ఏదో నిగూఢ రహస్యం దాగి ఉంది. ఇది స్ఫూర్తిదాయకంగా ఉంది అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. కచ్ఛితంగా ఇది తమన్నా వ్యక్తిగత జీవితానికి సంబంధించినది అయి ఉంటుందని అంతా ఊహిస్తున్నారు.
అందమైన వచన కవిత్వంతో తమన్నా బాహ్య ప్రపంచానికి ఏదో చెప్పాలనుకుంటోంది. తనలో నిగూఢంగా దాగిన భావాలను ఎదుటివారికి తెలియజేయాలనుకుంటోంది. ''ప్రియుడితో బ్రేకప్ అయింది.. బరువు పెరుగుతోంది!'' అంటూ తనపై సాగిస్తున్న ఊహాగానాలకు ఇది కచ్ఛితంగా సమాధానం అని కూడా ఇప్పుడు అందరూ ఊహిస్తున్నారు. తమన్నా తాజా పోస్ట్ చాలా సందహాలను లేవనెత్తింది. క్రిప్టిక్ పోస్ట్ వెనక అసలు కారణమేమిటో ఎవరూ గెస్ చేయలేకపోతున్నారు. అయితే తమన్నాలోని లోతైన భావనలను కొందరు మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు.
ఈ పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షిస్తూనే ఉండటంతో అభిమానులు తమన్నా తన ఉద్దేశం ఏమిటో బయటకు చెబుతుందని ఆశిస్తున్నారు. తన వ్యక్తిగత జీవితం గురించి మరిన్ని విషయాలు చెబుతుందా లేదా? అన్నది వేచి చూడాలి. ప్రస్తుతానికి ఆ రహస్యం ఏమిటో ఎవరికీ అర్థం కాలేదు. కెరీర్ మ్యాటర్ కి వస్తే.. తమన్నా తదుపరి `ఓదేలు 2` చిత్రీకరణలో బిజీగా ఉంది.