పూనమ్.. ఇలాంటి ట్వీట్లు పెట్టి కన్ఫ్యూజ్ చేయొద్దు!

రీసెంట్ గా ఏపీలోని ఓ కాలేజీలో హెడెన్ కెమెరాలు ఉన్నట్లు వార్తలు రాగా.. ఆ సమయంలో స్పందించి త్రివిక్రమ్ ను అడగండని కామెంట్ పెట్టింది.

Update: 2024-09-18 14:15 GMT

నటి పూనమ్ కౌర్, డైరెక్టర్ త్రివిక్రమ్.. వీరిద్దరి మధ్య ఏం జరిగిందో ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు! కానీ పూనమ్ మాత్రం త్రివిక్రమ్ పై ఇప్పటికే అనేక ఆరోపణలు చేస్తోంది. రకరకాల ట్వీట్లు పెడుతోంది. అనవసరమైన విషయాల్లో ఆయన పేరును ప్రస్తావిస్తోంది. త్రివిక్రమ్ కు సంబంధం లేకపోయినా ఆయన ఏదో చేసారు అన్నట్లు పోస్టులు చేస్తోంది. కానీ ఎం చేశాడు అనేది మాత్రం చెప్పడం లేదు. రీసెంట్ గా ఏపీలోని ఓ కాలేజీలో హెడెన్ కెమెరాలు ఉన్నట్లు వార్తలు రాగా.. ఆ సమయంలో స్పందించి త్రివిక్రమ్ ను అడగండని కామెంట్ పెట్టింది.

ఇప్పుడు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వ్యవహారంపై రెస్పాండ్ అవుతూ.. మాస్టర్ అని పిలవొద్దని పోస్ట్ చేసింది. అంతటితో ఆగకుండా తాను త్రివిక్రమ్ పై 'మా'కు గతంలోనే ఫిర్యాదు చేశానంటూ ట్వీట్ చేసింది. అప్పుడు దానిని సీరియస్ గా తీసుకుని ఉంటే.. తనతో పాటు చాలా మందికి రాజకీయంగా వేదన ఉండేది కాదని పోస్ట్ పెట్టింది. ఇండస్ట్రీలోని పెద్దలు త్రివిక్రమ్‍ను ప్రశ్నించాలని కోరుతున్నట్లు తెలిపింది. దీంతో దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ రీసెంట్ గా స్పందించారు.

'మా'కు పూనమ్ అసలు ఎప్పుడు ఫిర్యాదు చేసిందో తమకైతే తెలియదని తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. అప్పటికి కమిటీ ఏర్పడి ఉంటే.. కంప్లైంట్ బాక్స్ వేసి ఉంటే సరిపోయేదని తెలిపారు. ఎప్పుడైనా కంప్లైంట్ లేకుండా ముందుకెళ్లలేమని చెప్పారు. ఫిర్యాదు తమకు 'మా' వాళ్లు పంపిస్తే చూసేవారమని పేర్కొన్నారు. ఇప్పుడు ఫిర్యాదు చేస్తే పరిశీలిస్తామని చెప్పారు. దీంతో ఆయన వ్యాఖ్యలు ఫుల్ వైరల్ గా మారడంతో.. పూనమ్ పోస్ట్ కింద నెటిజన్లు తెగ స్పందిస్తున్నారు.

"తమ్మారెడ్డి భరద్వాజ క్లియర్ గా చెప్పారు.. అందుకే ఇప్పుడు ఏదైనా చెప్పాలి అనుకుంటే.. వెళ్లి ఫిర్యాదు చేసి క్లియర్ గా మాట్లాడు.. లేకపోతే త్రివిక్రమ్ గురించి ఇంకోసారి మాట్లాడకు.. ట్వీట్స్ పెట్టకు.. అది ఇన్ డైరెక్ట్ గా.. అయినా డైరెక్ట్ గా అయినా.. అసలు ఇవన్నీ ఎందుకు.. ఏదైనా ప్రాబ్లం ఉంటే.. వెళ్లి కంప్లైంట్ ఇవ్వు.. అప్పుడు వాళ్ళు కచ్చితంగా రెస్పాండ్ అవుతారు.. చర్యలు తీసుకుంటారు.. అంతేగానీ ఇలాంటి ట్వీట్లు పెట్టి కన్ఫ్యూజ్ చేయొద్దు" అని సలహా ఇస్తున్నారు.

"ఎలాంటి సమస్యలు ఉన్నా.. త్రివిక్రమ్ తో ఏం జరిగినా.. వెళ్లి కంప్లైంట్ చెయ్.. ఆ తర్వాత నిబంధనల ప్రకారం అన్నీ జరుగుతాయి.. అప్పుడు సోషల్ మీడియాలో మళ్లీ మాట్లాడుకుందాం.. ఫిర్యాదు ఇచ్చాక.. విచారణ చేపట్టాక.. న్యాయం జరిగితే న్యాయం జరిగిందని చెప్పు.. లేకుంటే లేదని చెప్పు.. కానీ అనవసరమైన విషయాల్లో త్రివిక్రమ్ పేరును ప్రస్తావించొద్దు. ఇదే రిపీట్ అయితే అందరికీ బోరు కొడుతుంది" అని పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.


Tags:    

Similar News