పిక్ టాక్ : చూపు తిప్పనివ్వని ముఖర్జీ అందం

వెండి తెర మరియు బుల్లి తెర ద్వారా ఈ అమ్మడు సాధ్యం అయినంత ఎంటర్టైన్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంది.

Update: 2024-06-27 12:30 GMT

ఎన్టీఆర్‌ హీరోగా నటించిన కంత్రి సినిమాలో మెరిసిన ముద్దుగుమ్మ తనీషా ముఖర్జీ. ఆ సినిమా తర్వాత మళ్ళీ తెలుగు లో ఈ అమ్మడు కనిపించలేదు. కానీ ఉత్తర భారతంలో ఈమె సందడి కొనసాగుతూనే ఉంది. వెండి తెర మరియు బుల్లి తెర ద్వారా ఈ అమ్మడు సాధ్యం అయినంత ఎంటర్టైన్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంది.


నటిగా చేసింది కొన్ని సినిమాలే అయినా కూడా తనదైన ముద్రను వేసింది అనడంలో సందేహం లేదు. బిగ్‌ బాస్‌ సీజన్‌ 7 తో బుల్లి తెరపై అడుగు పెట్టిన తనీషా ముఖర్జీ ఆ తర్వాత పలు టీవీ షో ల్లో కనిపించడం ద్వారా ప్రేక్షకులకు మరింతగా చేరువ అయ్యింది.


వెండి తెర, బుల్లి తెర తో పాటు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఈ అమ్మడి అందాల ఆరబోతకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. ఈ స్థాయిలో అందాల ఆరబోత చేయడం ద్వారా పాతికేళ్ల పడుచు హీరోయిన్స్ కి కూడా పోటీ అన్నట్లుగా తనీషా నిలుస్తుంది.

తాజా ఫోటో షూట్‌ తో చూపు తిప్పుకోనవ్విడం లేదు. టైట్‌ డ్రెస్ లో అందాల క్లీవేజ్‌ షో చేస్తూ తనీషా ముఖర్జీ చేసిన సందడి నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇలాంటి అందాల విందు ఫోటోలను షేర్‌ చేయడం ద్వారా ఇంకా కూడా ఈమెకు ఇండస్ట్రీలో మంచి ఆఫర్లు వస్తున్నాయి.

ఆ మధ్య ఒక కామెడీ షో కి జడ్జ్‌ గా వ్యవహరించిన తనీషా ముఖర్జీ ఆ తర్వాత ఒక డాన్స్ షో లో కూడా జడ్జ్‌ గా సందడి చేసింది. మరో వైపు సినిమాలు కూడా చేస్తూ బిజీగా ఉంది. గత ఏడాది ఒక సినిమా తో వచ్చిన ఈమె ఈ ఏడాదిలో కూడా ఒక సినిమా తో వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Tags:    

Similar News