తారక్.. అతన్ని రిజెక్ట్ చేసి పొరపాటు చేశాడా?

ఈ మూవీ కథని బుచ్చిబాబు ఎన్టీఆర్ ని దృష్టిలో ఉంచుకొని సిద్ధం చేశారు. తారక్ కి కూడా మూవీ కథ నచ్చడంతో చేద్దామని మాట ఇచ్చారు. ఇంతలో ప్రశాంత్ నీల్ లైన్ లోకి వచ్చారు.

Update: 2024-02-04 04:44 GMT

జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఏడాది గ్యాప్ తీసుకొని కొరటాల శివ దర్శకత్వంలో దేవర మూవీని సెట్స్ పైకి తీసుకొని వెళ్లారు. ఆ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. ఏప్రిల్ లో మూవీ రిలీజ్ ఉంటుందని ఎనౌన్స్ చేశారు. అయితే అది కష్టమనే టాక్ వినిపిస్తోంది. నిజానికి దేవర తర్వాత ఎన్ఠీఆర్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మూవీ చేయాల్సి ఉంది.

ఈ మూవీ కథని బుచ్చిబాబు ఎన్టీఆర్ ని దృష్టిలో ఉంచుకొని సిద్ధం చేశారు. తారక్ కి కూడా మూవీ కథ నచ్చడంతో చేద్దామని మాట ఇచ్చారు. ఇంతలో ప్రశాంత్ నీల్ లైన్ లోకి వచ్చారు. ఎన్టీఆర్ కి ఒక స్టోరీ లైన్ చెప్పి ఒకే చేయించుకున్నారు. అయితే బుచ్చిబాబు కంటే ప్రశాంత్ నీల్ తో మూవీ ముందుగా చేస్తే బెటర్ అని తారక్ భావించారు. బుచ్చిబాబుకి అదే విషయం చెప్పారు.

ఇక ఆ స్టోరీని రామ్ చరణ్ కి రికమండ్ చేశారు. రామ్ చరణ్ ఫస్ట్ సిట్టింగ్ లోనే బుచ్చిబాబు చెప్పిన కథకి ఒకే చెప్పేశాడు. దీంతో అఫీషియల్ గా ఎనౌన్స్ చేసేశారు. మైత్రీ మూవీ సమర్పణలో ఈ చిత్రాన్ని నిర్మించడానికి రెడీ అయ్యారు. సుకుమార్ రైటింగ్స్ నిర్మాణ భాగస్వామిగా కన్ఫర్మ్ అయ్యింది. రీసెంట్ గా ఏఆర్ రెహమాన్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా ఖరారు చేసుకున్నారు. త్వరలో ఈ మూవీ షూటింగ్ కూడా ప్రారంభం కాబోతోంది.

ఈ సినిమా కోసం ఆడిషన్స్ నిర్వహిస్తున్నారు. అయితే ఇటు ఎన్ఠీఆర్ దేవర కంప్లీట్ అయిన కూడా ప్రశాంత్ నీల్ ప్రస్తుతం అందుబాటులో లేరు. సలార్ 2ని స్టార్ట్ చేస్తున్నారు. మరో ఏడాది వరకు ఫ్రీ అయ్యే అవకాశమే లేదు. తారక్ చేతిలో హిందీలో వార్ 2 మూవీ ఉంది. దానికి పెద్దగా టైమ్ పట్టకపోవచ్చు. ఇక దేవర రెండు భాగాలు కాబట్టి ఫస్ట్ పార్ట్ ఫలితాన్ని బట్టి ఆ సినిమా సెట్స్ పైకి రావచ్చు. ఇక బుచ్చిబాబు సినిమాని తారక్ హోల్డ్ లో పెట్టుంటే ఇప్పుడు వార్ 2తో పాటు అతని కథని సెట్స్ పైకి తీసుకెళ్లే ఛాన్స్ ఉండేది.

బుచ్చిబాబు కథ అద్భుతంగా వచ్చిందని ఇండస్ట్రీలో వినిపిస్తోన్న టాక్. దీనిని బట్టి తారక్ ఒక సూపర్ మూవీని చేజేతులా వదిలేసుకున్నాడనే మాట వినిపిస్తోంది. అయితే ఇదంతా యాదృశ్చికంగా జరిగిందే. తారక్ ఒకలా తలిస్తే టైం మరోలా నడిపించింది అని చెప్పాలి. ఇక జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 కు పెద్దగా టైమ్ పట్టకపోవచ్చు. దేవర 1 కూడా వాయిదా పడే అవకాశం ఉంది కాబట్టి మధ్యలో కొంత టైమ్ అయితే వేస్ట్ అయ్యే అవకాశం ఉంది.


Tags:    

Similar News