తారక్ లేకుండానే స్టార్ట్ చేస్తున్నారా?
ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ వరల్డ్ లెవెల్ లో టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ సంపాదించుకున్న విషయం తెలిసిందే.
ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ వరల్డ్ లెవెల్ లో టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ సంపాదించుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన కొరటాల శివ డైరెక్షన్ లో దేవర మూవీ చేస్తున్నారు. ఒకప్పుడు దేవర అయిపోగానే ఎన్టీఆర్-నీల్ సినిమా ఉంటుంది, అది అయిపోగానే వార్ 2 ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు తారక్ లైనప్.. దేవర, వార్ 2, ఎన్టీఆర్ 31గా మారింది.
అయితే దేవర సినిమా ఈ ఏడాది ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ కావాల్సి ఉండగా.. విలన్ సైఫ్ అలీఖాన్ గాయపడ్డ కారణంగా షూటింగ్ డిలే అవుతోంది. దీంతో ఈ మూవీ అనుకున్న తేదీకి రిలీజ్ కానట్లే. అదే రోజు విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ విడుదల అవుతోంది. మరి ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ను త్వరలోనే మేకర్స్ ప్రకటించనున్నారట. ఇప్పుడు ఎన్టీఆర్ షెడ్యూల్ లో మరో కొత్త చిక్కు వచ్చి పడింది.
దేవర సినిమా షూటింగ్ ఫిబ్రవరి కల్లా అయిపోతుందని ఫిక్స్ అయిన తారక్.. అదే నెలలో వార్-2 స్టార్ట్ చేయడానికి ఆ మూవీ మేకర్స్ తో నిర్ణయించుకున్నారట. కానీ ఇప్పుడు పరిస్థితి అంతా మారిపోయింది. ఇంకా దేవర షూటింగ్ పూర్తి కాలేదు. మరో రెండు నెలలు పట్టే అవకాశం ఉంది. ఏప్రిల్ కల్లా పూర్తవుతుందని తెలుస్తోంది. దీంతో తారక్ వార్-2 సెట్స్ లోకి ఇప్పట్లో ఎంట్రీ ఇచ్చే అవకాశం లేదు.
ఇక వార్-2 డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తాజాగా ఓ నిర్ణయానికి వచ్చారట. ఎన్టీఆర్ లేకుండానే వార్-2 షూటింగ్ ను స్టార్ట్ చేయనున్నారట. హృతిక్ రోషన్ సమయాన్ని వృథా చేయకుండా ఉండేందుకు అయాన్ ముఖర్జీ ఎన్టీఆర్ లేకుండానే షూటింగ్ ప్రారంభించాలని నిర్ణయించుకున్నారట. ఈ యాక్షన్ థ్రిల్లర్లో హృతిక్ రోషన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.
మరి ఈ మూవీలో ఎన్టీఆర్ కాస్త నెగెటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ లో నటిస్తారని ఆ మధ్య కథనాలు వచ్చాయి. ఫిబ్రవరి 23న వార్-2 షూటింగ్ స్టార్ట్ అవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇటీవలే హృతిక్ రోషన్ గాయపడగా కాలికి గాయమైంది. ఈ విషయాన్ని ఆయనే సోషల్ మీడియా వేదికగా చెప్పారు. నడుముకు బెల్ట్ పెట్టుకుని, క్రచస్ సపోర్ట్ తో నిల్చున్న పిక్ ను షేర్ చేశారు.
మరి ఈ సినిమా షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ లో హృతిక్ పాల్గొనడం డౌటేనని తెలుస్తోంది. వార్ మూవీకి రెట్టింపు బడ్జెట్, భారీ స్కేల్ లో వార్-2 ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇండియా మోస్ట్ వాంటెడ్ మల్టీస్టారర్ మూవీగా దీన్ని తెరకెక్కించబోతున్నారట. ఇందులో ఆలియా భట్ పేరు హీరోయిన్ గా వినిపిస్తోంది. మరోవైపు కియారా అద్వానీ నేమ్ కూడా వినిపించింది. మరి వీరిలో ఎవరు ఫైనల్ అవుతారు? ఎవరికి ఎవరు జోడీ అవుతారో వేచి చూడాలి.