గోడవపడే ఫ్యాన్స్.. ఎన్టీఆర్ ఇచ్చిన స్ట్రోక్ గుర్తుందా..

అయితే ఇదే తరుణంలో ఓ వర్గం ఫ్యాన్స్ నెగిటివ్ కామెంట్స్ కూడా చాలా వైరల్ గా మారుతుంటాయి

Update: 2024-03-11 14:14 GMT

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు ఎవరి పనుల్లో వారు చాలా బిజీగా ఉంటారు. స్టార్స్ ఒకరికొకరు ఎదురుపడితే మాత్రం చాలా హ్యాపీగా కౌగిలించుకొని ఎంతో ఆప్యాయంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అగ్ర హీరోలు ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే ఫ్యాన్స్ ఆనందాలు అంతా ఇంతా ఉండవు. అయితే ఇదే తరుణంలో ఓ వర్గం ఫ్యాన్స్ నెగిటివ్ కామెంట్స్ కూడా చాలా వైరల్ గా మారుతుంటాయి.

బాక్సాఫీస్ రికార్డులపై పోస్టర్స్ పై ఎంత పాజిటివ్ గా ఉన్నా కూడా సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో నెగెటివిటీ అనేది పెరిగిపోతుంది. కొంతమంది స్టార్ హీరోలు సెలబ్రిటీలు సోషల్ మీడియాలో ఉన్న నెగెటివిటీని చూసి భయపడి అందులోకి రావాలని అనుకోవడం లేదు అంటే పరిస్థితి ఏ రేంజ్ లో ఉందొ చెప్పవచ్చు. ఇక ఫ్యాన్స్ మధ్యలో గొడవలు కామెంట్స్ వరకు కాకుండా భౌతిక దాడులకు కూడా దారితీస్తున్నాయి.

రీసెంట్గా అల్లు అర్జున్ ప్రభాస్ ఫ్యాన్స్ మధ్యలో కొట్లాట ఎంత వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈ తరహా గొడవలు ఇప్పటివి కాదు. చాలా కాలంగా కొనసాగుతున్నవే. కొందరు అయితే ఏకంగా చంపేవరకు వెళ్లిన విధానం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. గతంలో పవన్ కళ్యాణ్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మధ్య కూడా గొడవలు ఎక్కువగానే జరిగాయి.

ఇక ఆ గొడవల విషయంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు ఇచ్చిన స్ట్రోక్ మాత్రం అప్పట్లో హాట్ టాపిక్ గా నిలిచింది. ఇక లేటెస్ట్ గా ఫ్యాన్స్ వార్స్ కొనసాగుతున్న తరుణంలో ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఎన్టీఆర్ ఏమన్నారంటే.. కేవలం నా అభిమానులకు మాత్రమే కాదు. అందరికి ఇచ్చే ఒకే ఒక్క సందేశం. మా నటీనటులలో ఎవరు ఈ స్థాయిలో గొడవపడి తిట్టుకున్న సందర్భాలు లేవు.

అభిమానాలు సినిమాల వరకు ఓకే. రెండు గంటలు చూసే సినిమా కొరకు మీకు గొడవల్లోకి వెళ్ళకూడదు. నా అభిమానులు అయితే గొడవల్లోకి వెళ్లరు అని అనుకుంటున్నాను. కానీ వెళ్లే ఆలోచన ఉన్నవారు అయితే నా అభిమానులుగా ఉండవద్దు అని నేను కోరుకుంటున్నాను. ఎప్పుడైనా సరే దేశం తల్లిదండ్రులు శ్రేయోభిలాషులు మిత్రులు భార్యాభర్తలు.. ఆ తర్వాతే మీ అభిమాన నటీనటులు అని ఎన్టీఆర్ ఇచ్చిన సందేశం అందరినీ ఎంతగానో ఆలోచింపజేసింది.

ఒక విధంగా సినీ తారలందరూ కూడా ఇలానే చెబితే బాగుంటుంది అని అభిప్రాయాలు కూడా వచ్చాయి. ఇక గతంలో మహేష్ బాబు కూడా భరత్ అనే నేను సినిమా ఈవెంట్ జు ఎన్టీఆర్ ను గెస్ట్ గా పిలిచిన విషయం తెలిసిందే. మేము మేము బాగానే ఉంటాం. మారాల్సింది మీరే అంటూ గొడవలు పడకూడదు అని మంచి సందేశం ఇచ్చాడు. స్టార్ హీరోలు అయితే ఎలాంటి అభ్యంతరాలు లేకుండా చాలా ఫ్రెండ్లీగా కొనసాగుతున్నారు. మరి ఫ్యాన్స్ వారిని ఎప్పుడు అర్థం చేసుకుంటారో.

Tags:    

Similar News