లేడీ సూప‌ర్ స్టార్ ని కార్పోరేట్ టార్గెట్ చేస్తుందా?

టెర్మ్స్ అండ్ కండీష‌న్స్ లో హీరోయిన్ ప్ర‌చారానికి రావాలి అనే వ్యాఖ్యాన్ని పెన్నుతో అడ్డంగా కొట్టేసిన త‌ర్వాత ప్రాజెక్ట్ కి సంత‌కం చేస్తుంది.

Update: 2023-12-26 12:30 GMT

లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార ఏ రేంజ్ హీరోయిన్ అన్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు. సౌత్ లో నెంబ‌ర్ వ‌న్ హీరోయిన్ గా చ‌లామ‌ణీ అవుతుంది. ఆమెకి ముందు త‌ర్వాత ఎంతో మంది హీరోయిన్లు వ‌చ్చారు? కానీ న‌య‌న్ రేంజ్ ని ఏమాత్రం ఏ న‌టి అందుకోలేదు. అంత‌టి ఛ‌రిష్మా కేవ‌లం న‌య‌న‌తార‌కి మాత్ర‌మే సాధ్య‌మైంది. ఎన్నో భాష‌ల్లో అవ‌కాశాలు వ‌స్తున్నా కేవ‌లం తమిళ సినిమాలు మాత్ర‌మే అధికంగా చేస్తోంది. తెలుగులో చాలా రేర్ గా క‌మిట్ అవుతుంది. ఇటీవ‌లే 'జ‌వాన్' తో బాలీవుడ్ లోనూ అడుగు పెట్టింది.


తొలి సినిమాతోనే 1000 కోట్ల క్ల‌బ్ లో చేరింది. దీంతో హిందీ అవ‌కాశాలు అమ్మ‌డి ముందు క్యూ క‌డుతున్నాయి. ఒక్కో సినిమాకి ప‌ది కోట్లకు పైగానే పారితోషికం తీసుకుంటుంది. ఇంకా ఇప్పుడా లెక్క పెరిగే ఉండొచ్చు. ఇక ఆమ్మ‌డు ఏ సినిమాలో న‌టించినా ప్ర‌చారానికి హాజ‌రు కాదు. అద‌నంగా పారితోషికం చెల్లిస్తామ‌న్నా? నో ఛాన్స్ అనే స్తుంది. ఆ సినిమాలో ఎంత పెద్ద స్టార్ అయిన స‌రే న‌య‌న్ ప్ర‌చారానికి మాత్రం హాజ‌రు కాదు. ఓ ప్రాజెక్ట్ కి సంత‌కం చేసే ముందు న‌య‌న్ ఈ కండీష‌న్ క‌చ్చితం పెడుతుంది.

టెర్మ్స్ అండ్ కండీష‌న్స్ లో హీరోయిన్ ప్ర‌చారానికి రావాలి అనే వ్యాఖ్యాన్ని పెన్నుతో అడ్డంగా కొట్టేసిన త‌ర్వాత ప్రాజెక్ట్ కి సంత‌కం చేస్తుంది. ఇది న‌య‌న‌తార రేంజ్. అయితే ఇప్పుడీ భామ‌పై కార్పోరేట్ నిర్మాణ సంస్థ‌లు టార్గెట్ చేస్తున్న‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. న‌య‌న‌తార ప్ర‌చారానికి ఎందుకు రాదో? తాను ప‌ట్టిన కుందేల్ కి మూడే కాళ్లు ఎందుకు అంటుందా? తాము చూస్తామ‌ని మొండికేస్తున్నారుట‌. ఇక‌పై త‌మ సినిమాల్లో న‌టిస్తే గ‌నుక త‌ప్పక ప్ర‌చారానికి హాజ‌ర‌య్యేలా కండీష‌న్లు పెట్టాల‌ని కొన్ని కార్పోరేట్ సంస్థ‌లు ఏక‌మై నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వినిపిస్తుంది.

న‌య‌న‌తార‌నే కాదు...మిగ‌తా ఏ హీరోయిన్లు అయినా ప్ర‌చారం విష‌యంలో దిగి వ‌చ్చేలా ప్ర‌ణాళిక‌లు సిద్దం చేస్తోందిట‌. దీనికి సంబంధించి స‌ద‌రు కార్పోరేట్ కింగ్స్ ప్ర‌త్యేక‌మైన వ్యూహాన్ని అమ‌లు చేస్తున్నాయ‌ట‌. సినిమాకి సంబంధించి శాటిలైట్..ఓటీటీలో డిమాండ్ త‌గ్గించి విక్ర‌యించి హీరోయిన్ల పారితోషికాల్లో కొత ప‌డేలా ఓ ప్ర‌ణాళిక సిద్దం చేస్తున్నారుట‌. అక్క‌డ‌ వ‌చ్చే లాస్ ని హీరోయిన్ పారితోషికంలో బ్యాలెన్స్ చేసేలా కొత్త టెర్మ్స్ అండ్ కండీష‌న్స్ సిద్దం చేస్తున్నారుట‌. పారితోషికం అనే కాదు నిర్మాత‌పై హీరోయిన్లు మోపై అద‌న‌పు బారాల‌పైనా ఈ కండీష‌న్లు అన్నీ అప్లై అవుతాయ‌ని అంటున్నారు.

Tags:    

Similar News