తరుణ్ భాస్కర్​.. మాస్​ డామినేషన్​

వివరాళ్లోకి వెళితే.. తన తొలి చిత్రం పెళ్ళిచూపులతో ఇండస్ట్రీలో తాజాదనం తీసుకొచ్చి మొదటి ప్రయత్నంలోనే దర్శకుడిగా మంచి విజయాన్ని అందుకున్నారు.

Update: 2023-11-04 06:16 GMT

ఆయన చిత్రాల్లో కంటెంట్‌తో పాటు కామెడీ కూడా బిందాస్‌గా ఉంటుంది. షార్ట్‌ ఫిల్మ్స్‌తో కెరీర్‌ ప్రారంభించి రచయితగా, దర్శకుడిగా... అవుట్‌ అండ్‌ అవుట్‌ ఎంటర్‌టైనర్స్‌తో ఆడియన్స్‌కు బాగా కనెక్ట్‌ అయ్యారు. యాక్టర్​గానూ కూడా మంచి పాత్రలు పోషించి మల్టీ టాలెంటెడ్‌ అనిపించుకుంటున్నారు. తాజాగా ఆయన.. తన స్వీయదర్శకత్వంలోనే కీడా కోలాతో ఆడియెన్స్​ను మరోసారి మెప్పించారు. అయితే ఈ చిత్రంలో దర్శకుడు తరుణ్ భాస్కర్‌ను నటుడు తరుణ్ భాస్కర్ పూర్తిగా డామినేట్ చేసేశారు.

వివరాళ్లోకి వెళితే.. తన తొలి చిత్రం పెళ్ళిచూపులతో ఇండస్ట్రీలో తాజాదనం తీసుకొచ్చి మొదటి ప్రయత్నంలోనే దర్శకుడిగా మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత ఈ నగరానికి ఏమైంది? అంటూ వచ్చి యువతరాన్ని బాగా మెప్పించారు. ఆ తర్వాత నటుడిగా అవతారమెత్తిన ఆయన.. మీకు మాత్రమే చెప్తా సహా పలు చిత్రాల్లో ప్రత్యేక పాత్రలు చేశారు.

నటుడిగా ఆయన ఎంత మెప్పించినప్పటికీ.. దర్శకుడిగానే ఆయనకు అభిమానగణం ఎక్కువ. కానీ తాజాగా కీడా కోలా చిత్రంతో సీన్ రివర్స్ అయిపోయింది. ఈ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో రూపొందించడంతో పాటు నాయుడు అనే కీలక పాత్ర కూడా పోషించారు తరుణ్. ఇందులో దర్శకుడు తరుణ్ భాస్కర్‌ను నటుడు తరుణ్ భాస్కర్ పూర్తిగా డామినేట్ చేసేశారు.

సినిమా మొత్తాన్ని తమ భుజాల మీద నడిపించారు. చిత్రంలో నాయుడి పాత్ర ఎంట్రీతో ఎంటర్టైన్మెంట్ డోస్ పెరిగి కథనం ఊపందుకుంటుంది. తరుణ్ కనిపించిన ప్రతిసారీ నవ్వులకు ఢోకా లేకుండా ఉండటం, అలానే మంచి ఎలివేషన్ సీన్లు కూడా పడటంతో తరుణ్ పాత్రకు, ఆయన నటనకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఆయన పాత్రకు చాలా మంది ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు. అయితే ఈ సినిమాలో యాక్టర్‌గా మస్త్​ మెప్పించిన తరుణ్.. రైటర్ కమ్ డైరెక్టర్‌గా మాత్రం కాస్త అంచనాలను అందుకోలేకపోయారనే చెప్పాలి. సినిమా మంచి ఎంటర్​టైన్మెంట్​తో పాటిజివ్​ టాక్​ తెచ్చుకున్నప్పటికీ.. ఇంకా బలమైన కథ, బిగి ఉన్న కథనంతోడై ఉంటే బాగుండేదన్న అభిప్రాయాలు వినపడుతున్నాయి.

Tags:    

Similar News