.consent-eea { display:none; } .consent-ccpa{ display:none; } .amp-geo-group-eea .consent-eea { display:block; } .amp-geo-group-ccpa .consent-ccpa { display:block; }

కల్కి 2898ఏడీ.. అసలు సాంగ్ వచ్చేసింది!

తాజాగా చిత్ర యూనిట్ టక్కరటక్క వీడియో సాంగ్ ని యుట్యూబ్ లో రిలీజ్ చేశారు. దీనికి అనూహ్య స్పందన వస్తోంది. సినిమాలో కాస్తా ప్లెజెంట్ మూడ్ ని ఈ సాంగ్ క్రియేట్ చేస్తుంది.

Update: 2024-06-29 09:15 GMT

ప్రస్తుతం దేశం మొత్తం కల్కి 2898ఏడీ సినిమా గురించే చర్చ నడుస్తోంది. నాగ్ అశ్విన్ క్రియేటివ్ థాట్స్ నుంచి వచ్చిన ఇండియన్ మైథాలజీకి సైన్స్ ఫిక్షన్ జోడించి ఫ్యూచరిస్టిక్ మూవీగా కల్కి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకి తీసుకొని వచ్చారు. మొదటి రోజే 190 కోట్ల కలెక్షన్స్ ని కల్కి రాబట్టింది. మూడు గంటల నిడివి ఉన్న కూడా ఆడియన్స్ కల్కి చిత్రాన్ని థియేటర్స్ లో ఎంజాయ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా సాంగ్స్ కూడా ఉన్నాయి.

 

అవి ప్రేక్షకులకి బాగానే కనెక్ట్ అయ్యాయి. స్టోరీని డీవియేట్ చేసే విధంగా ఏ సాంగ్ కూడా లేదు. సిచువేషన్ కి తగ్గట్లుగానే సంతోష్ నారాయణన్ సాంగ్స్ ఇచ్చాడు. నాగ్ అశ్విన్ కూడా వాటిని కరెక్ట్ గా సెటప్ చేసుకున్నాడు. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో కాంప్లెక్స్ అని ఒకటి క్రియేట్ చేశారు. విలన్ సుప్రీమ్ యాస్మిన్ కూడా కంప్లెక్స్ లోనే ఉంటాడు. కేవలం డబ్బున్నవారు మాత్రమే కంప్లెక్స్ లో ఉండటానికి వీలుంటుంది.

అలాగే కంప్లెక్స్ కి వెళ్లాలని భైరవ ప్రయత్నం చేస్తాడు. దిశా పటానితో కలిసి కంప్లెక్స్ కి వెళ్లి అక్కడ నేచర్ ని భైరవ ఆశ్వాదిస్తాడు. భూమిపై ఉండే పకృతి, వృక్షాలు, నీరు కంప్లెక్స్ లో ఉంటాయి. అలాగే కంప్లెక్స్ లో అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలాంటి ఎన్విరాన్మెంట్ ని భైరవ ఆశ్వాదిస్తాడు. ఈ నేపథ్యంలో టక్కరటక్క అంటూ వచ్చే సాంగ్ ని పెట్టారు. సెలబ్రేషన్ మూడ్ లో ఈ సాంగ్ ఉంటుంది.

Read more!

తాజాగా చిత్ర యూనిట్ టక్కరటక్క వీడియో సాంగ్ ని యుట్యూబ్ లో రిలీజ్ చేశారు. దీనికి అనూహ్య స్పందన వస్తోంది. సినిమాలో కాస్తా ప్లెజెంట్ మూడ్ ని ఈ సాంగ్ క్రియేట్ చేస్తుంది. కల్కి మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు. సలార్ మూవీ 1000 కోట్లు దాటుతుందని ఎక్స్ పెక్ట్ చేశారు. అయితే ఆ సినిమా హిట్ అయిన భారీ కలెక్షన్స్ రాబట్టలేదు. అయితే కల్కి మూవీ మరల బాహుబలి 2 రేంజ్ విజయాన్ని అందుకుంటుందని అంచనా వేస్తున్నారు.

అశ్వద్ధామగా అమితాబ్ బచ్చన్ ఈ సినిమాలో హైఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో నటించారు. యాక్షన్ సీక్వెన్స్ చాలా పవర్ ఫుల్ గా ఉంటాయి. ముఖ్యంగా ప్రభాస్ చేసిన భైరవ క్యారెక్టర్, అశ్వద్ధామ మధ్య వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ పీక్ లో ఉంటూ గూస్ బాంబ్స్ క్రియేట్ చేశాయని చెప్పొచ్చు.

Full View
Tags:    

Similar News