'హనుమాన్'.. తేజా సజ్జా కాన్ఫిడెంట్ మాములుగా లేదుగా!

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా స్టార్ హీరోలతో పోటీ పడేందుకు రెడీ అయ్యాడు. ఈ హీరో నటిస్తున్న 'హనుమాన్' మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలవుతున్న సంగతి తెలిసిందే.

Update: 2023-11-18 09:56 GMT

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా స్టార్ హీరోలతో పోటీ పడేందుకు రెడీ అయ్యాడు. ఈ హీరో నటిస్తున్న 'హనుమాన్' మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సంక్రాంతి బరిలో మహేష్ బాబు, రవితేజ, నాగార్జున, వెంకటేష్ లాంటి బడా హీరోలు ఉన్నా తన సినిమా మీద ఉన్న నమ్మకంతో వాళ్లకు పోటీగా 'హనుమాన్' మూవీ ని విడుదల చేస్తున్నాడు.


టాలెంటెడ్ ఫిలిం మేకర్ ప్రశాంత్ వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. సినిమా అనౌన్స్మెంట్ నుంచే ఈ ప్రాజెక్టు పై ఇండస్ట్రీ తో పాటు ఆడియన్స్ లోనూ మంచి హైప్ నెలకొంది. ఇప్పటికే ప్రశాంత్ వర్మ, తేజ సజ్జ కాంబినేషన్లో 'జాంబిరెడ్డి' మూవీ మంచి సక్సెస్ అయింది. ఒక విధంగా చెప్పాలంటే తేజ సజ్జా ఈ మూవీ తోనే హీరోగా లైమ్ లైట్ లోకి వచ్చాడు. ఇక తాజాగా నటిస్తున్న 'హనుమాన్' మూవీతో కచ్చితంగా తనకు స్టార్ ఇమేజ్ వస్తుందనే ధీమాతో ఉన్నాడట ఈ యంగ్ హీరో.

అందుకే 'హనుమాన్' మూవీ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ప్రజెంట్ తన టైం మొత్తం ఈ సినిమా కోసమే కేటాయిస్తున్నాడట. అందుకే కొత్త ప్రాజెక్టులు ఏమీ ఓకే చేయడం లేదని అంటున్నారు. ఈ మధ్య యంగ్ హీరోలు ఓ సినిమా సెట్స్ పై ఉండగానే మరికొన్ని ప్రాజెక్ట్స్ ని ఓకే చేసుకున్నారు. విజయ్ దేవరకొండ, నిఖిల్, విశ్వక్ సేన్ లతో పాటూ మరికొందరు హీరోలు ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు.

కానీ తేజ సజ్జ మాత్రం అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నాడు. 'హనుమాన్' తో ఎలాగైనా భారీ సక్సెస్ అందుకొని టైర్ 2 హీరోల్లో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకోవాలని చూస్తున్నాడు. ఇక హనుమాన్ నుంచి ఇప్పటివరకు రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ చూస్తుంటే కచ్చితంగా తేజా సజ్జ అనుకున్నది జరిగేలా కనిపిస్తోంది. అందుకు ఓ చిన్న ఉదాహరణ ఏంటంటే, రీసెంట్ గా ప్రభాస్ 'ఆదిపురుష్' విఎఫ్ఎక్స్ పై ఎలాంటి ట్రోలింగ్ జరిగిందో తెలిసిందే కదా. దాదాపు రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో ప్రభాస్ లాంటి పాన్ ఇండియా హీరో తో సినిమా అంటే బెస్ట్ అవుట్ ఫుట్ చూపించాలి.

కానీ ఆ విషయంలో మేకర్స్ పూర్తిగా ఫెయిల్ అయ్యారు. అదే హనుమాన్ విషయానికొస్తే టీజర్ రిలీజ్ అయ్యాక అందులో విఎఫ్ఎక్స్ షాట్స్ చూసి అందరూ ఫిదా అయిపోయారు. చాలామంది హనుమాన్ టీజర్ లో ఉన్న వీఎఫ్ ఎక్స్ షాట్స్ ని 'ఆదిపురుష్' తో కంపేర్ చేశారు. అక్కడే హనుమాన్ మూవీకి ఇండస్ట్రీలో పాజిటివ్ హైప్ ఏర్పడింది. అదే హైప్ ని మూవీ టీం ఇప్పటికీ అలాగే కంటిన్యూ చేస్తూ వస్తోంది. త్వరలోనే ట్రైలర్ రిలీజ్ చేసి దాన్ని రెట్టింపు చేయడానికి సిద్ధమవుతోంది. మరి 'హనుమాన్' మీద ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్న తేజ సజ్జాకి ఈ మూవీ ఎలాంటి సక్సెస్ అందిస్తుందో చూడాలి.

Tags:    

Similar News