తెలుగు వారి 'ఆహా' పోయి మళ్లీ వచ్చింది
సెక్యూరిటీ రీజన్స్ చెప్పి గూగుల్ ప్లే స్టోర్ నుంచి వందల కొద్ది భారతీయ యాప్స్ ను తొలగించిన విషయం తెల్సిందే
సెక్యూరిటీ రీజన్స్ చెప్పి గూగుల్ ప్లే స్టోర్ నుంచి వందల కొద్ది భారతీయ యాప్స్ ను తొలగించిన విషయం తెల్సిందే. అందులో చాలా యాప్స్ ను ఇండియన్స్ తో పాటు విదేశాల్లో ఉన్న వారు కూడా రెగ్యులర్ గా వాడుతూ ఉన్నారు. గూగుల్ తో పలు సంస్థలు చర్చలు జరిపి తమ యాప్స్ ను తిరిగి తీసుకున్నారు.
గూగుల్ ప్లే స్టోర్ లోకి తిరిగి వచ్చిన యాప్స్ లో తెలుగు ఓటీటీ యాప్ 'ఆహా' కూడా ఉంది. తెలుగు ఓటీటీ ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా తీసుకు వచ్చిన ఆహా ఓటీటీ ని కూడా గూగుల్ ప్లేస్టోర్ తొలగించడం జరిగింది. ఆ విషయాన్ని స్వయంగా ఆహా టీమ్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.
కొన్ని గంటలు కూడా కాకుండానే ఆహా ఓటీటీని తిరిగి ప్లే స్టోర్ లోకి తీసుకు వచ్చారు. ఇందుకోసం ఆహా టెక్నికల్ టీం తీవ్రంగా శ్రమించినట్లుగా తెలుస్తోంది. సోషల్ మీడియా ద్వారా ఆహా ఓటీటీ తిరిగి ప్లే స్టోర్ లోకి వచ్చిందని అధికారికంగా టీం ప్రకటన చేయడం జరిగింది.
ఇక ఆహా లో తెలుగు మరియు తమిళ కంటెంట్ ను ముందు ముందు పెద్ద ఎత్తున స్ట్రీమింగ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. త్వరలో ఆహా సరికొత్త చిత్రం మిక్స్ అప్ ను స్ట్రీమింగ్ చేయబోతుంది. మార్చి 15న స్ట్రీమింగ్ కాబోతున్న ఆ సినిమా యూత్ కి కనెక్ట్ అయ్యేలా ఉంటుందట. ఇంకా సిరీస్ లు మరియు షో లు కూడా రాబోయే రెండు నెలల్లో రాబోతున్నాయి.