ఆ హీరోయిన్ గ్లామర్ ను మనోళ్లు వాడట్లేదు ఎందుకు..?
అయితే కీర్తి సురేష్ కెరీర్ లో మహానటి సినిమా ఒక గొప్ప కానుక అని చెప్పొచ్చు.
మలయాళంలో అప్పటికే హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్ తెలుగులో రామ్ సరసన నేను శైలజ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా టైం లోనే తెలుగు ఆడియన్స్ అంతా కీర్తి కి ఫ్లాట్ అయిపోయారు. ఆ సినిమా నుంచి ఒక్కొక్క సినిమాతో కీర్తి సురేష్ ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. తెలుగుతో పాటు తమిళంలో కూడా కీర్తి తన ఫాం కొనసాగించింది. అయితే కీర్తి సురేష్ కెరీర్ లో మహానటి సినిమా ఒక గొప్ప కానుక అని చెప్పొచ్చు.
మహానటి సావిత్రి జీవిత కథతో తెరకెక్కిన ఈ సినిమాను నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేశాడు. వైజయంతి మూవీస్ బ్యానర్ లో రూపొందించిన ఈ సినిమాకు పాతిక కోట్ల పైన బడ్జెట్ పెట్టడం అప్పట్లో సినీ పెద్దలను కూడా ఆశ్చర్యపరచింది. నాగ్ అశ్విన్ కీర్తి సురేష్ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టింది. మహానటి సినిమా తో కీర్తి సురేష్ నేషనల్ అవార్డు కూడా సొంతం చేసుకుంది.
తనకు జాతీయ అవార్డు అందించిన తెలుగు పరిశ్రమ మీద స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తుంది కీర్తి సురేష్. అయితే ఈమధ్య కీర్తి సురేష్ కూడా గ్లామర్ సైడ్ ఓపెన్ అవుతుంది. ఇన్నాళ్లు కేవలం అభినయ ప్రాధాన్యత ఉన్న పాత్రలే చేస్తూ వచ్చిన కీర్తి సురేష్ ఇక మీదట స్కిన్ షోకి రెడీ అంటూ సిగ్నల్ ఇస్తుంది. ముఖ్యంగా అమ్మడు బాలీవుడ్ వెళ్లిందో లేదో అక్కడ అదిరిపోయే రేంజ్ లో గ్లామర్ షో చేస్తుంది.
మరి తనకు ఇంత క్రేజ్ తెచ్చిన తెలుగు సినిమాల్లో కీర్తి సురేష్ గ్లామర్ షో చేయకూడదని ఫిక్స్ అయ్యిందా లేదా కీర్తిని కేవలం ఇక్కడ ఆడియన్స్ ఇలానే చూస్తున్నారు కదా అని అలానే ఫిక్స్ అయ్యారా అన్నది తెలియాల్సి ఉంది. కీర్తి గ్లామర్ ని మన మేకర్స్ ఎందుకు ఉపయోగించట్లేదు అంటూ కీర్తి ఫ్యాన్స్ టార్గెట్ చేస్తున్నారు. ప్రస్తుతం తమిళంలో రెండు సినిమాలు చేస్తున్న కీర్తి సురేష్ తెలుగులో ఒక్క సినిమా కూడా సైన్ చేయలేదు. దసరా సినిమాలో వెన్నెల పాత్రతో మరోసారి తన సత్తా చాటిన అమ్మడు ఎలాంటి పాత్ర అయినా చేసేందుకు రెడీ అని చెబుతుంది. తెలుగులో కూడా కీర్తి సురేష్ హీరోయిన్ గా ఒకటి రెండు ప్రాజెక్టులు డిస్కషన్ స్టేజ్ లో ఉన్నాయని తెలుస్తుండగా వాటి డీటెయిల్స్ బయటకు రావాల్సి ఉంది.