తెలుగులో నెంబర్ వన్ హీరో ఎవరు? మీ కామెంట్ చెప్పండి!
టాలీవుడ్‌లో నెంబర్ వన్ ఎవరు ? అనే ఆసక్తికరమైన చర్చ ఇప్పడు టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు అభిమానుల్లోనూ మొదలైంది
టాలీవుడ్‌లో నెంబర్ వన్ ఎవరు ? అనే ఆసక్తికరమైన చర్చ ఇప్పడు టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు అభిమానుల్లోనూ మొదలైంది. ఇంతకీ టాలీవుడ్‌లో నెంబర్ వన్ హీరో ఎవరు? ఎలా నిర్ణయించాలి?.. ఏ ప్రతిపదికన నెంబర్ వన్ హీరోని ఫైనల్ చేయాలనుకుంటున్నారు? ..దీనిపై అభిమానుల్లో జరుగుతున్న చర్చ ఏంటీ?..ఇప్పటి వరకు ఉన్న లెక్కలు ఇటీవలే ఎందుకు మారిపోయాయి?.. ఎవరిని ముందు వరుసలోకి తీసుకొచ్చాయి? అన్నది ఇప్పుడు చూద్దాం.
1. అల్లు అర్జున్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప'తో అనుకోకుండా పాన్ ఇండియా స్టార్‌ల జాబితాలో చేరిపోయాడు. ముందు ఈ ఇమేజ్‌ని ప్లాన్ చేసుకోకపోయినా 'పుష్ప' హ్యూజ్ హిట్‌తో క్రేజీ స్టార్‌గా మారాడు. పాన్ ఇండియా లెవెల్లో బన్నీ ఇంతకు ముందు సినిమాలు చేయకపోయినా డబ్బింగ్ సినిమాలతో దేశ వ్యాప్తంగా ప్రేక్షకులకు చేరువయ్యాడు. డాన్స్ పరంగానూ బన్నీ అంటే ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఇక మలయాళంలోనూ తన సినిమాలతో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ని సొంతం చేసుకున్నాడు కూడా. తమిళనాడుతో పాటు నార్త్‌లోనూ బన్నీ డాన్స్‌కు భారీ సంఖ్యలో ఫ్యాన్స్ ఉన్నారు. సెలబ్రిటీల్లోనూ బన్నీ అంటే అభిమానించే వాళ్లున్నారు. తాజాగా జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డుని దక్కించుకుని తొలి తెలుగు నటుడిగా అరుదైన రికార్డుని దక్కించుకుని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యాడు. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ నెంబర్ వన్ హీరో అల్లు అర్జున్ అనడానికి ఇది సరిపోతుందేమో అనే కామెంట్‌లు వినిపిస్తున్నాయి.
2. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్
'బాహుబలి' సిరీస్ సినిమాలతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అనిపించుకున్నారు. తను క్రియేట్ చేసిన రికార్డ్స్ ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి. ఇప్పటికీ వాటిని ఏ హీరో కూడా బ్రేక్ చేయలేకపోయాడు. 'బాహుబలి' క్రేజ్‌తో చేసిన 'సాహో' కూడా భారీ స్థాయిలో బ్లాక్ బస్టర్ అనిపించుకోకున్నా కానీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లని రాబట్టింది. విచిత్రం ఏంటంటే తెలుగు మార్కెట్‌ని మించి ఈ సినిమా హిందీలో భారీ స్థాయిలో వసూళ్లని రాబట్టింది. రీసెంట్‌గా చేసిన 'ఆదిపురుష్' డిజాస్టర్ అయినా సరే కోట్లల్లో వసూళ్లు వచ్చాయి. ఈ క్రేజ్‌తో త్వరలో 'సలార్'తో రాబోతున్నాడు. దీని తరువాత కల్కి, మారుతి సినిమా, సందీప్ వంగ 'స్పిరిట్' సినిమాలున్నాయి. హీరోగా ఇప్పటికే ఓ రేంజ్‌ని సెట్ చేసుకున్నాడు. ఇండియన్ సినిమా స్థాయిని, టాలీవుడ్ క్రేజ్‌ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాడు. ముందు పాన్ ఇండియా స్టార్ అనిపించుకున్నాడు. దేశ వ్యాప్తంగా క్రేజ్‌ని దక్కించుకున్నాడు. కాబట్టి ఈ రకంగా చూసుకుంటే ప్రభాస్‌నే ఇండియన్ నెంబర్ వన్ హీరోనా?..
3. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్..
జక్కన్న తెరకెక్కించిన 'ఆర్ ఆర్ ఆర్'తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇంటర్నేషనల్ స్టార్ అనిపించుకున్నాడు. ఈ సినిమాతో ఏకంగా గ్లోబల్ స్టార్‌ల జాబితాలో చేరిపోయాడు. బాలీవుడ్‌లోనూ భారీ క్రేజ్‌ని దక్కించుకున్నాడు. 'ఆర్ ఆర్ ఆర్'తో చరణ్‌కు జపాన్‌లోనూ భారీ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. వరల్డ్ వైడ్‌గా స్టార్ హీరోగా క్రేజ్‌ని సెట్ చేసుకున్నాడు. అంతే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా చరణ్ సినిమాలకు మంచి మార్కెట్ ఏర్పడింది. హాలీవుడ్ డైరెక్టర్స్, యాక్టర్స్ కూడా చరణ్‌తో కలిసి సినిమాలు చేయాలనుకుంటున్నారు. జేమ్స్ కెమెరూన్ కూడా చరణ్ నటనని అభినందించడంతో ఆయన రేంజ్ ఏంటో తేలిపోయింది. ప్రస్తుతం శంకర్‌తో 'గేహ్ ఛేంజర్' చేస్తున్న చరణ్ తరువాత బుచ్చిబాబుతో మరో పాన్ ఇండియా మూవీకి శ్రీకారం చుట్టబోతున్నాడు. దీని తరువాత వరుసగా పాన్ ఇండియా సినిమాలని లైన్‌లో పెడుతున్నాడు. ఇలా చూస్తే చరణ్ నెంబర్ వన్ హీరో అనుకోవాలా?..
4. జక్కన్న మెచ్చిన యంగ్ టైగర్...
నెంబర్ వన్ హీరోల రేసులో నిలిచిన మరో క్రేజీ స్టార్ జూనియర్ ఎన్టీఆర్. 'ఆర్ ఆర్ ఆర్' సినిమాతో ఎన్టీఆర్ స్థాయి, మార్కెట్ కూడా రికార్డు స్థాయికి చేరింది. ఇంటర్నేషనల్ వైడ్‌గా ఎన్టీఆర్ కు భారీ క్రేజ్ పెరిగింది. 'కొమురం భీముడో'.. సాంగ్‌లో ఎన్టీఆర్ కళ్లతో పలికించిన హావభావాలకు పలువురు హాలీవుడ్ యాక్టర్లు, డైరెక్టర్లు ఫిదా అయ్యారు. కొంత మంది దర్శకులు ఎన్టీఆర్ సై అంటూ అతనితో సినిమా చేయడానికి రెడీ అంటూ ఓపెన్ ఆఫర్లు కూడా ఇవ్వడం తెలిసిందే. జపాన్‌తో పాటు ఇతర దేశాల్లోనూ భారీ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. నార్త్ లోనూ ఎన్టీఆర్ అంటే పడి చస్తున్నారు. ఆ కారణంగానే ఎన్టీఆర్ ఇప్పుడు 'వార్ 2'లోనూ నటిస్తున్న విషయం తెలిసిందే. కొరటాలతో దేవర చేస్తున్న ఎన్టీఆర్ 'ఆర్ ఆర్ ఆర్'తో గ్లోబల్ స్టార్ అనిపించుకున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ కూడా నెంబర్ వన్ స్టార్ అనుకోవాలా?..
5. సూపర్ స్టార్ మహేష్ బాబు
టాలీవుడ్ ఇండస్ట్రీలో రికార్డ్‌ల్ని తిరగరాసిన సినిమాలు చేసిన మహేష్ బాబు ఇంత వరకు ఒక్కటంటే ఒక్క పాన్ ఇండియా సినిమా కూడా చేయలేదు. కానీ పాన్ ఇండియా వైడ్‌గా క్రేజ్‌ని సొంతం చేసుకోవడం లోనూ టాలీవుడ్ స్టార్ హీరోలకు మించి కమర్షియల్ యాడ్‌లలో నటించడంలోనూ మహేష్ ముందు వరుసలో ఉన్నాడు. త్రివిక్రమ్‌తో 'గుంటూరు కారం' చేస్తున్న మహేష్ దీని తరువాత రాజమౌళితో పాన్ ఇండియా మూవీ చేయబోతున్నాడు. దీని తరువాత ఆయన స్థాయి ఎలా మారనుందన్నది వేచి చూడాల్సిందే. మహేష్‌కు ఇప్పటికే ఇండియా వైడ్ా భారీ క్రేజ్ ఉంది. హాలీవుడ్ హీరో అంటూ ఇప్పటికే నెట్టింట కామెంట్ లు కూడా వినిపిస్తుంటాయి. ఈ రకంగా చూసుకుంటే మహేష్ బాబు నెంబర్ వన్ హీరోనా?..
6. పవర్ స్టార్ పవన్ కల్యాణ్..
పాలిటిక్స్‌లోకి వెళ్లిపోయాడు కాబట్టి రేసులో వెనకబడ్డాడు కానీ పవన్ కున్న క్రేజే వేరు. ఆయనకంటూ ప్రత్యేమైన ఫ్యాన్ బేస్ ఉంది. మళ్లీ పవన్ క్రేజ్‌కు తగ్గ సినిమాలు పడితే ఆయన రేంజ్ ఎక్కడికో వెళ్లిపోతుంది. సగం సినిమాలు, సగం పాలిటిక్స్‌తో బిజీగా ఉన్నా ఆయన క్రేజ్ ఏ మాత్ం తగ్గలేదు. అయితే పూర్తి స్థాయిలో ఆయన ఇమేజ్‌కి తగ్గ సినిమా చేస్తే దాని ఇంపాక్ట్ ఏ స్థాయిలో ఉంటుందో ఊమించుకోవచ్చు. దీన్ని బట్టి పవనే నెంబర్ వన్ హీరో అనుకోవచ్చేమో?..
ఈ ఆర్టికల్ మీది మీ అభిప్రాయం చెప్పండి. అలాగేఎవరు నెంబర్ వన్ హీరో అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.