10 డేస్ నాన్ స్టాప్ గేమ్ ఛేంజర్!
ఈ రోజు నుంచి 10 రోజుల పాటు నిరవధికంగా షూటింగ్ జరుగుతుందని చిత్ర వర్గాల నుంచి తెలిసింది.
ఆర్ సీ 15 కి చరణ్-శంకర్ గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. చరణ్ అయ్యప్ప మాల ధరించడం..శంకర్ వేర్వేరు పనుల్లో బిజీ అవ్వడంతో కొన్ని రోజులుగా షూటింగ్ జరగలేదు. దాదాపు రెండు..మూడు నెలలుగా ప్రాజెక్ట్ కి సంబంధించి ఎలాంటి డెవలెప్ మెంట్స్ కూడా తెరపైకి రాలేదు. ఈ నేపథ్యంలో తాజాగా షూటింగ్ పున ప్రారంభించినట్లు తెలుస్తోంది. సోమవారం నుంచి హైదరాబాద్ లో తిరగి షూటింగ్ ప్రారంభమైందని సమాచారం.
ఈ రోజు నుంచి 10 రోజుల పాటు నిరవధికంగా షూటింగ్ జరుగుతుందని చిత్ర వర్గాల నుంచి తెలిసింది. పాత షెడ్యూ ల్ కి కొనసాగింపు అని తెలుస్తోంది. గతంలో హైదరాబాద్ లో షూటింగ్ చేస్తుండగా మధ్యలో ఆపేసారు. ఆ తర్వాత బ్యాలెన్స్ 10 రోజుల షెడ్యూల్ మిగిలిపోయింది. ఇప్పుడా పెండింగ్ షెడ్యూల్ పూర్తిచేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రధాన తారగాణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారుట.
చరణ్ తో పాటు కీలక నటులంతా ఈ షెడ్యూల్ లో భాగమవుతున్నట్లు సమాచారం. దీంతో ఇకపై షూటింగ్ బ్రేక్ వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. ఇప్పటికే చిత్రీకరణ బాగా ఆలస్యమైన నేపథ్యంలో ఇక గ్యాప్ తీసుకోకుండా కొనసాగించాలని చరణ్-శంకర్ భావిస్తున్నారుట. కొన్ని విదేశీ షెడ్యూల్స్ కూడా ఉన్నాయట. ఈ నేపథ్యంలో చెన్నై..హైదరాబాద్ షెడ్యూల్స్ మొత్తం పూర్తయిన తర్వాతే విదేశాలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
మరోవైపు చరణ్ 16వ చిత్రాన్ని కూడా సెట్స్ పైకి తీసుకెళ్లాలని చూస్తున్నాడు. అన్ని అనుకున్నట్లు జరిగితే డిసెంబర్ నుంచే షూటింగ్ ప్రారంభించాలన్నది ఆయన ప్లాన్. అయితే అది శంకర్ మీద ఆధారపడి ఉంటుంది. గేమ్ ఛేంజర్ లో చరణ్ కి సంబంధించి మేజర్ షెడ్యూల్స్ పూర్తయితే చరణ్ అనుకున్నట్లు జరుగుతుంది. లేదంటే వెయిట్ చేయక తప్పదు. మరోవైపు గేమ్ ఛేంజర్ నిర్మాత దిల్ రాజు కూడా షూటింగ్ డిలే విషయంలో అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. వీటన్నింటి నడుమ శంకర్ తన పని వేగంగా పూర్తిచేసే అవకాశం ఉందని తెలుస్తోంది.