తలైవర్ 171 .. లోకేష్ కనగరాజ్ జానర్ కాదా?
అంతేకాదు.. రజనీ కోసం అత్యుత్తమమైన స్క్రిప్టును చేయాల్సి ఉంది. స్క్రిప్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉందని లోకేష్ కనగరాజ్ పేర్కొన్నారు.
కార్తీతో ఖైదీ, కమల్ హాసన్ తో విక్రమ్, విజయ్ తో లియో చిత్రాల్ని తెరకెక్కించాడు లోకేష్ కనగరాజ్. ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు సాధించాయి. ఖైదీ, విక్రమ్ చిత్రాలకు గొప్ప ప్రశంసలు దక్కాయి. అయితే లియో చిత్రంపై క్రిటిక్స్ నుంచి చాలా విమర్శలు వెల్లువెత్తాయి. సెకండాఫ్ లో స్క్రిప్టు చాలా వీక్ అని కూడా విజయ్ తండ్రి దర్శకుడు లోకేష్‌ని విమర్శించారు.
అందుకేనేమో ఇటీవల లోకేష్ కనగరాజ్ తన తదుపరి సినిమా స్క్రిప్టు కోసం ఎక్కువ సమయాన్ని తీసుకుంటున్నారు. ఒక కార్యక్రమంలో లోకేష్ 'తలైవర్ 171' (వర్కింగ్ టైటిల్) గురించి మాత్రమే ఆలోచిస్తున్నట్లు వెల్లడించాడు. అందుకే సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉన్నానని, ప్రజలు తనను సంప్రదించలేకపోతున్నారని తెలిపారు. తాను రజనీతో నిరంతరం టచ్‌లో ఉంటానని, ప్రీ-ప్రొడక్షన్ కోసం తనకు 2-3 నెలల సమయం ఉందని లోకేశ్ తెలిపారు.
అంతేకాదు.. రజనీ కోసం అత్యుత్తమమైన స్క్రిప్టును చేయాల్సి ఉంది. స్క్రిప్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉందని లోకేష్ కనగరాజ్ పేర్కొన్నారు. ఓ పాత ఇంటర్వ్యూలో కోలీవుడ్ దర్శకుడు తాను గ్రే-షేడెడ్ పాత్రలో రజనీని ప్రెజెంట్ చేస్తానని .. కానీ ఈ సినిమా LCUలో భాగం కాదని చెప్పాడు. తలైవర్ 171 కూడా గతంలో లోకేష్ సినిమాల మాదిరిగా డ్రగ్స్ నేపథ్యంలో సాగదు.. ఇది ఒక ప్రత్యేకమైన విధానంతో కూడిన ప్రయోగాత్మక చిత్రం అవుతుంది. సన్ పిక్చర్స్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తుంది.
లియోపై విమర్శలతోనే జాగ్రత్తలు:
లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన 'లియో' కొన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చలేదు. అందుకే సూపర్ స్టార్ రజనీకాంత్‌తో తన తదుపరి చిత్రం స్క్రిప్ట్‌పై దృష్టి పెట్టడానికి స్టార్ డైరెక్టర్ సోషల్ మీడియా నుండి తాత్కాలిక విరామం తీసుకున్నాడు. వందశాతం స్క్రిప్టు పైనే ఫోకస్ పెట్టాడు. లియోతో తనకు ఎదురైన విమర్శలేవీ తిరిగి రిపీట్ కాకూడదని భావిస్తున్నాడట. అందుకే ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.