ఈసారి తలైవా వంతు.. ఆ రికార్డులే టార్గెట్

ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా జైలర్ తో సత్తా చాటాలి.

Update: 2023-08-08 04:26 GMT

సూపర్ స్టార్ రజినీకాంత్ కి ఇండియాలోనే టాప్ స్టార్స్ లో ఒకరిగా ఉన్నారు.72 ఏళ్ళ వయస్సులో కూడా అంతే ఉత్సాహంతో సూపర్ స్టార్ సినిమాలు చేస్తూ ఉన్నారు. సినిమాల పరంగా ప్రస్తుత జెనరేషన్ హీరోలతో పోటీ పడుతున్నారు. రజినీకాంత్ నుంచి ఈ నెల 10న జైలర్ మూవీ ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఏకంగా 225 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని కళానిధి మారన్ సన్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మించారు.

ఈ సినిమా కోసం కెరియర్ లోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ రజినీకాంత్ తీసుకున్నట్లు తెలుస్తోంది. గత కొన్నేళ్ళుగా రజినీకాంత్ కి సరైన హిట్ పడటం లేదు. శంకర్ దర్శకత్వంలో వచ్చిన రోబో మూవీ రజిని కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. తరువాత ఆ స్థాయి అందుకునే మూవీ ఒక్కటి రాలేదు. ఎక్కువగా యంగ్ దర్శకులతోనే రజినీకాంత్ సినిమాలు చేస్తున్నారు. అయితే సూపర్ స్టార్ మూవీస్ అనేసరికి ప్రేక్షకులు హైఎక్స్ పెక్టేషన్స్ తో వస్తారు.

వాటిని అందుకోవడంలో దర్శకులు తడబడుతున్నారు. అయితే జైలర్ సినిమాతో సూపర్ స్టార్ తన స్టామినా మళ్ళీ చూపించాల్సిన సమయం వచ్చింది. కోలీవుడ్ లో ఇళయదళపతి విజయ్ తన సినిమాలతో 300 కోట్ల మార్క్ ఈజీగా అందుకుంటున్నారు. ఈ ఏడాది ఎవరేజ్ స్టొరీతో వచ్చిన వారిసు మూవీ కూడా ట్రిపుల్ సెంచరీ క్రాస్ చేసింది. లియో మూవీ అయితే 500 కోట్ల టార్గెట్ తో రిలీజ్ కి రెడీ సిద్ధం అవుతోంది.

ఇక మొన్నటి వరకు ఫ్లాప్ లతో కెరియర్ ఎండ్ అయిపోయిందనే విమర్శకులు తెచ్చుకున్న కమల్ హాసన్ విక్రమ్ మూవీతో ఫామ్ లోకి వచ్చారు. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 415 కోట్లు కలెక్ట్ చేసింది. రిలీజ్ అయిన అన్ని భాషలలో విక్రమ్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు ఇండియన్ 2 మూవీ ఏకంగా 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా జైలర్ తో సత్తా చాటాలి.

కచ్చితంగా ఈ సినిమా 300 కోట్ల మార్క్ ని కలెక్షన్స్ పరంగా అందుకుంటే మళ్ళీ సూపర్ స్టార్ స్టామినా ఏంటి అనేది అందరికి తెలిస్తుంది. పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కాబోతున్న మూవీ కావడంతో ఈ ట్రిపుల్ సెంచరీ కలెక్షన్స్ అందుకోవడం పెద్ద కష్టం కాకపోవచ్చు. కాని సినిమా కచ్చితంగా హైఎక్స్ పెక్టేషన్స్ తో వచ్చే సూపర్ స్టార్ అభిమానులని ఆకట్టుకోవాల్సిన అవసరం ఉంది. వీరి నుంచి మౌత్ టాక్ ద్వారా జనాల్లోకి బలంగా మూవీ వెళ్తుంది.

Tags:    

Similar News