తమన్‌కి 2025లో వాయింపు తప్పేలా లేదు!
గత ఏడాది ఆరు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన థమన్ అందులో ఒక్క సినిమా సైతం మ్యూజికల్ హిట్ అందుకోక పోవడంతో కాస్త స్లో అయినట్లు అనిపించింది.
గత ఏడాది ఆరు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన థమన్ అందులో ఒక్క సినిమా సైతం మ్యూజికల్ హిట్ అందుకోక పోవడంతో కాస్త స్లో అయినట్లు అనిపించింది. ఈ ఏడాది ఇప్పటి వరకు గుంటూరు కారం సినిమాతో పాటు రసవతి, సబ్ ధామ్ అనే తమిళ సినిమాలతో వచ్చాడు. గుంటూరు కారం మ్యూజికల్‌గా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నా కమర్షియల్‌గా నిరాశ పరిచింది. దాంతో థమన్ నుంచి మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కోసం ఫ్యాన్స్‌తో పాటు, ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాదిలో థమన్ సంగీతం అందిస్తున్న సినిమాల్లో సింగం అగైన్, బేబీ జాన్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఆ రెండూ హిందీ సినిమాలే కావడం విశేషం.
హిందీ సినిమాలకు సంగీత దర్శకుడిగా వ్యవహరించడం కంటే ఆయన నుంచి తెలుగు, తమిళ సినిమాలను ఎక్కువ మంది ఆశిస్తూ ఉంటారు. ఈ ఏడాది గుంటూరు కారంతో మినహా మిగిలిన సినిమాలతో నిరాశ పరచిన థమన్ వచ్చే ఏడాది మాత్రం సాలిడ్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ముఖ్యంగా ఆయన సంగీతం అందిస్తున్న రాజాసాబ్ సినిమా వచ్చే ఏడాది సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న ఆ సినిమా నుంచి ఇటీవలే మోషన్ పోస్టర్ వచ్చింది. మోషన్ పోస్టర్ మ్యూజిక్ కి పాజిటివ్ మార్కులు పడ్డాయి. త్వరలోనే టీజర్ ని రాజాసాబ్ మేకర్స్ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.
వచ్చే ఏడాదిలో రాబోతున్న మరో భారీ సినిమా 'ఓజీ'. పవన్ కళ్యాణ్ హీరోగా సాహో సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఓజీ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్‌లోనే విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. పవన్ సినిమా కనుక థమన్ నుంచి అదనపు వర్క్ ని ఆశించవచ్చు. రాజాసాబ్, ఓజీ సినిమాలు మాత్రమే కాకుండా వచ్చే ఏడాది ఆయన సంగీత సారధ్యంలో గేమ్ ఛేంజర్ సినిమా సైతం రాబోతుంది. రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న గేమ్ ఛేంజర్ నుంచి ఇప్పటికే రెండు పాటలు వచ్చాయి. ఆ పాటలు మంచి స్పందన దక్కించుకున్నాయి. సంక్రాంతి సీజన్ కి గేమ్ ఛేంజర్ రాబోతుంది. సంక్రాంతి మొదలుకుని వరుసగా థమన్ సినిమాలు ఉన్నాయి.
ఒకేసారి రెండు మూడు సినిమాలు వచ్చే అవకాశాలు లేకపోలేదు. అందుకే ఆయన పై పని ఒత్తిడి అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. పాటలు, రీ రికార్డింగ్, బీజీఎం, టీజర్ లకు వర్క్ ఇలా అన్నింటిని బ్యాలన్స్ చేస్తూ వెళ్లాలి అంటే థమన్ చాలా కష్టపడాల్సి ఉంటుంది అంటూ ఆయన సన్నిహితులు చెబుతున్నారు. బాలకృష్ణ తో బోయపాటి చేయబోతున్న అఖండ 2 సినిమాకు థమన్ ను సంగీత దర్శకుడిగా ఎంపిక చేయడం జరిగింది. కనుక ఆ సినిమా కోసం మరోసారి బాక్స్ లు బద్దలు కొట్టే విధంగా థమన్ నుంచి మ్యూజిక్ ను ఆశిస్తున్నారు. కనుక థమన్ అఖండ 2 కోసం ది బెస్ట్ ఔట్ పుట్ ఇవ్వాల్సి ఉంది. మొత్తానికి వచ్చే ఏడాది పెద్ద సినిమాలు చేతిలో ఉన్న కారణంగా థమన్ కి భారీ వాయింపు తప్పదనే అభిప్రాయంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.