బ‌క్కోడికి ర‌జ‌నీకాంత్..బండోడికి బాల‌య్య‌!

టాలీవుడ్ థ‌మ‌న్ ఇప్పుడు పుల్ స్వింగ్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. స్టార్ హీరోల సినిమాల‌న్నింటికి అత‌డే సంగీతం అందిస్తున్నాడు.

Update: 2025-01-07 07:01 GMT

టాలీవుడ్ థ‌మ‌న్ ఇప్పుడు పుల్ స్వింగ్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. స్టార్ హీరోల సినిమాల‌న్నింటికి అత‌డే సంగీతం అందిస్తున్నాడు. ఏస్టార్ హీరో సినిమా చూసినా థ‌మ‌న్ పేరే కనిపిస్తుంది. ఇక న‌టసింహ బాల‌కృష్ణ అయితే థ‌మ‌న్ ని అస్స‌లు వ‌దిలి పెట్ట‌డం లేదు. తాను ఏ సినిమా చేసినా త‌మ‌నే కావాలంటున్నాడు. చివ‌రికి బాల‌య్య ఇష్ట‌ప‌డే మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా త‌మ‌న్ మారిపోయాడు. శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న `గేమ్ ఛేంజ‌ర్` సినిమాకి త‌మ‌నే సంగీతం అందిస్తున్నాడు.

రెహమాన్, హ్యారిస్ జైరాజ్ లాంటి వాళ్ల‌నే ప‌క్క‌న‌బెట్టి శంక‌ర్ త‌మ‌న్ తీసుకోవడం అన్న‌ది అత‌డి ప్రాధాన్య‌త చెబుతుంది. ఇలా ఎక్క‌డ చూసిన త‌మ‌న్ జ‌ప‌మే క‌నిపిస్తుంది. అయితే త‌మ‌న్ కి ఇలా అవ‌కాశాలు రావ‌డం వెనుక మ‌రో కార‌ణంగా కూడా వినిపిస్తుంది. అత‌డు నిర్మాత‌ల‌కు అందుబాటులో ఉంటాడ‌ని, పారితోషికం విష‌యంలో మరీ అంత ప‌ట్టు ప‌ట్టి ఉండ‌డ‌ని, నిర్మాత‌ల‌కు కాస్త వెసులుబాటు ఇస్తాడు? అనే ఇమేజ్ త‌మ‌న్ కి ఉంది.

ఆ కార‌ణంగానూ త‌మ‌న్ అంటే హీరోలు లైక్ చేస్తున్నార‌ని వినిపిస్తుంది. ఆ సంగ‌తి ప‌క్క‌న‌బెడితే? తాజాగా `బ‌క్కోడికి ర‌జనీకాంత్..బండొడికి బాల‌య్య` ఉన్నాడంటూ ఓ కామంట్ చేసాడు స‌ర‌దాగా. అందుకో బ‌ల‌మైన కార‌ణం లేక‌పో లేదు. కోలీవుడ్ లో ఈ మ‌ధ్య కాలంలో సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టిస్తోన్న అన్ని సినిమాల‌కు అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. అవి మ్యూజిక‌ల్ గా సంచ‌ల‌నమ‌వుతున్నాయి.

సినిమాలు మంచి విజ‌యం సాధిస్తు న్నాయి. దీంతో ర‌జ‌నీకాంత్....అభిమాన మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా అనిరుద్ మారిపోయాడు. ఇక టాలీవుడ్ లో బాల‌య్య పిలిచి మ‌రీ త‌మ‌న్ కి అవ‌కాశాలు ఇస్తున్నారు. ఈ మ‌ధ్య వ‌రుస‌గా రిలీజ్ అయిన బాల‌య్య సినిమాల‌కు త‌మ‌న్ మాత్ర‌మే సంగీతం అందించారు. చాలా మంది మ్యూజిక్ డైరెక్ట‌ర్లు ఉన్నా? బాల‌య్య ఆ ఛాన్స్ తీసుకోలేదు. త‌మ‌న్ కావాలంటూ ప‌ట్టుబ‌ట్టి మ‌రీ తీసుకుంటున్నారు. అందుకే ఏ హీరో అవ‌కాశం ఇచ్చినా? ఇవ్వ‌క‌పోయినా అనీరుద్ కి ర‌జ‌నీకాంత్...థ‌మ‌న్ కి బాల‌య్య ద‌గ్గ‌ర ఛాన్సులెప్పుడు ఉంటాయ‌నే అర్ధం వ‌చ్చేలా మాట్లాడారు.

Tags:    

Similar News