'చైతూ - సాయి పల్లివి' , దేవి - చైతూ, .. ఎప్పుడొచ్చినా హిట్టే!

ఇప్పుడు చైతూ, పల్లవి కాంబోలో వస్తున్న తండేల్ పాటలు కూడా అలరిస్తున్నాయి. అదే సమయంలో నాగచైతన్య 100% లవ్ మూవీకి దేవిశ్రీనే మ్యూజిక్ అందించారు.

Update: 2025-01-25 06:31 GMT

టాలీవుడ్ క్యూట్ రీల్ కపుల్ నాగచైతన్య, సాయిపల్లవి.. మరోసారి తండేల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ తో లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న తండేల్ ను ప్రముఖ గీతా ఆర్ట్స్ బ్యానర్‌ పై బన్నీ వాసు నిర్మిస్తుండగా.. అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకున్న తండేల్.. వచ్చే నెల 7వ తేదీన రిలీజ్ కు సిద్ధమవుతోంది.

అయితే ప్రస్తుత రోజుల్లో సినిమా ప్రమోషన్స్ లో మ్యూజిక్, సాంగ్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. సాంగ్స్ రిలీజ్ అవ్వగానే వాటికి వచ్చిన రెస్పాన్స్ బట్టి.. మూవీ ఎంత రీచ్ అవ్వగలదో ఊహించేస్తున్నారు. అలాగే ఇప్పుడు మ్యూజిక్ విషయంలో తండేల్ మేకర్స్ హిట్ కొట్టేసినట్టేనని చెప్పాలి. ఇప్పటి వరకు వచ్చిన మూడు సాంగ్స్ కూడా చార్ట్ బస్టర్స్ అయ్యి స్మాషింగ్ హిట్స్ గా నిలిచాయి.

Full View

రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ కు అంతా మెస్మరైజ్ అయిపోయారు. సాంగ్స్ ను రిపీట్ మోడ్ లో వింటూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు మ్యూజిక్ లవర్స్. ఫస్ట్ సాంగ్ బుజ్జి తల్లి రెండు నెలల క్రితం రిలీజ్ అవ్వగా.. డివోషనల్ సాంగ్ నమో నమో శివాయ 15 రోజుల క్రితం వచ్చింది. ఇప్పుడు హైలెస్సా హైలెస్సా సాంగ్.. ఓ రేంజ్ లో మెప్పిస్తోంది. అదే సమయంలో మిగతా సాంగ్స్ కోసం చాలా వెయిట్ చేస్తున్నారు సినీ ప్రియులు. అవి మరింతగా ఆకట్టుకుంటాయని అంతా ఫిక్స్ అయిపోతున్నారు.

Full View

అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది. ఇప్పటికే నాగచైతన్య, సాయిపల్లవి కలిసి లవ్ స్టోరీ మూవీ కోసం స్క్రీన్ షేర్ చేసుకున్న విషయం తెలిసిందే. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఆ రొమాంటిక్ డ్రామా.. 2021లో విడుదలైంది. అప్పుడు ఆ సినిమా సాంగ్స్.. మూవీ లవర్స్ ను ఎంతో ఆకట్టుకున్నాయి.

Full View

ఇప్పుడు చైతూ, పల్లవి కాంబోలో వస్తున్న తండేల్ పాటలు కూడా అలరిస్తున్నాయి. అదే సమయంలో నాగచైతన్య 100% లవ్ మూవీకి దేవిశ్రీనే మ్యూజిక్ అందించారు. 2011లో రిలీజ్ అయిన ఆ మూవీ పాటలు వేరే లెవెల్ లో మెప్పించాయి. ఇప్పటికీ ఎవర్ గ్రీన్ నే. అలా వారి కాంబోలో ఇప్పుడు వస్తున్న తండేల్ సాంగ్స్ కూడా ఎప్పటికీ మర్చిపోలేని విధంగా అందరి మదిలో నిలిచిపోవడం పక్కా. దీంతో సాయిపల్లవి- నాగచైతన్య- దేవిశ్రీల్లో ఎవరెప్పుడు కలిసి వచ్చినా మూవీ మ్యూజికల్ హిట్ కంపల్సరీ అని క్లియర్ గా తెలుస్తోంది. దేవి తన మనసుకు నచ్చిన కథలకు సాంగ్స్ తోనే మరింత ప్రాణం పోస్తాడు అని చాలాసార్లు రుజువైంది.

బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అద్బుతంగా ఇవ్వగలడని చెప్పవచ్చు. మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాకు దర్శకుడు చందు మొండేటి కూడా ప్రధాన బలం. ఇదివరకే చందు దర్శకత్వంలో నాగచైతన్య ప్రేమమ్ సినిమా చేసి హిట్టు కొట్టాడు. ఇక చందు కార్తికేయ 2 తరువాత చేస్తున్న సినిమా కావడంతో పాన్ ఇండియా వరల్డ్ లో సినిమా మరింత క్రేజ్ అందికునే అవకాశం ఉంది. ఎలా చూసుకున్నా కూడా తండేల్ కు నలువైపులా పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అవుతున్నాయి. ఇక సినిమా బాక్సాఫీస్ వద్ద సాలీడ్ కలెక్షన్స్ అందుకోవడం పక్కా అని అర్ధమవుతుంది.

Tags:    

Similar News