తండేల్.. క్లిక్కవ్వడానికి కారణమిదే

భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్ లో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో బన్నీ వాస్, అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Update: 2024-01-10 05:03 GMT

నాగచైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ తండేల్. సాయి పల్లవి ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్ లో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో బన్నీ వాస్, అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రియల్ లైఫ్ సంఘటనల స్ఫూర్తితో ఈ చిత్ర కథని సిద్ధం చేశారు. ప్రస్తుతం మూవీ రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది.

ఇదిలా ఉంటే తాజాగా తండేల్ మూవీ నుంచి ఎసెన్స్ ఆఫ్ తండేల్ పేరుతో గ్లింప్స్ ని రిలీజ్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. స్టొరీ నేరేషన్, డైలాగ్స్, విజువలైజేషన్ మొత్తం కూడా అద్భుతంగా ఉందనే మాట ఆడియన్స్ నుంచి అలాగే క్రిటిక్స్ నుంచి వినిపించింది. నాగ చైతన్య కెరియర్ లోనే హైఇంటెన్షన్ ఉన్న మూవీగా తండేల్ ఉండబోతోందని అభిప్రాయం అందరి నుంచి వ్యక్తం అయ్యింది.

దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కూడా నెక్స్ట్ లెవల్ లో ఉందనే ప్రశంసలు లభించాయి. ఇక చైతూ క్యారెక్టర్ లుక్ కూడా బాగుందని, సాయి పల్లవి మరోసారి మ్యాజిక్ చేయబోతోందని ఈ గ్లింప్స్ చూసిన వారు ముక్తకంఠంతో చెబుతున్నారు. ఇప్పటి వరకు ఈ మూవీ ఒక షెడ్యూల్ మాత్రమే కంప్లీట్ చేసుకుంది. ఫస్ట్ షెడ్యూల్ లోనే ఇంత అవుట్ పుట్ ఎలాస ఇద్దాం చేశారా అనే ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి.

గ్లింప్స్ లోనే విజువల్ కంటెంట్ చాలా చూపించారనే ప్రశంసలు లభించాయి. అయితే ఇదంతా ఈ సినిమా కోసం నుంచి రెండేళ్ళ నుంచి చేస్తోన్న వర్క్ వలన సాధ్యం అయ్యిందని టాక్. ముందుగా స్టొరీ మీద రీసెర్చ్ చేయడంతో పాటు శ్రీకాకుళం, విశాఖపట్నం వెళ్లి మత్స్యకారుల అనుభవాలు తెలుసుకున్నారు. దానికి తగ్గట్లుగానే వర్క్ షాప్ పెట్టి ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. చైతన్య బాడీ లాంగ్వేజ్ కంప్లీట్ గా మార్చుకున్నాడు.

ఇక సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నచ్చి పాత్ర దొరికితే ప్రాణం పెట్టేస్తుంది. చందూ మొండేటి కూడా కంటెంట్ లో ఉన్న ఎమోషన్స్ కి బలంగా కనెక్ట్ అయ్యి ముందుగానే స్టొరీబోర్డు రెడీ చేసుకొని మరి షూటింగ్ కి వెళ్ళడం వలన గ్లింప్స్ ని ఆ స్థాయిలో చూపించడం సాధ్యం అయ్యిందని తెలుస్తోంది. ఏది ఏమైనా తండేల్ సినిమాతో టాలీవుడ్ కి మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయితే దొరకబోతోందని గ్లింప్స్ బట్టి అర్ధమవుతోంది.

Tags:    

Similar News