#ది ఆర్చీస్.. నేపో త్రయానికేనా ప్రమోషన్?
ఈ చిత్రంలోని పాత్రలు ఆసక్తిని కలిగించాయి. కానీ ఈ సినిమా నేపథ్యం మాత్రం సౌత్ ఆడియెన్ కి ఏ మేరకు టచ్ చేస్తుందో అన్నది సందిగ్ధంగా ఉంది
జోయా అక్తర్ 'ది ఆర్చీస్'తో నటవారసులు వెండితెరకు పరిచయమవుతున్నారు. షారూఖ్ ఖాన్ కుమార్తె- సుహానా ఖాన్, శ్రీదేవి కుమార్తె- ఖుషీ కపూర్, అమితాబ్ బచ్చన్ మనవడు- అగస్త్య నందా ల గ్రాండ్ అరంగేట్రంతో పాటు మిహిర్ అహుజా, అదితి సైగల్, వేదంగ్ రైనా, యువరాజ్ మెండా తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. గల్లీ బోయ్ ఫేం జోయా నేతృత్వంలో రూపొందిన ఈ మ్యూజికల్ డ్రామా డిసెంబర్ 7 నుండి OTT దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది.
ఈ చిత్రంలోని పాత్రలు ఆసక్తిని కలిగించాయి. కానీ ఈ సినిమా నేపథ్యం మాత్రం సౌత్ ఆడియెన్ కి ఏ మేరకు టచ్ చేస్తుందో అన్నది సందిగ్ధంగా ఉంది. ప్రచారం పరంగా భారీ బజ్‌ను సృష్టించగా ఉత్తరాది ఆడియెన్ ఈ సిరీస్ కోసం ఆసక్తిగానే వేచి చూస్తున్నారు. ఇటీవల ది ఆర్చీస్ నుంచి కొత్త పోస్టర్‌ను విడుదల చేసారు. అయితే ఈ పోస్టర్లలో ముగ్గురు నటవారసుల్ని ఎలివేట్ చేయడంతో మేకర్స్ పై నెటిజనులు విరుచుకుపడ్డారు. సోషల్ మీడియాలో సుహానా, అగస్త్య, ఖుషీలతో కూడిన కొత్త పోస్టర్ నేపో పిల్లలను ప్రమోట్ చేయడమేననేది నెటిజనుల ఆరోపణ. ఈ చిత్రంలోని ఏడుగురు నటీనటులలో కేవలం నటవారసులనే ఎంపిక చేసినందుకు అభిమానుల నుంచి ఎటాక్ లు తప్పలేదు.
తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో సుహానా ఖాన్ నీలం రంగు దుస్తులను ధరించగా, ఖుషీ కపూర్ తెల్లని పూల దుస్తులు ధరించి ఒకరి కళ్లలోకి ఒకరు చూస్తున్నారు. అగస్త్య నంద కెమెరాలోకి చూస్తున్నాడు. ముగ్గురూ మిల్క్‌షేక్‌ను షేర్ చేసుకుంటున్నారు. దీనికి క్యాప్షన్ ఇలా ఉంది, ''ఆర్చీ డూ దిల్‌ను కలిగి ఉండకపోవచ్చు.. కానీ పాప్‌లో తన ప్రియమైన వారిని దగ్గరగా ఉంచడానికి రెండు స్ట్రాలు ఉన్నాయి. డిసెంబర్ 7న ఆర్చీస్‌ని కలవండి.. నెట్‌ఫ్లిక్స్‌లో మాత్రమే!'' అనే ట్యాగ్ ని జోడించారు.
వెబ్‌లో పోస్టర్ కనిపించిన వెంటనే నెటిజన్లు నెపో పిల్లలను ప్రోత్సహించడం సరికాదు! అంటూ మేకర్స్‌ను ట్రోల్ చేశారు. పోస్టర్‌పై వ్యాఖ్యానిస్తూ ఒక నెటిజన్ ఇలా వ్యాఖ్యానించారు. ''పోస్టర్‌లో ఏడుగురు వ్యక్తులు, వారిలో ముగ్గురు మాత్రమే నేపో బేబీస్? మిగతా నలుగురికి కొత్త పోస్టర్ విడుదల చేసారా? అని ప్రశ్నించగా, మరొకరు ''ఇది రివర్‌డేల్ కి సాస్తా కాపీలా ఉంది! అని వ్యాఖ్యానించారు. ''జాన్వీ కపూర్, అనన్య పాండే, సారా అలీ ఖాన్ లను PR బృందాలను ఉపయోగించినట్టే, ఈ నేపో కిడ్స్ ని తదుపరి అగ్ర బాలీవుడ్ తారలుగా మార్చే వరకు వదిలిపెట్టరు'' అని ఒకరు వ్యాఖ్యానించారు.
''అద్భుతం, మిగిలిన నలుగురి గురించి ఏమిటి? జోయా చెప్పలేదా? మీడియా అంటే ఇతరులపై దృష్టి పెట్టదు. వారు ఈ ముగ్గురు లేకుండా మిగిలిన పోస్టర్ వేస్తారో లేదో చూడాలని నిజంగా ఆసక్తిగా ఉంది'' అని మరొకరు రాసారు. ఐదవ వ్యక్తి ఇలా వ్యాఖ్యానించాడు. ''నెట్‌ఫ్లిక్స్ కొత్త నాన్-నేపో టాలెంట్‌ను ప్రోత్సహిస్తోంది'' ''నెపో త్రయం.. ఇంకా చాలా దూరం వెళ్లాలి.. అయితే స్క్రిప్ట్‌లు వారి శక్తివంతమైన ప్రభావంతో ప్రవహిస్తూ ఉంటే.. కరణ్ జోహార్ వంటి వారు వీళ్లకు మద్దతునిస్తూ ఉంటే..ప్రజలు దీనిని అంగీకరించవచ్చు'' అని రాసారు. ''మిగతా నలుగురు పిల్లలు ఎక్కడ ఉన్నారు? ఈ ముగ్గురికి ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఇచ్చారని ఖచ్చితంగా చెప్పవచ్చు. @netflix_in అటువంటి ప్రదర్శనలను ప్రమోట్ చేయడం .. కోహ్రా వంటి రత్నాలను విస్మరించడం సరికాదు'' అని మరొక నెటిజన్ వాదించాడు.
ఓవరాల్ గా ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తే.. కేవలం నేపో కిడ్స్ ని మాత్రమే ప్రమోట్ చేయడాన్ని చాలామంది వ్యతిరేకిస్తున్నారు. నటవారసులతో పాటు ఇతర చిన్నారులను కూడా ప్రోత్సహించాలనేది నెటిజనుల అభిప్రాయం. దానిని గౌరవించి అయినా జోయా బృందం తదుపరి జాగ్రత్తలు తీసుకుంటారనే ఆశిద్దాం. ది ఆర్చీస్ డిసెంబర్ లో స్ట్రీమింగుకి రెడీ అవుతోంది.