ట్రైలర్ టాక్: ప్రాణం మీదకు తెచ్చిన బర్త్ డే

ఆ పుట్టినరోజు వేడుకలో ఒక మిత్రుడు గాజు టేబుల్ మీద పడటంతో అతని ప్రాణం పోతుంది.

Update: 2024-07-10 12:19 GMT

స్నేహం, ద్రోహం, న్యాయం వంటి భావనలు కలగలిపిన కామెడీ-డ్రామా చిత్రం 'ది బర్త్‌ డే బాయ్' ఇటీవల ట్రైలర్ విడుదలతో ప్రేక్షకులలో ఆసక్తిని పెంచింది. విస్కీ మరియు ఐ.భరత్ దర్శకత్వంలో, బొమ్మా బరుసు ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రం కథ ఐదుగురు స్నేహితుల జీవితాలను పరిచయం చేస్తుంది. మిత్రుడి పుట్టినరోజును సంతోషంగా జరుపుకోవడానికి ఆ విధంగా తీసుకున్న తీర్మానాన్ని విస్మరిస్తూ, మద్యం సేవిస్తూ విందును మొదలుపెట్టే ఈ కథ, ఆ పండుగ క్షణాలు ఎలా విషాదంగా మారాయో వివరిస్తుంది.

ఆ పుట్టినరోజు వేడుకలో ఒక మిత్రుడు గాజు టేబుల్ మీద పడటంతో అతని ప్రాణం పోతుంది. ఈ ప్రమాదం వారి గ్రూప్‌లో ఆందోళనను రేకెత్తిస్తుంది. ఇంతవరకు ఉత్సవంగా సాగిన వారి జీవితాలు, ఒక్కసారిగా రహస్యాలతో ముడిపడి పోతాయి. ఈ సంఘటనను ముందుగానే ప్రణాళిక చేసిన హత్యగా చూపించే సాక్ష్యాలు బయటపడుతాయి. మరణించిన వ్యక్తి సోదరుడు లాయర్ గా, ఈ కేసును విచారిస్తాడు.

ఈ కథలోని మలుపులు, మోసాలు ప్రేక్షకులని ఉత్కంఠతో కూర్చోపెడతాయి. రియలిజం కోసం సింక్ సౌండ్ లో చిత్రీకరించిన ఈ చిత్రం అత్యున్నత స్థాయి నిర్మాణ విలువలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. హాలీవుడ్ నిపుణుడిచే చేసిన ప్రత్యేక కలర్ గ్రేడింగ్ చిత్రాన్ని మరింత అందంగా ఉంది.

ముఖ్యమైన పాత్రల్లో రవి కృష్ణ, సమీర్ మల్లా, రాజీవ్ కనకాల నటించారు. స్నేహం, విశ్వాసం, న్యాయం అనుసంధానించిన ఈ కథలో వారు అద్భుతమైన నటనను ప్రదర్శించారు. NRIs హైదరాబాదుకు తిరిగి వచ్చిన నేపథ్యంతో ఈ కథ సాగుతుంది. సాంస్కృతిక అనుసంధానం, వ్యక్తిగత సంబంధాలలోని సంక్లిష్టతలు కూడా ఈ చిత్రంలో ప్రధానాంశాలుగా ఉన్నాయి.

మనం సాధారణంగా చూస్తున్న కామెడీ-డ్రామా సినిమాల కంటే 'ది బర్త్‌ డే బాయ్' మరింత వేరుగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో కామెడీ, మిస్టరీ, భావోద్వేగాలను కలగలిపిన కథతో ప్రేక్షకులను అలరించనుందని ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది. ఇక జులై 19న విడుదల కానున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునే అవకాశం ఉంది. 'ది బర్త్‌ డే బాయ్' కథలోని మలుపులు, మిత్రుల మధ్య విశ్వాసం, వివిధ సందర్భాలలో కలిగే భావోద్వేగాలు ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని కలిగించబోతున్నాయని తెలుస్తోంది. మరి ఈ సినిమా బిగ్ స్క్రీన్ పై ఎలాంటి థ్రిల్ ను కలిగిస్తుందో చూడాలి.


Full View
Tags:    

Similar News