స్టోరీ లీక్ చేసి.. హిట్టు కొట్టే దమ్మున్న డైరెక్టర్

అలాగే ఇండియన్ సినిమాకి ఆస్కార్ అందించిన దర్శకుడిగా కూడా రాజమౌళి పేరు చరిత్రలో నిలిచిపోతుంది.

Update: 2024-03-06 05:25 GMT

టాలీవుడ్ లోనే కాకుండా ఇండియాలోనే నెంబర్ వన్ స్టార్ డైరెక్టర్ అంటే రాజమౌళి పేరు చాలా మంది చెబుతారు. కమర్షియల్ డైరెక్టర్ అయిన కెరియర్ లో ఇప్పటి వరసకు ఫ్లాప్ చూడని దర్శకుడిగా రాజమౌళి ఉన్నారు. అలాగే ఇండియన్ సినిమాకి ఆస్కార్ అందించిన దర్శకుడిగా కూడా రాజమౌళి పేరు చరిత్రలో నిలిచిపోతుంది. పాన్ వరల్డ్ లెవల్ లో జక్కన్న పేరు ఇప్పుడు వినిపిస్తోంది.


అయితే రాజమౌళికి ఒక అలవాటు ఉంది. సినిమాకు సంబంధించిన కొన్ని పాయింట్స్ ముందుగానే చెప్పేస్తారు. ముఖ్యంగా కొన్ని సినిమాలకు అసలు కథ ముందుగానే మీడియాకి చెప్పేస్తాడు. కొత్తగా ఎలాంటి ఊహాగానాలకి తావు ఇవ్వకుండా సినిమాలో తాను ఎలాంటి కథని చెప్పాలని అనుకుంటున్న అనేది రివీల్ చేసేస్తాడు. ఆ కథని తన మేకింగ్, టేకింగ్ తో ఆడియన్స్ ని ఎలా మెప్పించాలో అనేది మాత్రమే సినిమాలో హైలెట్ చేస్తాడు. ఆర్ఆర్ఆర్ సినిమా అసలు స్టోరీ ఏంటి అనేది ముందే చెప్పేసి మరీ సూపర్ హిట్ కొట్టాడు.

అలాగే రాజమౌళికి స్టార్ ఇమేజ్ వచ్చిన తర్వాత చేసిన చిన్న సినిమా అంటే మర్యాద రామన్న అని చెప్పాలి. మగధీర సినిమా తరువాతే ఇది వచ్చింది. సునీల్ హీరోగా తెరకెక్కిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇతర భాషలలో కూడా రీమేక్ అయ్యింది. ఈ సినిమా రిలీజ్ కి ముందే జక్కన్న స్టోరీ మొత్తం మీడియాకి చెప్పేశాడు. తన ప్రత్యర్థి కొడుకుని చంపేయాలని పల్లెటూరిలో విలన్ వెయిట్ చేస్తూ ఉంటాడు.

నిజానికి అతను అతిథిని దేవుడిలా చూసుకునే వ్యక్తి, ఇంట్లో రక్తం చిందకూడదని ఆచారాన్ని నమ్ముతాడు. హీరోకి ఆ ఊళ్ళో పొలం అమ్ముకుంటే డబ్బులు వస్తాయని వెళ్లి అనుకోకుండా తనని చంపాలని అనుకుంటున్న విలన్ ఇంటికి అతిథిగా వెళ్తాడు. అతిథిగా వచ్చిన హీరోని విలన్ చాలా అద్భుతంగా చూసుకుంటాడు. సడెన్ గా హీరో తన ప్రత్యర్థి కొడుకు అని విలన్ కి తెలుస్తుంది.

గుమ్మం లోపల ఉన్నంత వరకు అతిథిగా చూడాలి. గుమ్మం దాటి బయటకి వెళ్లిన వెంటనే చంపేద్దాం అని విలన్ డిసైడ్ అవుతాడు. ఈ విషయం హీరోకి తెలుస్తుంది. గుమ్మం దాటితే తనని చంపేస్తారు. లోపల ఉంటే అతిథిగా చూసుకుంటారు. ఏ విధంగా హీరో ఇంట్లో ఉన్నాడు అనేది నా సినిమా కథ అని మర్యాద రామన్న స్టోరీ మొత్తం జక్కన్న ముందే ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పేశాడు.

అప్పట్లో ఇది అందరిని ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇంత క్లారిటీగా చెప్పి కూడా ఆ సినిమాతో జక్కన్న సూపర్ హిట్ కొట్టడం విశేషం. అందుకే రిలీజ్ కి ముందే స్టోరీ చెప్పేసే దమ్మున్న డైరెక్టర్ జక్కన్న మాత్రమే అని టాలీవుడ్ లో వినిపించే మాట. ఒక విధంగా అలాంటి సినిమాలకు ముందే కథ చెబితే ఆడియెన్స్ లో ఒక విధమైన అంచనాలు ఉంటాయని జక్కన్నకు బాగా తెలుసు. మగధీర లాంటి సినిమా చేసి మళ్ళీ సునీల్ తో సినిమా అంటే ఎలాంటి సినిమా చేస్తాడో అనే కన్ఫ్యూజన్ ఉండకూడదు అని జక్కన్న ఆ విధంగా ధైర్యం చేసి కథ చెప్పారు.

Tags:    

Similar News