డాక్యు సెన్సేషన్: అబ్రహాం లింకన్ స్వలింగ సంపర్కుడా?
కానీ పాఠ్యపుస్తకాల్లో ప్రచురితం కాని ఎన్నో సంచలన విషయాలు ఇప్పుడు డాక్యు సిరీస్ లో బయటపడ్డాయని ప్రఖ్యాత టైమ్స్ ఆఫ్ ఇండియా తన కథనంలో పేర్కొంది.
మొట్టమొదటి అమెరికన్ అధ్యక్షుడు అబ్రహం లింకన్ స్వలింగ సంపర్కుడా? పురుష భాగస్వాములతో `స్టీమీ గే సెక్స్ సెషన్స్`లో పాల్గొన్నాడా? తాజా డాక్యుమెంటరీలో ఏం చూపించారు? ఎలాంటి సంచలన నిజాలు వెలుగు చూసాయి? అంటే పూర్తి వివరాల్లోకి వెళ్లాలి.
లింకన్ అంటే అమెరికా మొదటి అధ్యక్షుడు అని మాత్రమే పాఠ్యపుస్తకాల్లో చదువుకున్నాం. కానీ పాఠ్యపుస్తకాల్లో ప్రచురితం కాని ఎన్నో సంచలన విషయాలు ఇప్పుడు డాక్యు సిరీస్ లో బయటపడ్డాయని ప్రఖ్యాత టైమ్స్ ఆఫ్ ఇండియా తన కథనంలో పేర్కొంది. ఒక కొత్త డాక్యుమెంటరీ లింకన్ నపుంసకుడా? అంటే.. అవును అని చెబుతోంది! దీనిని 'అమెరికా చరిత్రలో ముఖ్యమైన తప్పిపోయిన భాగం' అని టైమ్స్ తాజా కథనం పేర్కొంది.
అమెరికా గ్రేటెస్ట్ ప్రెసిడెంట్ అబ్రహం లింకన్ స్వలింగ సంపర్కుడని కొత్త డాక్యుమెంటరీ వెల్లడించింది. ''లవర్ ఆఫ్ మెన్: ది అన్‌టోల్డ్ హిస్టరీ ఆఫ్ అబ్రహం లింకన్'' అనే టైటిల్‌తో ఈ చిత్రం లింకన్ జీవితంలో తెలియని చాలా విషయాలను బహిర్గతం చేయడం ఇప్పుడు సెన్సేషన్ గా మారింది.
లింకన్ గురించి గతంలో చూడని ఫోటోగ్రాఫ్‌లు, లేఖలను ఉపయోగించి, అనేక మీడియా సంస్థల ద్వారా పొందిన ప్రచార వీడియో మెటీరియల్‌ల వివరాల ప్రకారం.. పురుషులతో లింకన్‌కి గల శృంగార సంబంధాలు బహిర్గతం అయ్యాయని ఈ డాక్యు సినిమా పేర్కొంది. లింకన్ బహుశా మహిళలతో కంటే ఎక్కువ మంది పురుషులతో ఒకే మంచం మీద పడుకున్నాడు! అని న్యూయార్క్ పోస్ట్ ఈ డాక్యు సినిమా గురించి ఉటంకిస్తూ పేర్కొంది. ఈ డాక్యుమెంటరీలో హార్వర్డ్, కొలంబియా, బ్రౌన్, వెల్లెస్లీ సహా ప్రతిష్టాత్మక సంస్థల నుండి చరిత్రకారుల ఇంటర్వ్యూలు ఉన్నాయి.
షాన్ పీటర్సన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పురుషులతో లింకన్ లోతైన శృంగార సంబంధాల గురించి ఎక్కువగా చర్చించింది. అతడి లైంగిక ఆలోచనల చరిత్రను పరిశోధించిన డాక్యు సిరీస్ ఇది. 19వ శతాబ్దపు లైంగిక నిబంధనలకు, నేటి నిబంధనలకు మధ్య ఉన్న స్పష్టమైన వ్యత్యాసాలను హైలైట్ చేస్తుంది. ఈ చిత్రాన్ని `పాషన్ ప్రాజెక్ట్`గా అభివర్ణించిన పీటర్సన్ సంవత్సరాలుగా దానిపై పని చేస్తున్నారు. ఈ డాక్యుమెంటరీ అమెరికన్ చరిత్రలో బయటకు తెలియని కఠోర నిజాలను బయటపెట్టింది. మానవ లైంగికతపై వారి అభిప్రాయాలను పునఃపరిశీలించమని ప్రేక్షకులను సవాలు చేయడం లక్ష్యంగా ఈ డాక్యుమెంటరీని తెరకెక్కించారని కూడా చెబుతున్నారు.
మగ రూమ్‌మేట్ అతడితో మంచం పంచుకున్నాడు అని ఈ చిత్రంలో చూపించారు. ఇది కొత్త అంశాలను చర్చిస్తూ సాక్ష్యాలను అందజేయడమేననేది ఒక విశ్లేషణ. అయితే ట్రైలర్ లింకన్ సమానత్వ సిద్ధాంతాన్ని ఆవిష్కరిస్తుంది. చాలా కోణాలలో అబ్రహాం లింకన్ గురించి ఈ డాక్యుమెంటరీ రివీల్ చేయనుంది.