చైతన్య-చందు కెరీర్ లోనే తొలి భారీ బడ్జెట్ చిత్రం!
వాస్తవ సంఘటనలతో తెరకెక్కుతున్న సినిమా కోసం నేరుగా ఆయా ప్రాంతాల్ని పర్యటించడం వంటి అంశాలు సినిమాపై అంతకంతకు హైప్ తీసుకొస్తున్నాయి.
యువ సామ్రాట్ నాగచైతన్య- చైతన్య మొండేటి `తండేల్` అనే డిఫరెంట్ అటెంప్ట్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ అయిన చైతన్య మాస్ లుక్ అభిమానుల్లో కొత్త కిక్ ని నింపింది. మునుపెన్నడు చూడని సరికొత్త చైని చందు డిజైన్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. స్టోరీ సహా పాత్ర కోసం దర్శక-హీరోలెద్దరు ప్రీ ప్రొడక్షన్ లో భాగంగా ఎంతగా అన్వేషించారో తెలిసిందే. మత్సకారుల జీవితాల ఆధారంగా..వాస్తవ సంఘటనలతో తెరకెక్కుతున్న సినిమా కోసం నేరుగా ఆయా ప్రాంతాల్ని పర్యటించడం వంటి అంశాలు సినిమాపై అంతకంతకు హైప్ తీసుకొస్తున్నాయి.
ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా గురించి చైతన్య మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు రివీల్ చేసారు. `నా కెరీర్ లోనే తొలి భారీ బడ్జెట్ చిత్రమిది. కథకి విస్తృత పరిధి ఉంది. కొంత భాగం ఇండియాలో.. మరికొంత భాగంగా పాకిస్తాన్ లో జరుగుతుంది. నా కెరీర్ లోనే స్పెషల్ మూవీగా నిలిచిపోతుంది. ఆరేడు నెలలుగా ఈ సినిమా టీమ్ తోనే జర్నీ సాగిస్తున్నాను. శ్రీకాకుళంలోని కె. మత్య్సలేశం గ్రామానికి వెళ్లి మత్సకారుల్ని కలిసా.
ఆ కథని ఆధారంగా చేసుకుని సినిమాటిక్ గా చూపించబోతున్నాం. కొన్ని వర్క్ షాప్ ల్లో పాల్గొన్నా. యాస..హవభావాల కోసం చాలా వర్క్ చేసాను. నిర్మాతలు అల్లు అరవింద్..బన్నీ వాస్ అంతా కలిసి చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నాం. ఓ కొత్త నాగచైతన్యని చూస్తారు. అందరం ఎంతో నమ్మి ఈ సినిమా చేస్తున్నాం. సాయి పల్లవి ఈ సినిమాకి అదనపు అస్సెట్. ఆమె వల్ల కథ మరింత బలంగా మారింది.
నేచురల్ పెర్పార్మెన్స్ అవసరం. అలాంటి నటి ఎవరంటే? సాయి పల్లవి తట్టింది. అందుకే ఆమెను తీసుకున్నాం. తన కెరీర్ లోనే గొప్పగా చెప్పుకునే సినిమా అవుతుంది. డిసెంబర్ మొదటి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది` అని అన్నారు. చందు మొండేటి పాన్ ఇండియా హిట్ చిత్రం `కార్తికేయ-2` తర్వాత దర్శకత్వం వహిస్తోన్న చిత్రం కావడంతో ప్రత్యేకమైన అంచనాలు ఉన్నాయి.