బుద్ధుడు సంచరించిన నేలపై ఎల్లీ
వాణిజ్య ప్రకటనలతో భారీ ఆదాయాన్ని ఆర్జిస్తూ ఎల్లీ నిరంతరం లింకప్ వార్తలతోనే హెడ్ లైన్స్ లోకి వచ్చింది.
యువక్రికెటర్లతో లింకప్ వార్తలతో బాగా ఫేమస్ అయిన బ్యూటీ ఎల్లీ అవ్ రామ్. హార్థిక్ పాండ్యాతో ప్రేమాయణంలో మునిగి తేలిన ఈ బ్యూటీ చివరికి అతడు ఇచ్చిన జోల్ట్ నుంచి ఇప్పటికీ కోలుకోలేదని చెబుతారు. ఓవరాల్ గా ఐటమ్ నంబర్లు చేస్తూ.. నటిగా క్రేజీ స్టార్ల సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ .. వాణిజ్య ప్రకటనలతో భారీ ఆదాయాన్ని ఆర్జిస్తూ ఎల్లీ నిరంతరం లింకప్ వార్తలతోనే హెడ్ లైన్స్ లోకి వచ్చింది. కానీ ఇటీవల ఎందుకనో ఎల్లీ అవ్ రామ్ పేరు అంతగా వినిపించడం లేదు.
మునుపటితో పోలిస్తే ఎల్లీకి అవకాశాలు కూడా తగ్గాయి. ఇటు సౌత్ లోను ఈ అమ్మడు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. అందుకే ఇప్పుడు యూట్యూబ్ చానెల్ డిజిటల్ మాధ్యమాల్లో ఆదాయ ఆర్జనపై దృష్టి సారించింది. తాజాగా ఇండియా విత్ ఎల్లీ పేరుతో ఎల్లీ అవ్ రామ్ చేసిన షో యూట్యూబ్ లో వైరల్ అవుతోంది.
#IndiaWithElli సీజన్ 2తో తిరిగి వస్తున్నందుకు చాలా ఉత్సాహంగా ఉన్నాను! ఈసారి నేను సర్ ప్రైజ్ లతో నిండిన రాష్ట్రాన్ని అన్వేషించవలసి వచ్చింది! నేను ఎక్కడ ఉన్నానో అంచనా వేయగలరా? కామెంట్స్ మెయిన్ లిఖో అంటూ ముద్దుల ఈమోజీని షేర్ చేసింది. మినిస్ట్రి ఆఫ్ కల్చర్ పేరుతో ట్యాగ్ ని యాడ్ చేసింది ఈ బ్యూటీ. ఇండియా విశేషాలను రివీల్ చేసే ట్రావెల్ వ్లాగర్ గా మారానని చెప్పకనే చెబుతోంది. తాజా వీడియోలో బుద్ధుని దేశం తాలూకా విశేషాలను వెల్లడిస్తున్నానని తెలిపింది. గౌతమబుద్ధుడు సంచరించిన చోట నేను ఉన్నాను! అది ఏ దేశం కనిపెట్టండి అంటూ ఫజిల్ వేసింది ఎల్లీ. ఈ వీడియోలో ఎల్లీ అవ్ రామ్ ఎంతో ట్రెడిషనల్ లుక్ తో కనిపించి ఆశ్చర్యపరిచింది. స్వీడిష్ బ్యూటీ అవతార్ కి యువతరం షాక్ కి గురవుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో అంతర్జాలంలో వైరల్ గా మారుతోంది.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. ఇంతకుముందు సల్మాన్ భాయ్ బాడీగార్డ్ సినిమాలో కీలక పాత్రను పోషించింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టాక వరుస ఆఫర్లు అందుకుంది. బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో కలిసి గుడ్ బైలో నటించింది. కానీ ఆ సినిమా ఆశించిన విజయం సాధించలేదు.