ల‌వ్ లెటర్ అమ్మ‌కే చూపించిన హీరోయిన్!

అలా చూపించినందుకు నా కుతురు గొప్ప‌ద‌ని భావించి ఆ త‌ల్లి పొంగిపోయింద‌నుకునేరు.

Update: 2024-02-14 10:30 GMT

ఎవ‌రైనా ల‌వ్ లెట‌ర్ రాస్తే ఏం చేస్తారు. బాగా ద‌గ్గ‌రైన స్నేహితుల‌కు చూపిస్తారు..లేక‌పోతే సీక్రెట్ గా ఓ మూల కూర్చుని చ‌దివేస్తారు. అది ప్రేమ‌తో రాసిన లెట‌ర్ అయినా...మ‌రో అంశానికి సంబంధించిన అంశ మైనా స‌రే ఓ అబ్బాయి..అమ్మాయికి లెట‌ర్ ఇస్తే అంద‌రూ స‌హ‌జంగా చేసే ప‌ని అదే. కానీ ఈ హీరోయిన్ మాత్రం వాళ్ల అమ్మ‌కే చూపించిందిట‌. అలా చూపించినందుకు నా కుతురు గొప్ప‌ద‌ని భావించి ఆ త‌ల్లి పొంగిపోయింద‌నుకునేరు.


లెట‌ర్ చూపించిన పాపానికి న‌మ్మ‌కం కోల్పోయి ఆ త‌ల్లి ఏకంగా స్కూలే మార్చేసింది. ఇంత‌కీ ఎవ‌రా హీరోయిన్? ఎవ‌రా త‌ల్లి? అంటే వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే. హైద‌రాబాద్ బ్యూటీ అదితి రావు హైద‌రీ సుప‌రిచిత‌మే. బాలీవుడ్ ..కోలీవుడ్..టాలీవుడ్ లో ఫేమ‌స్ అయిన బ్యూటీ బిజీ న‌టిగా కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఫిబ్ర‌వ‌రి 14 ప్రేమికుల రోజుకు ఒక్క రోజు ముందుగా అతిది రావు హైద‌రీ లవ్ లెట‌ర్ గురించి ఇలా ఓపెన్ అయింది.

`అప్పుడు నేను ఐద‌వ త‌ర‌గ‌తి చ‌దువుతున్నాను. ఓ ఓరోజు నా సీనియ‌ర్ నుంచి ఉత్త‌రం అందుకున్నా. ఇంటికెళ్లి చూస్తే అది రెండు పేజీల పెద్ద లేఖ‌లా ఉంది. ఆ రోజుల్లో అబ్బాయి నుంచి నాకు అలాంటి లవ్ లెట‌ర్ వ‌చ్చేస‌రికి గ‌ర్వంగా ఫీల‌య్యాను. చాలా గొప్ప‌గానూ అనిపించింది.అలాంటి లెటర్ ఎవ‌రికో చూపించ‌డం ఎందుకని నేరుగా మా అమ్మ‌ద‌గ్గ‌ర‌కు తీసుకెళ్లాను. అమ్మ దాన్ని చ‌దివాక ఏమి అన‌లేదు.

ఒక్క మాట కూడా మాట్ల‌డ‌లేదు. ఎందుకు సైలెంట్ గా ఉంద‌ని మ‌న‌సులో అనుకున్నాను. కానీ త‌ను సైలెంట్ గా నాకేం చెప్ప‌కుండా స్కూల్ మార్చేసింది. అక్క‌డ స్కూల్ వాతావ‌ర‌ణం బాగోలేదు..ఆ స్కూల్ అవ‌స‌రం లేద‌ని అమ్మ అలా చేసింది` అని రివీల్ చేసి న‌వ్వేసింది. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ గాంధీ టాక్స్ చిత్రంతో పాటు మ‌రో సినిమాలో న‌టిస్తోంది. అలాగే సంజయ్ లీలా భ‌న్సాలీ తెర‌కెక్కిస్తోన్న ప్ర‌తిష్టాత్మ‌క వెబ్ సిరీస్ `హీరామండి`లోనూ టిస్తోంది.

Tags:    

Similar News