సూపర్ స్టార్ మూవీ రీమేక్... ముందు అక్కడే!
మరో వైపు హిందీ తేరీ రీమేక్ ను శరవేగంగా షూటింగ్ పూర్తి చేసి వచ్చే ఏడాది సమ్మర్ చివర్లో విడుదల చేయాలని భావిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.
తమిళ్ సూపర్ స్టార్ విజయ్ హీరోగా అట్లీ దర్శకత్వంలో 2016 సంవత్సరంలో వచ్చిన తేరీ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. రెండో సినిమానే అయినా కూడా అట్లీ సినిమా ను నడిపించిన తీరు, మరియు హీరో విజయ్ ను చూపించిన తీరుకు విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాడు.
తేరి సినిమా విడుదల అయ్యి చాలా సంవత్సరాలు అవుతోంది. ఆ సినిమా ను తెలుగు మరియు హిందీలో రీమేక్ చేయాలని చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎట్టకేలకు తెలుగు లో పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వం లో ఉస్తాద్ భగత్ సింగ్ అంటూ రీమేక్ మొదలు అయిన విషయం తెల్సిందే.
ఇక హిందీలో యంగ్ హీరో వరుణ్ ధావన్ హీరోగా రీమేక్ మొదలు అయింది. ఒరిజినల్ సినిమాకు దర్శకత్వం వహించిన అట్లీ హిందీ రీమేక్ కు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. అట్లీ కి సన్నిహితుడు అయిన కలీస్ కు హిందీ రీమేక్ బాధ్యతలను అప్పగించడం జరిగింది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ రీమేక్ షూటింగ్ ప్రారంభం అయింది.
తెలుగు లో తేరీ రీమేక్ షూటింగ్ ప్రారంభం అయ్యి ఇప్పటికే కీలక సన్నివేశాల చిత్రీకరణ జరిగినట్లుగా సమాచారం అందుతోంది. ఏపీ లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యం లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ కు తాత్కాలికంగా బ్రేక్ పడింది. దాంతో వచ్చే ఏడాది సమ్మర్ కి ముందే రావాల్సిన ఉస్తాద్ కాస్త వచ్చే ఏడాది చివరి వరకు విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి .
మరో వైపు హిందీ తేరీ రీమేక్ ను శరవేగంగా షూటింగ్ పూర్తి చేసి వచ్చే ఏడాది సమ్మర్ చివర్లో విడుదల చేయాలని భావిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. కమర్షియల్ గా బ్లాక్ బస్టర్ అయిన తేరీ సినిమా ను కచ్చితంగా తెలుగు మరియు హిందీ ప్రేక్షకులు కూడా కచ్చితంగా ఆధరిస్తారనే నమ్మకం వ్యక్తం అవుతోంది.
హిందీ రీమేక్ విడుదల అయిన కొన్నాళ్లకే పవన్ ఉస్తాద్ కూడా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి ముందు తెలుగు తేరీ వస్తుందనుకుంటే ఏపీ అసెంబ్లీ ఎన్నికల కారణంగా మొదట హిందీ తేరీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కాస్త ఆలస్యం అయినా కూడా పవన్ ఉస్తాద్ కచ్చితంగా భారీ విజయాన్ని సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు.