అయిదేళ్ల క్రితం జరిగిన పెళ్లి వీడియో ఇప్పుడు వైరల్‌!

2013 నుంచి ప్రేమించుకున్న వీరిద్దరు 2018 లో పెళ్లి చేసుకోవడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ సమయంలో కొన్ని ఫోటోలు మరియు చిన్న వీడియో లు వచ్చాయి.

Update: 2023-10-26 07:23 GMT

సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక వీడియో వైరల్‌ అవుతూనే ఉంటుంది. అయితే కొన్ని సార్లు కొత్త ఫ్రెష్ వీడియో లు వైరల్ అవుతూ ఉంటే.. కొన్ని సార్లు మాత్రం ఎన్నో సంవత్సరాల క్రితం వీడియో లు ఒక్కసారిగా వైరల్‌ అవ్వడం జరుగుతూ ఉంటుంది. పాత వీడియో లు వైరల్ అవ్వడం అరుదుగా చూస్తూ ఉంటాం. ఇప్పుడు అయిదు ఏళ్ల క్రితం జరిగిన ఒక పెళ్లి వీడియో వైరల్‌ అవుతోంది.

బాలీవుడ్‌ మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్ దీపికా పదుకునే మరియు స్టార్‌ హీరో రణ్వీర్ సింగ్ లు 2018 లో పెళ్లితో ఒక్కటయ్యారు. 2013 నుంచి ప్రేమించుకున్న వీరిద్దరు 2018 లో పెళ్లి చేసుకోవడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ సమయంలో కొన్ని ఫోటోలు మరియు చిన్న వీడియో లు వచ్చాయి. అయితే ఇప్పుడు వచ్చిన వీడియో ఇద్దరి పెళ్లిని కళ్లకు కట్టినట్లుగా చూపించింది.

ఈ జంట తాజాగా కాఫీ విత్ కరణ్ సీజన్‌ 8 లో పాల్గొన్నారు. డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్ లో స్ట్రీమింగ్‌ అవుతోన్న ఈ సీజన్‌ లో దీపికా మరియు రణ్వీర్ సింగ్ ల యొక్క ఎపిసోడ్‌ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ ఎపిసోడ్‌ లో దీపికా, రణ్వీర్ ల యొక్క పెళ్లి వీడియోను చూపించారు. ఆ పెళ్లి వీడియో ను చూసి కరణ్ జోహార్‌ భావోద్వేగానికి గురి అయ్యాడు అంటే ఆ వీడియో ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

హీరోయిన్ దీపికా ను ఎన్నో సినిమా ల్లో ఎంతో అందంగా చూశాం. కానీ పెళ్లి కూతురుగా... పెళ్లి కూతురు మేకోవర్‌ తో భలేగా అనిపించింది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఆ ఎపిసోడ్‌ ను కేవలం వీరి పెళ్లి వీడియోను చూసేందుకు చాలా మంది ఎపిసోడ్‌ ను స్ట్రీమింగ్‌ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

పెళ్లి వీడియోను చూసిన తర్వాత కరణ్ జోహార్ జీవితంలో నేను ఏదో కోల్పోయినట్టు గా అనిపిస్తుంది. జీవితంలోని మధుర క్షణాలను పంచుకోవడానికి కచ్చితంగా భాగస్వామి అవసరం. ఆ భాగస్వామితో జీవితం చాలా సంతోషంగా ఉంటుందని కరణ్ అన్నాడు. అప్పుడు దీపికా మీ జీవితంలోకి ఒక మంచి భాగస్వామి త్వరలో వస్తుందని కోరుకుంటున్నాను అంటూ వ్యాఖ్యలు చేశారు.

మొత్తానికి ఇన్ని సీజన్ లలో కాఫీ విత్ కరణ్ షో ఈసారి చాలా స్పెషల్ గా ఉందంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడూ కూడా అక్రమ సంబంధాలు.. ప్రేమ వ్యవహారాల గురించి చర్చించే కరణ్ ఈసారి జీవిత భాగస్వామి యొక్క ప్రాముఖ్యత గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని కొందరు సరదాగా మీమ్స్ చేస్తున్నారు.

Tags:    

Similar News