పిరియాడిక్ చిత్రంపై విలన్ ఏమంటున్నాడంటే
కోలీవుడ్ స్టార్ సూర్య కథానాయకుడిగా తెరకెక్కుతోన్న పిరియాడిక్ చిత్రం కంగువాలోనూ బాబి డియోల్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.
'యానిమల్' తో బాలీవుడ్ నటుడు బాడి డియోల్ కి బెస్ట్ లాంచింగ్ దక్కింది. తెరపై కనిపించింది కాసేపే అయినా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచిన రోల్ అది. ప్రతి నాయకుడి పాత్రని ఓ డిఫరెంట్ యాంగిల్ లో ప్రొజెక్ట్ చేయడం బాబి డియోల్ కి కలిసొచ్చిన అంశంగా చెప్పొచ్చు. హిందీ నుంచి తెలుగు అనువాద సినిమా అయినా అందులో ప్రతీ పాత్రకి తెలుగు ప్రేక్షకుడు ఎంతగానో కనెక్ట్ అయ్యారు.
హీరో రోల్ తో పాటు ప్రతి నాయకుడి పాత్ర అంతే ధీటుగా అనిపించింది. ఇకపై బాబి డియోల్ ట్యాలెంట్ కి తెలుగులో మరిన్ని ఛాన్సులు రావడం లాంఛనమే. కానీ అంతకు ముందు బాడి డియోల్ చేతిలో సౌత్ లొ కొన్ని ప్రెస్టీజీయస్ ప్రాజెక్ట్ ల ఉన్నట్లు కనిపిస్తుంది. కోలీవుడ్ స్టార్ సూర్య కథానాయకుడిగా తెరకెక్కుతోన్న పిరియాడిక్ చిత్రం కంగువాలోనూ బాబి డియోల్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. మరోసారి విలన్ గా తనదైన మార్క్ వేయడానికి ప్రయత్నిస్తున్నాడు. తాగాజా ఓఇంటర్వ్యూలో ఈ సినిమాలో తన పాత్రపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు.
'కంగువా చిత్రబృందం నాకెంతో నచ్చింది. సూర్య నటన అద్బుతంగా ఉంది. అలాంటి అంకిత భావం ఉన్న నటుడితో పనిచేయడం ఆనందంగా ఉంది. ఇది నాకు తొలి తమిళ సినిమా. ఇప్పటివరకూ నేను ఇలాంటి వైవిథ్యమైన పాత్ర పోషించలేదు. ఈ సినిమాలో నా పాత్ర కంపోర్ట్ జోన్ లో లేదు. ఎందుకంటే ఇక్కడ భాష తెలియదు. కేవలం దర్శకుడు చెప్పింది చేసుకుంటూ వెళ్లిపోతున్నాను. అంతకు మించి నాకు కొత్తగా ఎలా ప్రజెంట్ చేయాలో అర్దం కావడం లేదు. రెండు నెలల్లో తమిళం నేర్చుకునే పరిస్థితి లేదు. అందుకే అలా' అని అన్నాడు.
కంగువా చిత్రాన్ని భారీ ఎత్తున రిలీజ్ ప్లాన్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇంత స్పాన్ ఉన్న సినిమా చేయడం సూర్య కెరీర్ లోనూ ఇదే తొలిసారి. వందలకోట్ల రూపాయలు ఈసినిమాకి ఖర్చు చేస్తున్నారు. మొత్తం 38 భాషల్లో చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారు. ఐమ్యాక్స్...3డీ వెర్షన్ లోనూ అందుబాటులోకి తెస్తున్నారు. ఇందులో సూర్య ఆరు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించనున్నాడు. సూర్యకి జోడీగా దిశా పటానీ హీరోయిన్ గా నటిస్తోంది.