పవర్ స్టార్.. ఇది జపాన్ వాడకం

ఈ మూవీలో కార్తి వన్ మెన్ షో ప్రేక్షకులకి కనెక్ట్ అయిన కూడా బలమైన కథ, కథనం లేకపోవడంతో ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది.

Update: 2023-11-11 06:17 GMT

కార్తి హీరోగా రాజు మురుగన్ దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి వచ్చిన చిత్రం జపాన్. ఈ మూవీలో కార్తి వన్ మెన్ షో ప్రేక్షకులకి కనెక్ట్ అయిన కూడా బలమైన కథ, కథనం లేకపోవడంతో ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. ప్రస్తుతానికి ఎవరేజ్ టాక్ తో నడుస్తోంది. మూవీలో అనూ ఇమ్మాన్యూయేల్ హీరోయిన్ గా నటించింది. సినిమాలో కూడా ఆమె స్టార్ హీరోయిన్ పాత్రలోనే నటించడం విశేషం.

ఇది మూవీకి కొంతగా ఆకర్షణీయంగా అనిపించింది. సినిమా టాక్ సంగతి ఎలా ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే జపాన్ సినిమాని భాగా ఆస్వాదించారు అనే చెప్పాలి. సినిమాలో పవన్ కళ్యాణ్ ప్రస్తావన ఏకంగా నాలుగు సార్లు ఉంటుంది. డబ్బింగ్ సినిమాలలో ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ రిఫరెన్స్ ఎక్కువగా వాడుకుంటున్నారు. స్ట్రైట్ సినిమాలతో పాటు, తమిళ్ డబ్బింగ్ లలో కూడా ఈ తరహా ప్రయోగాలు చేస్తూ అభిమానులని ఎట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.

విశాల్ మార్క్ అంటోనీ మూవీలో ఓ సీన్ లో పవన్ కళ్యాణ్ పేరు ఉపయోగించుకున్నారు. దానికి ఫ్యాన్స్ నుంచి గట్టిగా విజిల్స్ పడ్డాయి. జపాన్ సినిమాలో అనూ ఇమ్మాన్యూయేల్ సంజు అనే సినిమా హీరోయిన్ పాత్రలో నటించింది. ఆమె అజ్ఞాతవాసి సినిమాలో నటించినట్లు మూవీలో ఒక పోస్టర్ లో చూపిస్తారు. అలాగే అనూ ఇమ్మాన్యూయేల్ తో కూడా పవన్ కళ్యాణ్ గురించి డైలాగ్స్ చెప్పించారు.

ఈ మూవీకి తెలుగులో రాకేందు మౌళి డైలాగ్స్ రాసారు. అతను ఫ్యాన్స్ ని దృష్టిలో ఉంచుకొని ఇలా డైలాగ్స్ సందర్భానుసారంగా పెట్టినట్లు తెలుస్తోంది. సినిమాలో పవన్ కళ్యాణ్ పేరు వినిపించినపుడు, అలాగే అజ్ఞాతవాసి పోస్టర్ చూపించినపుడు ఫ్యాన్స్ విజిల్స్ తో సందడి చేశాడు. సోషల్ మీడియాలో కూడా వీటికి సంబందించిన క్లిప్స్ షేర్ చేస్తూ అనూ ఇమ్మాన్యూయేల్ కి థాంక్స్ చెబుతున్నారు.

అయితే పవన్ కళ్యాణ్ రిఫరెన్స్ సినిమాకి ఫ్యాన్స్ ని రప్పించడం వరకు భాగానే ఉంటుంది కాని కథలో దమ్ము లేకపోతే లాంగ్ రన్ లో నిలబడటం కష్టం అని చెప్పాలి. తమిళనాట పర్వాలేదనే టాక్ జపాన్ మూవీ తెచ్చుకుంది. తెలుగులో అయితే కొంత డివైడ్ టాక్ వినిపిస్తోంది. ఈ వీకెండ్ పూర్తయితే సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందనేది తెలిసిపోనుంది.

Tags:    

Similar News