ఆదికేశవలో ఆచార్య.. ఇది దర్శకుడి క్లారిటీ!

ఇదిలా ఉంటే ఈ సినిమా టీజర్ లో టెంపుల్ ని ఎస్టాబ్లిష్ చేయడంతో ఆచార్య మూవీతో పోలిక పెట్టారు.

Update: 2023-11-18 16:17 GMT

వైష్ణవ్ తేజ్ హీరోగా శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి రాబోతున్న సినిమా ఆదికేశవ. ఈ మూవీ ఈ నెలలోనే థియేటర్స్ లోకి రావడానికి సిద్ధమైంది. స్కంద కంటే ముందుగానే ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించడం విశేషం. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఈ మూవీ తెరకెక్కింది. వైష్ణవ్ తేజ్ కెరియర్ లో ఎక్కువ బడ్జెట్ తో కమర్షియల్ జోనర్ లో ఈ మూవీ సిద్ధమైంది.

ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉన్న ఏవో కారణాల వలన ఆలస్యం అవుతూ వస్తోంది. ఫైనల్ గా నవంబర్ 24న డేట్ ఫిక్స్ చేశారు. ఇదిలా ఉంటే ఈ సినిమా టీజర్ లో టెంపుల్ ని ఎస్టాబ్లిష్ చేయడంతో ఆచార్య మూవీతో పోలిక పెట్టారు. దీంతో డైరెక్టర్ దీనిపై క్లారిటీ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇప్పటికే సినిమా వరుసగా వాయిదాలు పడుతూ థియేటర్స్ లోకి వస్తోంది. ఇలాంటి పరిస్థితిలో ఆచార్యతో పోలిక అంటే ఓపెనింగ్స్ కూడా రావడం కష్టం అని భావించారు.

ఇక తప్పనిసరి పరిస్థితిలో మీడియా ముందుకి వచ్చి వివరణ ఇచ్చారు. ఆచార్య సినిమాకి ఆదికేశవకి అస్సలు ఎలాంటి పోలిక లేదని చెప్పారు. సినిమాలో టెంపుల్ ఎపిసోడ్ కేవలం 10 నిమిషాలు మాత్రమే ఉంటుందని, తరువాత కథ వేరే పెట్రన్ లో నడుస్తుందని అన్నారు. ఆచార్యతో పోలిక పెట్టడం కాస్తా ఆందోళన కలిగించిందని, అయితే దీనికి ట్రైలర్ తో సమాధానం చెప్పాలని డిసైడ్ అయినట్లు క్లారిటీ ఇచ్చారు.

కేవలం పాజిటివ్ వైబ్ క్రియేట్ చేయడం కోసమే టెంపుల్ ఎపిసోడ్ టీజర్ లో ఉపయోగించామని అన్నారు. వైష్ణవ్ తేజ్ కూడా మాట్లాడుతూ ఆదికేశవలో శివుడిని హైలైట్ చేసే ఎలిమెంట్స్ కొన్ని ఉంటాయని, అందుకే ఆలయం షాట్స్ ఉపయోగించడం జరిగిందని తెలిపారు. కచ్చితంగా సినిమా ప్రేక్షకులకి కొత్త అనుభూతి ఇస్తుందని చెప్పుకొచ్చారు.

గత ఏడాది రంగరంగ వైభవంగా సినిమాతో డిజాస్టర్ ని ఖాతాలో వేసుకున్న వైష్ణవ్ తేజ్ కి ఆదికేశవ అయిన కమర్షియల్ సక్సెస్ ఇచ్చి నెక్స్ట్ స్టేజ్ లోకి తీసుకొని వెళ్తుందా అనేది చూడాలి. ఇక ఈ సినిమాలో శ్రీలీల మెయిన్ హీరోయిన్ గా నటించగా జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. ఇక గత శుక్రవారం ఈ సినిమాను విడుదల చేయాలని అనుకోగా వరల్డ్ కప్ మ్యాచ్ లకు హై క్రేజ్ ఉండడంతో వాయిదా వేసుకోక తప్పలేదు.

Tags:    

Similar News