ఓటీటీలో ఈ వారం సినిమాలు.. వాటిపైనే అందరి ఫోకస్

విజయ్ నటించిన లియో బాక్స్ ఆఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ అందుకున్న విషయం తెలిసిందే లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా కంటెంట్ పరంగా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక పోయింది.

Update: 2023-11-13 10:46 GMT

గత వారం విడుదలైన థియేట్రికల్ సినిమాలను అనుకున్నంత స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. జపాన్ తో పాటు జిగర్తాండ 2 అలాగే బాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీ టైగర్ 3 కూడా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. ఇక ఈ వీకెండ్ తర్వాత కూడా సినీ లవర్స్ కు పెద్దగా చూడదగిన సినిమాలు ఏమీ రావడం లేదు. కానీ ఓటీటీ లో మాత్రం కొన్ని డిఫరెంట్ సినిమాలు రాబోతున్నాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ హాట్‌స్టార్ వంటి అగ్ర OTT ప్లాట్‌ఫారమ్‌లలో ఈ వారం ప్రీమియర్ అవుతున్న కంటెంట్ లిస్ట్ పై ఒక లుక్కేస్తే..


విజయ్ నటించిన లియో బాక్స్ ఆఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ అందుకున్న విషయం తెలిసిందే లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా కంటెంట్ పరంగా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక పోయింది. కానీ టాక్ ఎలా ఉన్నా కూడా బాక్సాఫీస్ వద్ద మునుపెన్నడూ లేనంత రేంజ్ లో విజయ్ సినిమాకు కలెక్షన్లు వచ్చాయి. ఇక ఈ సినిమా ఓటీటీ లో ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్ రానే వచ్చింది. ఈ నెల 16 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

అపూర్వ అనే హిందీ చిత్రం కోసం ఓ వర్గం వారు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. గ్లామర్ డాల్ తారా సుతారియా ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా పవర్ఫుల్ రా థ్రిల్లర్‌గా రూపొందించబడింది. ఇందులో తార హై వోల్టేజ్ పాత్రలో నటించింది. ఇది ఈ నెల 15 నుండి డిస్నీ+ హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది.

చిన్న అనే సినిమా విమర్శకుల ప్రశంసలు పొందిన మంచి సినిమాల్లో ఒకటి. సిద్ధార్థ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా థ్రిల్లర్ నేపథ్యంలో చిన్నారులపై జరిగే దాడుల నేపథ్యంలో తెరకెక్కింది. సినిమాలోని ఎమోషనల్ డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా ఈ నెల 17 నుండి డిస్నీ+ హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది.

మమ్ముట్టి నటించిన కన్నూర్ స్క్వాడ్ చిత్రం కూడా విమర్శకుల ప్రశంసలు పొందింది. అందులో మమ్ముట్టి నటనతోనే సినిమా రేంజ్ ను పెంచేశారు. ఇది కూడా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. సినిమాలోని స్క్రీన్ ప్లేకు కూడా విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఇక ఇది ఈ నెల 17 నుండి డిస్నీ+ హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది.

Tags:    

Similar News