2023 టాలీవుడ్.. భయంకర నష్టాలు చూపిన సినిమాలివే..
2023 ఏడాదిలో మొట్టమొదటి అతిపెద్ద డిజాస్టర్ 'ఏజెంట్'. అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ఈ సినిమాని సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేశారు.
2023 ఏడాది టాలీవుడ్లో ఊహించని సినిమాలు భారీ విజయాలను అందుకుంటే చాలామంది స్టార్ హీరోల సినిమాలు భారీ అంచనాలతో వచ్చి బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ గా మిగిలాయి. ప్రతి ఏడాది లాగే 2023 కూడా టాలీవుడ్ కి పెద్దగా కలిసి రాలేదు. ఈ ఇయర్ ఇండ స్ట్రీకి ఆశించిన స్థాయిలో సక్సెస్ రేట్ రాలేదు. ఇక ఈ ఏడాది టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ డిజాస్టర్స్ గా నిలిచిన సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
2023 ఏడాదిలో మొట్టమొదటి అతిపెద్ద డిజాస్టర్ 'ఏజెంట్'. అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ఈ సినిమాని సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేశారు. సినిమా కోసం భారీ బడ్జెట్ను కేటాయించారు. కానీ తీరా రిలీజ్ తర్వాత పెట్టిన పెట్టుబడిలో కనీసం 10% కూడా వెనక్కి రాబట్టలేకపోయింది. అంత పెద్ద డిజాస్టర్ అయిన ఈ మూవీ ఇప్పటికీ ఇంకా ఓటీటీ లోకి రాకపోవడం గమనార్హం. స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో పెంచిన 'శాకుంతలం' బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.
గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సమంత నటనకు మంచి మంచి మార్కులు పడ్డాయి. కానీ కమర్షియల్ గా ప్లాప్ అయింది. పాన్ ఇండియా హీరో ప్రభాస్ శ్రీరాముడిగా నటించిన 'ఆదిపురుష్' విడుదలకు ముందు ఆడియన్స్ లో భారీ హైప్ క్రియేట్ చేసింది. కానీ రిలీజ్ తర్వాత సినిమాపై ఎన్నో విమర్శలు, నెగిటివిటీ కారణంగా పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ కాదు కదా పెట్టుబడిలో 40% కూడా వెనక్కి తేలేకపోయింది.
ఆ తర్వాత పవన్ కళ్యాణ్, సాయి ధరంతేజ్ కలిసిన మెగా మల్టీ స్టారర్ 'బ్రో' ఆడియన్స్ ని ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. మాస్ మహారాజా రవితేజ రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద వర్కౌట్ కాలేదు. ఇందులో రావణాసుర డిజాస్టర్ గా నిలవగా టైగర్ నాగేశ్వరరావు ప్లాప్ అయ్యింది. ఈ ఏడాది వాల్తేరు వీరయ్యతో బ్లాక్ మాస్టర్ అందుకున్న మెగాస్టార్ 'భోళా శంకర్' తో భారీ డిజాస్టర్ మూటగట్టుకున్నాడు.
ఇవే కాకుండా గోపీచంద్ రామబాణం, కళ్యాణ్ రామ్ అమిగోస్, నాగచైతన్య కస్టడీ, నాగశౌర్య రంగబలి, వరుణ్ తేజ్ గాండీవ దారి అర్జున, రామ్ స్కంద, వైష్ణక్ తేజ్ ఆదికేశవ, నితిన్ ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ లాంటి చాలా సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యాయి. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద ప్లాప్స్ గా మిగిలిపోయాయి. మరి వచ్చే ఏడాది అయినా డిజాస్టర్ అందుకున్న హీరోలు కం బ్యాక్ ఇస్తారేమో చూడాలి.