ఆ మూడు అశ్లీల OTT వేదికలపై I&B చర్యలు
కంటెంట్ ని సీరియస్ గా రివ్యూలు చేస్తున్న కమిటీ మూడు ఓవర్-ది-టాప్ (OTT) ప్లాట్‌ఫారమ్‌లు హద్దు మీరి అశ్లీల కంటెంట్‌ను స్ట్రీమింగ్ చేస్తున్నాయని ఆరోపిస్తూ నిర్ణయాత్మక చర్య తీసుకుంది.
ఓటీటీల్లో విశృంఖల కంటెంట్ పై సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ (I&B) ఫిర్యాదులు స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే. కంటెంట్ ని సీరియస్ గా రివ్యూలు చేస్తున్న కమిటీ మూడు ఓవర్-ది-టాప్ (OTT) ప్లాట్‌ఫారమ్‌లు హద్దు మీరి అశ్లీల కంటెంట్‌ను స్ట్రీమింగ్ చేస్తున్నాయని ఆరోపిస్తూ నిర్ణయాత్మక చర్య తీసుకుంది. దారితప్పిన ఆ మూడు ఓటీటీలు హంటర్స్, బేషరామ్స్ - ప్రైమ్ ప్లే అని పేర్కొంది.
OTTలకు వ్యతిరేకంగా అసభ్యతను సూచించే చట్టాలు అమలు చేయడం ఇదే మొదటిసారి. I&B మంత్రిత్వ శాఖ, OTT ప్లాట్‌ఫారమ్‌లలో అశ్లీల కంటెంట్‌కు సంబంధించిన ఫిర్యాదుల పెరుగుదలకు ప్రతిస్పందిస్తూ IT రూల్స్, 2021 అశ్లీలతకు సంబంధించిన ఇతర సంబంధిత చట్టాలను ఉల్లంఘించినట్లు పేర్కొంటూ అక్టోబర్ చివరి వారంలో నోటీసులు జారీ చేసింది. IT చట్టం, 2000లోని సెక్షన్‌లు 67 అండ్ 67A-అశ్లీలమైన విషయాలు లైంగిక అసభ్యకర చర్యలతో కూడిన మెటీరియల్‌ని ప్రచురించడం లేదా ప్రసారం చేయడం వంటివి నోటీసులలో ఉదహరించారు.
థానేలో ఉంది అశ్లీల లింకు:
మహారాష్ట్రలోని మెట్రోసిటీ థానేకు చెందిన వెబ్‌వరల్డ్ మల్టీమీడియా ప్రైవేట్ లిమిటెడ్ ఈ మూడు ప్లాట్‌ఫారమ్‌లకు నిబంధనలకు అనుగుణంగా ఉండేలా కంటెంట్ ఉండాలని ఐదు రోజుల అల్టిమేటం ఇచ్చారు. ప్రతిస్పందనగా వెబ్ వరల్డ్ మీడియా కంపెనీ ప్రతినిధి అశ్లీల కంటెంట్ ను తొలగించామని ధృవీకరించారు. ప్రస్తుతం మొత్తం కంటెంట్‌పై సమగ్ర సమీక్ష జరుగుతోంది.
I&B మంత్రిత్వ శాఖ OTT వేదికల్లో అసభ్యతకు సంబంధించిన ఫిర్యాదుల సంఖ్య పెరుగుతోందని సోర్సెస్ సూచిస్తోంది. 57 రిజిస్టరైన OTT ప్లాట్‌ఫారమ్‌లలో ఎక్కువ ఫిర్యాదులు ఇటీవల విస్తరించిన ఇంకా రిజిస్టార్ లో నమోదుకాని ప్లాట్‌ఫారమ్‌లపై వెల్లువెత్తాయి. ఆశ్చర్యకరంగా ఐ అండ్ బి దృష్టికి వచ్చిన ఆ మూడు ఓటీటీలు ఇంకా రిజిస్టర్ కాలేదని గుర్తించారు. దీనిని బట్టి ఇంకా రిజిస్టర్ కాని ఓటీటీలో సబ్ స్క్రైబర్లను పెంచుకునేందుకు విచ్చలవిడి కంటెంట్ ని రూపొందిస్తున్నాయని అర్థం చేసుకోవాలి.