బ్లాస్టింగ్ ఫెస్టివల్ లో కుర్ర హీరోల ఫైట్
మరి దీపావళి రేసులో ఉన్న సినిమాలలో ఏది బాక్సాఫీస్ విన్నర్ గా నిలుస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఈ ఏడాది దీపావళి ఫెస్టివల్ నవంబర్ 1న వస్తోంది. దీపావళి వేడుక తెలుగు రాష్ట్రాలతో పాటు ఉత్తరాది వారికి పెద్ద పండగ. ఈ ఫెస్టివల్ హాలిడేకి స్టార్ హీరోలు ఎవరూ కూడా తమ సినిమాలని రిలీజ్ చేయడం లేదు. టైర్ 2 రేంజ్ ఉన్న స్టార్స్ పోటీలో ఉన్నారు. ఫెస్టివల్ వీకెండ్ ఎంతో కొంత కలిసొస్తుందని రేసులో ఉన్నారు. దీపావళికి ఒక రోజు ముందు సినిమా రిలీజ్ ప్లాన్ చేయడం ద్వారా ఈ సారి నాలుగు రోజులు వీకెండ్ సందడి దొరుకుతోంది.
దీనిని టైర్ 2 హీరోలు కరెక్ట్ గా వినియోగించుకోవడానికి రెడీ అయ్యారు. తెలుగులో అక్టోబర్ 31న విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ మూవీ థియేటర్స్ లోకి వస్తోంది. ఈ సినిమాతో కమర్షియల్ సక్సెస్ అందుకుంటాననే నమ్మకంతో విశ్వక్ సేన్ ఉన్నారు. రవితేజ ముళ్ళపూడి దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇక అదే రోజు దుల్కర్ సల్మాన్ పాన్ ఇండియా మూవీ లక్కీ భాస్కర్ కూడా రిలీజ్ కన్ఫర్మ్ అయ్యింది.
ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యం కావడంతో సెప్టెంబర్ 27న అనుకున్న రిలీజ్ డేట్ కాస్త అక్టోబర్ 31కి మారింది. లక్కీ భాస్కర్ మూవీ పీరియాడిక్ డ్రామాగా ఉండబోతోంది. ఈ సినిమాలో మిడిల్ క్లాస్ వివాహితుడుగా దుల్కర్ సల్మాన్ క్యారెక్టర్ ఉండబోతోంది. ఇప్పటికే మూవీ నుంచి వచ్చిన సాంగ్, టీజర్ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ భారీగానే ఉన్నాయి. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ సినిమా రెడీ అవుతోంది.
కోలీవుడ్ నుంచి ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో శివ కార్తికేయన్ హీరోగా తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ అమరన్ అక్టోబర్ 31న రిలీజ్ కాబోతోంది. ఈ మూవీలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. ఇది సినిమాకి అదనపు ఆకర్షణగా ఉంది. యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథాంశంతో ఈ మూవీని మురుగదాస్ తెరకెక్కించారు. ఇందులో ఆర్మీ ఆఫీసర్ గా శివ కార్తికేయన్ నటించాడు. చాలా కాలంగా మురుగదాస్ కి సరైన సక్సెస్ పడలేదు. అయితే అమరన్ మూవీ పైన ఆయన చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.
హిందీలో అజయ్ దేవగన్ సింగం అగైన్, కార్తీక్ ఆర్యన్ బూల్ బలయ్యా 3 సినిమాలు కూడా దీపావళి పోటీలో ఉండొచ్చనే మాట వినిపిస్తోంది. ఈ సింగం సిరీస్ కి హిందీలో మంచి సక్సెస్ రేట్ ఉంది. ఈ నేపథ్యంలో సింగం అగైన్ కూడా సూపర్ హిట్ అవుతుందని భావిస్తున్నారు. మరి దీపావళి రేసులో ఉన్న సినిమాలలో ఏది బాక్సాఫీస్ విన్నర్ గా నిలుస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.