టైగర్ 3 మినీ రివ్యూ..!

సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా వచ్చిన టైగర్ ఫ్రాంచైజీలను కొనసాగిస్తూ టైగర్ 3 అంటూ తెరకెక్కించారు.

Update: 2023-11-12 08:55 GMT

సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా వచ్చిన టైగర్ ఫ్రాంచైజీలను కొనసాగిస్తూ టైగర్ 3 అంటూ తెరకెక్కించారు. మనీష్ శర్మ డైరెక్ట్ చేసిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి మినీ రివ్యూలో చూద్దాం.

రా ఏజెంట్ అవినాష్ సింగ్ రాథోడ్ అలియాస్ టైగర్ (సల్మాన్ ఖాన్)కి మాజీ ఏజెంట్ ఆతీష్ రెహ్మాన్ (ఇమ్రాన్ హష్మీ)చేస్తున్న ఆగడాలను అడ్డుకట్ట వేయాలని అనుకుంటాడు. ఆతిష్ రెహ్మాన్ టైగర్ కంటే రెండడుగులు ముందు ఉంటాడు.. టైగర్‌ను ఆపడానికి అతను పెద్ద ప్లాన్ తోనే వస్తాడు. అప్పుడు టైగర్ ఏం చేశాడు? ఇంతకీ ఆతిష్ రెహమాన్ ఏం సాధించాలనుకుంటున్నాడు? ఈ మిషన్‌లో జోయా (కత్రినా కైఫ్) టైగర్‌కి ఎలా సహాయం చేసింది? అనేది ఈ సినిమా కథ.

సినిమాను దర్శకుడు మనీష్ శర్మ యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు. బ్యాండ్ బాజా బారాత్, షారుఖ్ తో ఫ్యాన్ లాంటి సినిమాలను డైరెక్ట్ చేసిన మనీష్ శర్మ కెరీర్ లో ఫస్ట్ టైం భారీ యాక్షన్ సినిమా టైగర్ 3 ని తెరకెక్కించాడు. కథలోకి త్వరగా పరిచయం చేసిన సంఘటనలు మంచి ఆరంభాన్ని ఇచ్చాయి. మొదటి యాక్షన్ సీక్వెన్స్ కూడా ఇంప్రెస్ చేస్తుంది.

కోర్ ఫ్లాట్ బాగున్నా యాక్షన్ సన్నివేశాలు ఆడియన్స్ ని అంతగా మెప్పించలేదు. స్పై సినిమా నుంచి ఆశించే సన్నివేశాలు ఆకర్షణీయంగా లేవు. టైగర్ లుక్ కూడా అంత ఇంప్రెసివ్ గా అనిపించదు. ఇంటర్వెల్ బ్లాక్ బాగానే అనిపించగా ఫస్ట్ హాఫ్ పాస్ అయినట్టుగా అనిపించినా సెకండ్ హాఫ్ సినిమాను నిలబెట్టలేకపోయింది. ఇక పఠాన్ పరిచయం ఆ యాక్షన్ సీన్స్ ఆడియన్స్ కి మంచి జోష్ ఇస్తుంది. షారుఖ్ సల్మాన్ ఒకే ఫ్రేమ్ లో భారీ యాక్షన్ అందులో సరదా సంభాషణలు ఆకట్టుకుంటాయి. కథనం ఇంకాస్త బాగా రాసుకోవాల్సిన అవసరం ఉన్నా రొటీన్ గా నడిపించి దర్శకుడు ట్రాక్ తప్పాడు. చివర్లో హృతిక్ అతిథి పాత్ర కూడా ప్రేక్షకులను ఇంప్రెస్ చేయలేదు. యష్ రాజ్ ఫిలిమ్స్ నుంచి వచ్చిన స్పై యూనివర్స్ అత్యంత బలహీనంగా తెరకెక్కించారు.

టైగర్ 3లో ఎన్.టి.ఆర్ క్యామియో అంటూ వచ్చిన వార్తల్లో కూడా ఎలాంటి నిజం లేదు. కేవలం సినిమా మీద బజ్ పెంచేందుకే ఇలాంటి వార్తలు ట్రెండ్ చేస్తున్నారు. దీపావళి కానుకగా వచ్చిన టైగర్ 3 ప్రేక్షకులను ఇంప్రెస్ చేయడంలో విఫలమైంది.

Tags:    

Similar News