టైగర్ 3 ట్రైలర్ టాక్.. దేశమా? కుటుంబమా?
యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ కథలను రాబోయే రోజుల్లో మరింత గ్రాండ్ గా తెరపైకి తీసుకు రావడానికి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు
యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ కథలను రాబోయే రోజుల్లో మరింత గ్రాండ్ గా తెరపైకి తీసుకు రావడానికి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. RAW ఎజెంట్స్ తో కూడిన ఇక ఈ యూనివర్స్ ను మొదట స్టార్ట్ చేసిన సినిమా మాత్రం ఏక్తా టైగర్. తర్వాత వచ్చిన టైగర్ జిందా హై కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకుంది. ఒక స్పైగా సల్మాన్ ఖాన్ తన పాత్రతో బాక్సాఫీస్ వద్ద రికార్డులను బ్లాస్ట్ చేశాడు.
అయితే ఇప్పుడు ఈ రెండు కథలకు కొనసాగింపుగా మరో కొత్త కథ ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అదే టైగర్ 3. ట్రైలర్ను నేడు గ్రాండ్ గా విడుదల చేశారు. పాన్ ఇండియా సినిమాగా ఈ సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఇక తెలుగులో కూడా సినిమా ట్రైలర్ విడుదల చేశారు.
దేశంలో శాంతికి దేశంలోని శత్రువులకే మధ్య ఎంత దూరం ఉంటుంది? కేవలం ఒక మనిషి అంత.. అనే డైలాగ్ తో మొదలైన ఈ సినిమా ట్రైలర్ లో సల్మాన్ ఖాన్ ఎప్పటిలానే తన యాక్షన్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. సినిమా మొత్తం కూడా వేరే ప్రపంచంలోకి తీసుకు వెళ్లే విధంగా ఉండబోతున్నట్లు హైలెట్ అయింది.
ఇక ఈసారి శత్రువుల నుంచి దేశాన్ని రక్షించుకోవడమే కాకుండా టైగర్ తన కుటుంబాన్ని కూడా ఎలా రక్షించుకున్నాడు అనే పాయింట్ తో కదా ఎలివేట్ కాబోతోంది. సల్మాన్ ఖాన్ కి జోడిగా కత్రినా కైఫ్, ఒక బాబు ఎమోషన్ తో ఈసారి టైగర్ కథను మరింత డ్రామాగా వీక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు దర్శకుడు మనీష్ శర్మ. ఇక సినిమాలో యాక్షన్కు ఏమాత్రం కొదవలేదు.
భార్య ప్రేమ పిల్లల సంతోషంలో ఉన్న హీరోకు శత్రువు అదే సంతోషాన్ని అతనికి దూరం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. అతని మీద దేశద్రోహం ముద్రపడేలా చేయాలనే టార్గెట్ పెట్టుకున్నట్లుగా అర్థమవుతుంది. ఇక సల్మాన్ కు దెబ్బ కొట్టే పవర్ఫుల్ విలన్ గా ఇందులో ఇమ్రాన్ హష్మీ నటించాడు. ఇక అనుకున్న మిషన్ ను హీరో ఎలా చేదించాడు.
అలాగే తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు అని అంశాలు సినిమాలో హైలెట్ కాబోతున్నాయి. హీరోయిన్ కత్రినా కూడా జోయా పాత్రలో మరోసారి సరికొత్తగా ఆకట్టుకుబోతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ట్రైలర్ అయితే సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెంచింది. బాక్సాఫీస్ వద్ద నవంబర్ 12 నుంచి టైగర్ దాడి చేయబోతున్నాడు. మరి ఎలాంటి రికార్డులు బ్లాస్ట్ అవుతాయో చూడాలి.