పడి లేచిన టైగర్.. పుంజుకుంటున్న వసూళ్లు!
టాలీవుడ్ సీనియర్ హీరో మాస్ మహరాజ్ రవితేజ హీరోగా వచ్చిన టైగర్ నాగేశ్వరరావు కథ మారింది. ఈ సినిమా వసూళ్లు స్టడీగా నమోదవుతున్నాయి
టాలీవుడ్ సీనియర్ హీరో మాస్ మహరాజ్ రవితేజ హీరోగా వచ్చిన టైగర్ నాగేశ్వరరావు కథ మారింది. ఈ సినిమా వసూళ్లు స్టడీగా నమోదవుతున్నాయి. సినిమాకు క్రమక్రమంగా రెస్పాన్స్ పెరుగుతోంది. ఓ వైపు భగవంత్ సేకరి బ్లాక్ బాస్టర్ టాక్‌తో దూసుకుపోతున్నప్పటికీ.. టైగర్‌ను చూసేందుకు కూడా ఆడియెన్స్ ఆశించిన దాన్ని కన్నా ఎక్కువగానే వస్తున్నారు.
వివరాళ్లోకి వెళితే.. వంశీ దర్శకత్వంలో వచ్చిన టైగర్ నాగేశ్వరరావు చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ పిక్చర్స్ బ్యానర్ లో అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. స్టువర్టుపురం దొంగ నాగేశ్వర రావు జీవిత కథా ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజ టైగర్ నాగేశ్వరరావు పాత్రలో కనిపించి అద్భుతంగా నటించారు.
అయితే రవితేజ నటన ఆకట్టుకున్నప్పటికీ.. కథ కథనాలు మాత్రం ఆడియెన్స్‌ను మొదట అంతగా మెప్పించలేకపోయాయి. అదీగాక ఈ సినిమాకు 3 గంటల రన్ టైమ్ బాగా మైనస్ అయ్యింది. అది సినిమా ఫలితంపై గట్టిగా దెబ్బ కొట్టింది. దీంతో ఈ సినిమాకు నష్ట నివారణ చర్యలు కూడా చేశారు మేకర్స్. సినిమాను 3 గంటల నుంచి 20 నిమిషాల రన్ టైమ్‌ను ట్రిమ్ చేసి.. 2 గంటల 37 నిమిషాలకు కుదించారు.
సినిమాను ట్రిమ్ చేయడం ప్లస్ అయింది. రెస్పాన్స్ క్రమక్రమంగా పెరగడం ప్రారంభమైంది. దీంతో వసూళ్లు కూడా నెమ్మదిగా పుంజుకోవడం విశేషం. పైగా లియో ఇక్కడ కాస్త డౌన్ అయిపోవడంతో టైగర్ ప్రేక్షకులకు సెకండ్ ఆప్షన్‌గా మారింది. ప్రేక్షకులు ఈ సినిమాపై మరింత ఆసక్తి చూపిస్తున్నారు. రవితేజ అభిమానులు, మాస్ ప్రేక్షకులు సినిమాను బానే చూస్తున్నట్లు తెలుస్తోంది. కథ క్రీస్పీగా ఉందంటూ, థియేటర్లో సినిమాను బాగా ఎంజాయ్ చేస్తున్నారు.
దసరా తర్వాతి రోజు సినిమాకు మంచి వసూళ్లే వచ్చాయని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. మరి ఇక పెరిగిన కలెక్షన్స్‌తో ఇప్పుడీ సినిమా ఎంత వరకు సేవ్ అవుతుందో చూడాలి.. ఇకపోతే సినిమాలో అనుపమ్ ఖేర్, నుపుర్ సనన్, రేణు దేశాయ్, జిషుసేన్ గుప్త, మురళీ శర్మ, గాయత్రీ భరద్వాజ్, నాజర్ తదితరులు నటించారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.