టైగర్.. ఆ విషయంలో జాగ్రత్త పాటించాల్సింది!
ఆ నమ్మకంతో టైగర్ నాగేశ్వరరావు లాంటి పెద్ద బాధ్యతను ఆయనకు ఇచ్చారు. మరి ట్యూన్స్ రాబట్టుకోవడంలో దర్శకుడు వంశీ ఫెయిలయ్యాడో
ఓ సినిమా విజయంలో సంగీతం కూడా ఎంతటి కీలక పాత్ర పోషిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓ సన్నివేశాన్ని సందర్భానికి తగట్టుగా ప్రేక్షకుడికి మరింత దగ్గర చేసి రంజింపజేస్తుంటి. కొన్ని కంటెంట్ స్థాయిని కూాడా మరింత బలంగా చూపిస్తాయి. రీసెంట్గా వచ్చిన విక్రమ్, జైలర్‌కు కంటెంట్ ఒక ఎత్తైతే దాన్ని మరింత పవర్‌ఫుల్‌గా పైకి లేపింది అనిరూధ్ మ్యూజిక్కే. తెలుగులో భాళోశంకర్, అఖండకు దేవీ శ్రీప్రసాద్, తమన్ మ్యూజిక్కే హైలైట్.
అందుకే ఓ సినిమాకు సంగీత దర్శకుడిని ఎంచుకున్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మరీ ముఖ్యంగా పాన్ ఇండియా చిత్రాలకు. ఏ మాత్రం తేడా కొట్టినా దాని ఎఫెక్ట్ పూర్తి సినిమాపై పడుతుంది. ఫలితంగా సినిమా రిజల్ట్ తేడా కొట్టొచ్చు. ఇప్పుడు తాజాగా రిలీజైన రవితేజ టైగర్ నాగేశ్వరరావు విషయంలో అదే కనిపిస్తోంది!
ఈ చిత్రానికి జీవి ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు. ఆయన మనకు కొత్తేమి కాదు. చాలా కాలం నుంచే పరిచయం. ప్రభాస్ డార్లింగ్, రామ్ ఎందుకంటే ప్రేమంట వంటి మంచి ఆల్బమ్స్ ఇచ్చారు. ఒంగోలు గిత్తకు నాలుగు పాటలు కంపోజ్ చేశారు. డబ్బింగ్ చిత్రాల్లోనూ యుగానికి ఒక్కడు, షాపింగ్ మాల్ లాంటివి సూపర్ హిట్ అయ్యాయి. తమిళంలో చాలా హిట్లు ఇచ్చారు.
ఆ నమ్మకంతో టైగర్ నాగేశ్వరరావు లాంటి పెద్ద బాధ్యతను ఆయనకు ఇచ్చారు. మరి ట్యూన్స్ రాబట్టుకోవడంలో దర్శకుడు వంశీ ఫెయిలయ్యాడో లేక మంచి బీజేఎం ఇవ్వడంలో ప్రకాశ్ తడబడ్డారో తెలీదు కానీ టైగర్ మూవీలో అతి పెద్ద మైనస్ సంగీతం అని అంటున్నారు.
జీవీ ప్రకాశ్ నుంచి రాబోయే సినిమాలు లిస్ట్ కూడా పెద్ద సినిమాలదే. ధనుశ్ కెప్టెన్ మిల్లర్, వైష్ణవ్ తేజ్ ఆదికేశవ, విక్రమ్ తంగలాన్, కంగనా రౌనత్ ఎమెర్జెన్సీ, కార్తీ జపాన్, అక్షయ్ కుమార్ ఆకాశం నీ హద్దురా రీమేక్ వంటి సినిమాలు ఉన్నాయి. మరి ఈ పని ఒత్తిడిలో టైగర్ నాగేశ్వరరావుకు సరిగా ఔట్ ఫుట్ ఇవ్వలేకపోయారా లేదా ఇంకేదైనా కారణమా అనేది ఆయనకే తెలియాలి.