టైగర్ నాగేశ్వరరావు సెన్సార్.. దోపిడీకి సిద్ధం!
టైగర్ నాగేశ్వరరావు సినిమా స్టువర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత ఆధారంగా రూపొందింది.
మాస్ మహారాజా రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమా ఈ నెల 20వ తేదీన గ్రాండ్ గా విడుదల కాబోతోంది. రవితేజ హీరోగా భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా అతని కెరీర్ లోనే భారీ స్థాయిలో విడుదలవుతోంది. ఇప్పటివరకు వచ్చిన సినిమాలు ఒక లెక్క ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావు మరొక లెక్క అనే విధంగా థియేటర్లోకి అడుగుపెట్టబోతోంది.
టైగర్ నాగేశ్వరరావు సినిమా స్టువర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత ఆధారంగా రూపొందింది. దర్శకుడు వంశీ ఈ సినిమా స్క్రిప్ట్ కోసమే దాదాపు నాలుగేళ్లు వర్క్ చేసాడు. ఇక మొత్తానికి సినిమా అన్ని పనులను పూర్తి చేసుకుని ఈ శుక్రవారం అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. ఇక సినిమాకు సంబంధించిన సెన్సార్ పనులను కూడా పూర్తి చేశారు.
ఈ సినిమాకు U/A అయ్యే సర్టిఫికెట్ లభించింది. అక్కడక్కడ కొన్ని మ్యూట్ లతో సినిమాకు సెన్సార్ లభించినట్లు సమాచారం. మూడు గంటల నిడివి తో రాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుంది అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో కూడా హాట్ టాపిక్ గా మారింది. ఈ రోజుల్లో రెండు గంటల 30 నిమిషాలు అంటేనే చాలా ఎక్కువ. ఆడియన్స్ ను మూడు గంటల పాటు కూర్చోబెట్టడం అనేది చాలా రిస్క్ తో కూడుకున్న పని.
ఏమాత్రం బోరింగ్ అనిపించినా కూడా సినిమాకు అదే పెద్ద డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. గతంలో కూడా కొన్ని సినిమాలకు నిడివి చాలా దెబ్బ కొట్టింది. కాబట్టి ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావు ఎక్కడ బోర్ కొట్టించకుండా ఆకట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఈ నిడివి పై మాత్రం దర్శకుడు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఆడియన్స్ ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తారు అని ముఖ్యంగా చివరి 10 నిమిషాల్లో క్లైమాక్స్ ఊహించని స్థాయిలో ఉంటుంది అని కూడా చెప్పారు.
ఇక సెన్సార్ నుంచి ఈ సినిమాకు పాజిటివ్ రియాక్షన్ అయితే వచ్చింది. ఎక్కడ సెన్సిటివ్ అంశాలను పెద్దగా హైలైట్ చేయకుండా దర్శకుడు ఈ సినిమాను రూపొందించినట్లుగా తెలుస్తోంది. రియాలిటీ కి తగ్గట్టుగా అలాగే కొన్ని మాస్ ఎలివేషన్ సీన్స్ కూడా సినిమాలో హైలెట్ గా నిలుస్తాయట. ముఖ్యంగా రవితేజ రెండు విభిన్నమైన షేడ్స్ లో ఈ సినిమాలో ఎంతగానో ఆకట్టుకుంటాడు అని తెలుస్తుంది. మరి బాక్స్ ఆఫీస్ వద్ద దోపిడీకి సిద్ధమైన టైగర్ నాగేశ్వరరావు ఎంతవరకు ఆకట్టుకుంటాడో చూడాలి.