. 'టైగర్‌ 3' రిలీజ్‌.. రజినీ, విజయ్‌ ఫ్యాన్స్ రచ్చ

సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన టైగర్‌ 3 చిత్రం దీపావళి సందర్భంగా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. హిందీతో పాటు తెలుగు, తమిళ ఇతర సౌత్‌ భాషల్లో విడుదల అయింది.

Update: 2023-11-13 04:51 GMT

సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన టైగర్‌ 3 చిత్రం దీపావళి సందర్భంగా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. హిందీతో పాటు తెలుగు, తమిళ ఇతర సౌత్‌ భాషల్లో విడుదల అయింది. సౌత్ లో పెద్దగా ఈ సినిమా కలెక్షన్స్‌ గురించి చర్చ లేదు. కానీ తమిళనాట మాత్రం ఈ సినిమా విడుదల తర్వాత రజినీకాంత్‌, విజయ్‌ ఫ్యాన్స్‌ ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారు.

తమిళ ప్రభుత్వం ఇటీవల ఎర్లీ మార్నింగ్‌ షో లను బ్యాన్‌ చేస్తూ నిర్ణయం తీసుకుంది. రజినీకాంత్‌ జైలర్‌ మరియు విజయ్ లియో సినిమాలకు బెనిఫిట్‌ షో లకు అనుమతి ఇవ్వక పోవడంతో ఆయా హీరోల ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉదయం షో ల వల్ల న్యూసెన్స్ క్రియేట్‌ అవుతుంది అనే ఉద్దేశ్యంతో స్టాలిన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందట.


లియో సినిమా సమయంలో ఈ విషయమై చాలా పెద్ద చర్చ జరిగింది. రాజకీయంగా కూడా ఈ విషయం వివాదాన్ని రాజేసింది. లియో సినిమా ను బెనిఫిట్‌ షో లు చూసే అవకాశం విజయ్ ఫ్యాన్స్ కి దక్కలేదు. ఇక మీదట తమిళనాట బెనిఫిట్‌ షో లు ఉండవని అనుకుంటున్న సమయంలో నిన్న విడుదల అయిన టైగర్‌ 3 సినిమా బెనిఫిట్ షో లు పడ్డాయి.

ఏమాత్రం బజ్ లేని, అయిదు లక్షల రూపాయల అడ్వాన్స్ బుకింగ్‌ కూడా అవ్వని టైగర్‌ 3 సినిమా యొక్క బెనిఫిట్ షో లకు అనుమతి ఇవ్వడం విడ్డూరంగా ఉందని రజినీ మరియు విజయ్‌ ఫ్యాన్స్ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మన స్టార్స్ ని కాదని, పక్క భాషల స్టార్స్ సినిమాకు బెనిఫిట్‌ షో లకు అనుమతి ఇవ్వడం ఏంటి అంటూ వారు ప్రశ్నిస్తున్నారు.

టైగర్‌ 3 సినిమా బెనిఫిట్‌ షో లకు అనుమతి ఇచ్చినా కూడా పెద్దగా దక్కిన ప్రయోజనం ఏమీ లేదని వారు అంటున్నారు. ఇక ప్రభుత్వ వర్గాల వారు మాత్రం ఈ విషయం గురించి స్పందిస్తూ టైగర్‌ 3 సినిమా ఆది వారం విడుదల అయింది కనుక ప్రత్యేక షో కి అనుమతి లభించింది.

వీక్ డేస్ లో వచ్చే సినిమాలకు బెనిఫిట్‌ షో కు అనుమతి లేదు, కానీ వీకెండ్‌ లో మాత్రం బెనిఫిట్‌ షో లకు అనుమతి ఇస్తామని వారు అన్నారు. ఆ విషయాన్ని జైలర్ మరియు లియో సినిమా ల విడుదల సమయంలో ఎందుకు క్లారిటీగా చెప్పలేదు అంటూ ఆయా సినిమాలను కొనుగోలు చేసి డిస్ట్రిబ్యూట్‌ చేసిన బయ్యర్లు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి టైగర్‌ 3 సినిమా తమిళనాట కొత్త చర్చకు, రచ్చకు తెర తీశాయి.

Tags:    

Similar News