టిల్లు స్క్వేర్.. ఇంత సైలెంట్ ఎందుకంట?
దీని గురించే ఇప్పుడు నెట్టింట చర్చ జరుగుతోంది. అయితే ప్రమోషన్ల విషయంలో టిల్లు స్క్వేర్ మేకర్స్ పక్కా ప్లాన్ తో ఉన్నట్లు తెలుస్తోంది.
సిద్ధూ జొన్నలగడ్డ.. డీజే టిల్లు మూవీతో ఎలాంటి పేరు సంపాదించుకున్నారో అందరికీ తెలిసిందే. సిద్ధును ఓవర్ నైట్ స్టార్ చేసిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. యూత్ లో ఈ సినిమా మంచి హైప్ సంపాదించుకుంది. సాంగ్స్, రోల్స్ కు ఫుల్ క్రేజ్ వచ్చింది. ఇప్పటికీ ఈ సినిమాలోని డీజే టిల్లు టైటిల్ సాంగ్ వినబడుతూనే ఉంటోంది. ఇప్పుడు డీజే టిల్లు సీక్వెల్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
టిల్లు స్క్వేర్ గా రాబోతున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్.. మంచి బజ్ క్రియేట్ చేశాయి. హీరోయిన్ గా అనుపమ పరమేశ్వన్ నటిస్తున్న ఈ సినిమా.. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడి మార్చి 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. అయితే ఈ సినిమా కోసం యూత్.. ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కానీ మేకర్స్ మాత్రం ఇంకా ప్రమోషన్లు మొదలుపెట్టలేదు.
దీని గురించే ఇప్పుడు నెట్టింట చర్చ జరుగుతోంది. అయితే ప్రమోషన్ల విషయంలో టిల్లు స్క్వేర్ మేకర్స్ పక్కా ప్లాన్ తో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వారం థియేటర్లో ఏడుకుపైగా చిన్న సినిమాలు సందడి చేస్తున్నాయి. కానీ వాటిలో ఏ ఒక్క సినిమాపై కూడా పెద్దగా బజ్ లేదు. ఇక తర్వాత వారంలో శ్రీవిష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ఓం భీమ్ బుష్ మూవీ రానుంది. మార్చి 22వ తేదీన విడుదల కానున్న ఈ సినిమా ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేసుకుంది.
అయితే మార్చి చివరి శుక్రవారం రిలీజ్ కానున్న టిల్లు స్క్వేర్ మూవీ మేకర్స్.. ప్రస్తుతం కావాలనే సైలెంట్ గా ఉన్నారట. 22వ తేదీ తర్వాత ఒక్కసారిగా పెద్ద ఎత్తున ప్రమోషన్లు స్టార్ట్ చేయనున్నారట. ఈ రెండు వారాల బాక్సాఫీస్ వద్ద పలు సినిమాల రిజల్ట్ లను బట్టి ప్లాన్ చేయనున్నారట. భారీ బజ్ తో మార్చి 29వ తేదీన బరిలో దిగేటట్లు చూస్తున్నారట. మొత్తానికి టిల్లు స్క్వేర్ మేకర్స్ కొంత రిస్క్ అయితే తీసుకుంటున్నారు. కంటెంట్ మీద నమ్మకంతో నిర్మాత నాగవంశీ గట్టిగానే ఖర్చు చేశారు. ఇక అనుకున్న ప్లాన్ వర్కౌట్ కాకపోతే మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది. మరి వారి లెక్క ఎలా వర్కౌట్ అవుతుందో చూడాలి.
ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్లు రామ్ మిర్యాల, అచ్చు రాజమణి బాణీలు కడుతున్నారు. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమా బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. డీజే టిల్లులో ఫిమేల్ లీడ్ రోల్ చేసిన నేహా శెట్టి.. సీక్వెల్ లో స్పెషల్ పాత్రలో కనిపించనుందట. మరి ఈ మూవీ ఎలాంటి హిట్ అవుద్దో వేచి చూడాలి.