టిల్లు స్క్వేర్ రన్ టైం ఎంతంటే?

కచ్చితంగా సిద్దు ఖాతాలో టిల్లు స్క్వేర్ మరో బ్లాక్ బస్టర్ హిట్ గా చేరుతుందని అంచనా వేస్తున్నారు

Update: 2024-02-24 03:59 GMT

సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ కాంబినేషన్ లో తెరకెక్కి మార్చిలో ప్రేక్షకుల ముందుకి రానున్న చిత్రం టిల్లు స్క్వేర్. ఈ మూవీ సాంగ్స్, ట్రైలర్ ఇప్పటికే రిలీజ్ అయ్యి ఆకట్టుకున్నాయి. డీజే టిల్లు తరహాలోనే టిల్లు స్క్వేర్ లో కూడా కావాల్సినంత ఫన్ అండ్ రొమాన్స్ ఉండబోతోందని ట్రైలర్ తోనే స్పష్టం అయ్యింది. దీంతో మూవీపైన భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

కచ్చితంగా సిద్దు ఖాతాలో టిల్లు స్క్వేర్ మరో బ్లాక్ బస్టర్ హిట్ గా చేరుతుందని అంచనా వేస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్ బోల్డ్ పెర్ఫార్మెన్స్ కూడా ఈ మూవీకి అదనపు అస్సెట్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక టిల్లు క్యారెక్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటికే ఆ క్యారెక్టర్స్ కి తెలుగు రాష్ట్రాలలో విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు.

సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రంపై చాలా హోప్స్ పెట్టుకుంది. అద్భుతం ఫేమ్ మల్లిక్ రామ్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. ఇదిలా ఉంటే ఈ మధ్యకాలంలో సీక్వెల్స్ అనేసరికి చాలా సినిమాల రన్ టైం ఎక్కువగా ఉంటుంది. కథని సుదీర్ఘంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. పాన్ ఇండియా బ్రాండ్ కావడంతో డీటెయిలింగ్ గా స్టోరీని నేరేట్ చేయాలని లాంగ్ రన్ టైంతో మూవీస్ చేస్తున్నారు.

అయితే టిల్లు స్క్వేర్ మాత్రం కేవలం 2 గంటల 1 నిమిషం మాత్రమే రన్ టైంతో ఉంటుందంట. ఈ మూవీ ప్యూర్ ఎంటర్టైన్మెంట్ గా, కేవలం ప్రేక్షకులకి థియేటర్స్ కి వచ్చి హాయిగా నవ్వుకోవడానికి మాత్రమే సిద్దు జొన్నలగడ్డ చేస్తున్నారు. మూవీతో సందేశాలు ఇచ్చే ప్రయత్నం చేయడం లేదు. ప్రెజెంట్ సొసైటీలో ఉండే కాంటెంపరరీ లైన్ ని తీసుకొని దానికి వినోదాన్ని జోడించి ప్రేక్షకులకి అందిస్తున్నాడు.

అందుకే డీజే టిల్లుకి ప్రేక్షకులు, ముఖ్యంగా యూత్ బాగా కనెక్ట్ అయ్యారు. టిల్లు స్క్వేర్ కి కూడా అదే రీతిలో కనెక్ట్ అవుతారని నమ్ముతున్నారు. ట్రైలర్ తో వచ్చిన వైబ్ మూవీపైన ఎక్స్ పెక్టేషన్స్ పెంచేసింది. దీంతో నెట్ ఫ్లిక్స్ ఏకంగా 35 కోట్లు పెట్టి డిజిటల్ రైట్స్ కొనేసింది. దీనిని బట్టి సినిమాపైన ఎంత బజ్ ఉందో అర్ధం చేసుకోవచ్చు.

Tags:    

Similar News