పిక్ టాక్ : బేబమ్మ చీర కట్టుతో చంపేస్తోంది
తెలుగు లో సినిమాలు లేక పోవడంతో తమిళ్, మలయాళ సినిమా ఇండస్ట్రీలో ఆఫర్ల కోసం ప్రయత్నాలు చేసింది.
ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ కృతి శెట్టి. మొదటి సినిమా విడుదల అవ్వక ముందే మూడు నాలుగు సినిమాలకు సైన్ చేసిన ఈ అమ్మడు ఉప్పెన సూపర్ హిట్ అవ్వడంతో మరో నాలుగు అయిదు సినిమాలకు బ్యాక్ టు బ్యాక్ ఓకే చెప్పింది. సోషల్ మీడియాలోనూ కృతి శెట్టికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కింది. వరుసగా మూడు నాలుగు సినిమాలతో సక్సెస్ లను దక్కించుకున్న కృతి శెట్టి ఆ తర్వాత చేసిన సినిమాలు వరుసగా నిరాశ పరుస్తూ వచ్చాయి. దాంతో టాలీవుడ్ లో ఈ అమ్మడికి ఆఫర్లే కరువు అయ్యాయి.
తెలుగు లో సినిమాలు లేక పోవడంతో తమిళ్, మలయాళ సినిమా ఇండస్ట్రీలో ఆఫర్ల కోసం ప్రయత్నాలు చేసింది. తమిళ్ లో మూడు సినిమాలను చేస్తున్న ఈ అమ్మడు మలయాళంలో చేసిన 'ఏఆర్‌ఎం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మలయాళంలో ఈమె చేసిన సినిమాకి పాజిటివ్ టాక్ దక్కింది. మలయాళ సినిమా ఇండస్ట్రీలో రాబోయే రోజుల్లో ఈ అమ్మడు వరుసగా సినిమాలు చేసే అవకాశాలు ఉన్నాయి. తమిళంలో ఈమె చేస్తున్న మూడు సినిమాల్లో కనీసం ఒక్కటి హిట్ అయినా కచ్చితంగా మరిన్ని ఆఫర్లు వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
కెరీర్ ఆరంభంలో స్కిన్ షో కి దూరంగా ఉన్న ఈ అమ్మడు ఈ మధ్య కాలంలో గ్లామర్ గా కనిపించేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. అందుకోసమే ఈ అమ్మడు సోషల్ మీడియాలో అందాల ఆరబోత ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈమె చీర కట్టు ఫోటోలను షేర్ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నడుము అందాన్ని చూపిస్తూ చూపు తిప్పుకోనివ్వని బేబమ్మ కృతి శెట్టి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ బేబమ్మ ప్రతిభను, అందంను ప్రేక్షకులకు చూపించడంలో విఫలం అయ్యారు. ముందు ముందు అయినా ఆమె టాలీవుడ్ లో మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నారు.
ఇంత అందంగా ఉన్న కృతి శెట్టికి టాలీవుడ్ తో పాటు ఇతర భాషల్లోనూ స్టార్ హీరోలతో నటించే అవకాశాలు రావాల్సిన అవసరం ఉంది. ఆమె ఇలా అందాల ఫోటోలను షేర్ చేయడం ద్వారా మళ్లీ తెలుగు లో సినిమాలు చేసే అవకాశాలు ఉన్నాయి. బేబమ్మ చీర కట్టు ఫోటోలకు సాధారణంగానే అభిమానులు ఎక్కువ మంది ఉంటారు. ఈసారి నడుము అందం చూపిస్తూ బేబమ్మ ఇచ్చిన ఫోటో ఫోజులు మరింత వైరల్ అవుతున్నాయి. లూజ్ హెయిర్ స్టైల్ తో రెండు పెద్ద తెల్ల గులాబీలను ధరించిన బేబమ్మ అందం ముందు ఎంతటి వారైనా దిగదుడుపే అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.