సమంత క్రేజీ లుక్.. పొట్టి డ్రెస్సులో ఇలా..
సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత చివరిగా గత ఏడాది ‘ఖుషి’ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చింది.
సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత చివరిగా గత ఏడాది ‘ఖుషి’ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా తర్వాత కొంతకాలం సినిమాలకి విరామం తీసుకొని శారీరకంగా, మానసికంగా స్ట్రెంత్ పెంచుకొని రంగంలోకి దిగింది. ఇప్పటికే రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో ‘సిటాడెల్’ ఇండియన్ వెర్షన్ సిరీస్ ని కంప్లీట్ చేసింది. ఆ వెబ్ సిరీస్ టీజర్ ఆగష్టులో రిలీజ్ అయ్యింది.
ఇందులో అదిరిపోయే రేంజ్ లో యాక్షన్ సీక్వెన్స్ తో సమంత అదరగొట్టింది. సమంత మెస్మరైజింగ్ పెర్ఫార్మెన్స్ కి వరుణ్ ధావన్ యాక్షన్ కూడా తోడవడంతో ‘సిటాడెల్: హానీ బనీ’ పైన ఎక్స్ పెక్టేషన్స్ పెరిగాయి. నవంబర్ 7న ఈ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కాబోతోంది. ఇదిలా ఉంటే హిందీలో మరో వెబ్ సిరీస్ కూడా సమంత మొదలెట్టిందనే టాక్ వినిపిస్తోంది. అయితే దానిపై అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు.
దీంతో పాటు హిందీలో కొన్ని సినిమాలు డిస్కషన్ స్టేజ్ లో ఉన్నాయనే ప్రచారం నడుస్తోంది. సమంత తెలుగులో మాత్రం కొత్త సినిమాలేవీ మొదలెట్టలేదు. అయితే సామ్ ఇన్ స్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఏదో ఒక అప్డేట్ ఇన్ స్టా లో పంచుకుంటుంది. ఈ మధ్య హెల్త్ పాడ్ కాస్ట్ కూడా సమంత స్టార్ట్ చేసింది. అందులో చాలా రకాల అనారోగ్య సమస్యలపై హెల్త్ ఎక్స్ పెర్ట్స్ ని సమంత ఇంటర్వ్యూ చేస్తూ వాటికి సమాధానాలు తెలుసుకుంటోంది. ఇక ఆ వీడియోలను అమ్మడు ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తోంది.
ఇవి బాగా వైరల్ అవుతున్నాయి. అందుకే మూవీస్ చేయకపోయిన సమంత సోషల్ మీడియాలో నిత్యం ట్రెండింగ్ లో ఉంటుంది. ఇదిలా ఉంటే తాజాగా సామ్ క్రేజీ లుక్స్ తో ఫోటో షూట్ ని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. షార్ట్ గౌను పైన సూట్ ధరించి అదిరిపోయే స్టిల్స్ తో ఉన్న ఈ ఫోటోలు ఫ్యాన్స్ ని ఇట్టే ఎట్రాక్ట్ చేశాయి. ఈ లుక్స్ లో సమంత గార్జియస్ గా ఉందనే మాట వినిపిస్తోంది. ఈ విధంగా అదిరిపోయే స్టన్నింగ్ లుక్స్ లో సమంతని తెరపై చూస్తే ప్రేక్షకులు ఫిదా అయిపోతారనే మాట వినిపిస్తోంది.