సంక్రాంతి సినిమాలు.. తేల్చుకోవాల్సిన టైమొచ్చింది
ఈసారి కూడా పోటీకి వచ్చిన సినిమాలు ఆసక్తిని కలిగించాయి. అయితే ఫైనల్ గా సంక్రాంతి పండుగ సందడి ముగిసింది. ఇప్పుడే అసలు పరీక్ష ప్రారంభమైంది.
టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రతీ పండగ కూడా సినిమాలకు గోల్డెన్ టైమ్ లాంటింది. ముఖ్యంగా సంక్రాంతి స్లాట్ లో క్లిక్కయితే ఊహించని లాభాలు చూడవచ్చు. అందుకే ప్రముఖ హీరోలు నిర్మాతలు పోటీ పడి మరీ పొంగల్ బరిలో నిలిచేందుకు ఇష్టపడతారు. ఈసారి కూడా పోటీకి వచ్చిన సినిమాలు ఆసక్తిని కలిగించాయి. అయితే ఫైనల్ గా సంక్రాంతి పండుగ సందడి ముగిసింది. ఇప్పుడే అసలు పరీక్ష ప్రారంభమైంది.
సంక్రాంతి రేసులో విడుదలైన చిత్రాల నిజమైన ఫలితాలు ఈ పోస్ట్ ఫెస్టివల్ దశలోనే తేలనున్నాయి. రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ గురించి ఇప్పటికే ఓ స్పష్టత వచ్చేసింది. 400 కోట్ల భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా ఓపెనింగ్స్ బాగానే రాబట్టినా సినిమా కాంటెంట్ అంచనాలను అందుకోలేకపోయింది. చిత్ర నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఆర్థిక నష్టాలను ఎదుర్కోవాల్సి రావచ్చని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.
మొదటి రోజు అనంతరం పండగ టైమ్ లో గేమ్ ఛేంజర్ కలెక్షన్లు ఆశించిన స్థాయిలో లేవు. ఇది చరణ్ కెరీర్‌లో ఉహించని డిజాస్టర్ గా నిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఫుల్ రన్ లో సినిమా 200 కోట్లు అందుకోవడం కూడా కష్టమే. మరోవైపు, నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమా తొలిరోజుల్లో మంచి ఓపెనింగ్స్ సాధించింది. కానీ, ఆ తర్వాత సినిమా వసూళ్లు తగ్గుముఖం పట్టాయి. జెట్ స్పీడ్ లో 100 కోట్లు వచ్చినా కూడా కంటెంట్ పైన కాస్త మిక్స్ డ్ టాక్ రావడంతో ప్రభావం పడింది.
ముఖ్యంగా గురువారం, శుక్రవారం రోజుల్లో ఆల్ మోస్ట్ కలెక్షన్లు స్టాన్డెర్డ్ గా లేకపోవడం సినిమా టార్గెట్ కు సమస్యగా మారింది. అయితే, వీకెండ్‌లో వసూళ్లలో కొంత పుంజుకుంటే, యావరేజ్ బాక్సాఫీస్ రిజల్ట్ పొందే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. యునైటెడ్ స్టేట్స్‌లో బ్రేక్ ఈవెన్ సాధించే ఛాన్స్ మాత్రం ఉందని చెబుతున్నారు.
ఇక విక్టరీ వెంకటేశ్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం ప్రస్తుతం సంక్రాంతి విన్నర్‌గా కనిపిస్తోంది. సినిమా మొదటి నాలుగు రోజుల్లోనే ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకర్షించి భారీ వసూళ్లు సాధించింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. కానీ, వీకెండ్ తర్వాత ఈ సినిమా సత్తా ఎంత వరకు నిలుస్తుందనేది చూస్తే తెలుస్తుంది. శని ఆదివారం బుకింగ్స్ బాగానే ఉన్నాయి. అయితే సోమవారం నుంచి ఇంతే హడావుడి కనిపిస్తుందో లేదో చూడాలి. అయితే సినిమా మాత్రం 200 కోట్ల మార్క్ ను టచ్ చేసే ఛాన్స్ ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఇక మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సంక్రాంతి సీజన్ వరకు పుష్ప 2 ఉండడం. ఈ సినిమా మరో 20 నిమిషాల అదనపు నిడివితో టిక్కెట్ రేట్లు తక్కువ రేంజ్ లో ఉండేలా జాగ్రత్తలు తీసుకొని రీలోడెడ్ వెర్షన్ గా వచ్చింది. కానీ, ఈ సినిమాకు పెద్దగా స్పందన రాలేదు. శుక్రవారం కూడా తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లను సాధించలేకపోయింది. ఫైనల్ గా సంక్రాంతి సినిమాలు ఈ వీకెండ్ లోనే తేల్చుకోవాల్సిన టైమొచ్చింది. శని ఆదివారం గడిస్తే ఫైనల్ కలెక్షన్స్ ఎంతమేరకు వస్తాయనే విషయంలో ఒక క్లారిటీ వస్తుంది.