ప్రభాస్ తరువాత.. ఈ ముగ్గురి మద్యే అసలు పోటీ

ఇండియాలో అత్యధిక మార్కెట్ వేల్యూ కలిగిన హీరోల్లో డార్లింగ్ ప్రభాస్ నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు.

Update: 2024-09-25 00:30 GMT

ఇండియాలో అత్యధిక మార్కెట్ వేల్యూ కలిగిన హీరోల్లో డార్లింగ్ ప్రభాస్ నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. కల్కి 2898ఏడీ తర్వాత ప్రభాస్ మార్కెట్ 500+ కోట్లకి రీచ్ అయ్యింది. ప్రభాస్ తో మూవీ చేస్తే ఈజీగా 500+ కోట్లు వస్తాయని మేకర్స్ భావిస్తున్నారు. అలాగే 300 నుంచి 400 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టడానికి నిర్మాతలు ముందుకొస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ లైన్ అప్ లో 5 సినిమాలు ఉన్నాయి. వాటిలో రెండు సీక్వెల్స్ కాగా మూడు డైరెక్ట్ చిత్రాలు ఉన్నాయి. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ చేస్తోన్న ‘ది రాజాసాబ్’ షూటింగ్ జరుగుతోంది.

హను రాఘవపూడి ‘ఫౌజీ’ షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది. సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ మూవీ షూటింగ్ ఈ ఏడాది ఆఖరులో మొదలయ్యే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలు కనీసం మూడు చిత్రాలైన 1000 కోట్లకి పైగా కలెక్షన్స్ సాధించే ఛాన్స్ ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. అంటే ప్రభాస్ లైనప్ చూస్తుంటే ఇప్పట్లో ఎవ్వరు కూడా టచ్ చేయలేని పొజిషన్ లో ఉన్నాడని అనిపిస్తోంది.

టాలీవుడ్ నుంచి ప్రభాస్ ఇమేజ్ ని అందుకునే స్టామినా ముగ్గురు స్టార్ హీరోలకి ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు. వారిలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఉన్నారు. ఈ ముగ్గురు ఇప్పటికే పాన్ ఇండియా స్టార్స్ గా ఎస్టాబ్లిష్ అయ్యారు. ‘పుష్ప’ మూవీకి హిందీలో సూపర్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో త్వరలో రానున్న ‘పుష్ప 2’పైన భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రంతో థియేటర్స్ లోకి రాబోతున్నారు.

‘ఆర్ఆర్ఆర్' తో వచ్చిన ఎన్టీఆర్ పాన్ ఇండియా ఇమేజ్ ని ‘దేవర’ ఏ స్థాయికి వెళ్లగలదనేది త్వరలో తేలిపోతుంది. ఈ మూవీ వర్క్ అవుట్ అయితే పాన్ ఇండియా స్టార్ గా మార్కెట్ వేల్యూ పెంచుకుంటాడు. తారక్ నుంచి ఆరేళ్ళ తర్వాత సోలో మూవీగా ‘దేవర’ వస్తోంది. ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కి ‘ఆర్ఆర్ఆర్’ తో పాన్ ఇండియా ఇమేజ్ వచ్చింది. ఆయన నుంచి ‘గేమ్ చేంజర్’ మూవీ డిసెంబర్ లో రిలీజ్ కానుంది.

ఈ చిత్రంపై అనుకున్నంత బజ్ అయితే లేదు. ఈ సినిమాతో సోలో హీరోగా రామ్ చరణ్ ఏ స్థాయిలో ఇంపాక్ట్ చూపిస్తాడనేది క్లారిటీ లేదు. పాన్ ఇండియా మార్కెట్ లో ఈ సినిమా ఇంకా బజ్ పెంచాల్సిన అవసరం ఉంది. అనంతరం బుచ్చిబాబు సినిమాకు మాత్రం హై రేంజ్ లోనే క్రేజ్ ఉంది. అలాగే సుకుమార్ సినిమా కూడా లైన్ లో ఉంది. కాబట్టి గేమ్ ఛేంజర్ తేడా కొట్టినా చరణ్ కు భవిష్యత్తులో 1000 కోట్ల మార్కెట్ ను టచ్ చేసే అవకాశాలు ఉన్నాయి. తారక్ కూడా దేవర మిస్సయినా ప్రశాంత్ నీల్ ప్రాజెక్టు ఉంది. ఇక బన్నీకి సందీప్ వంగా కూడా ఉన్నాడు. ఏదేమైనా ఈ ముగ్గురు ప్రభాస్ రేంజ్ మార్కెట్ కోసం పోటీ పడుతున్న కూడా అతన్ని ఇప్పట్లో సమీపించలేకపోవచ్చని ట్రేడ్ పండితులు అంటున్నారు. ప్రభాస్ తర్వాత సెకండ్ పొజిషన్ కోసం మాత్రం ఈ ముగ్గురు మధ్య పోటీ ఉంటుందని భావిస్తున్నారు.

Tags:    

Similar News