టాలీవుడ్ నెక్స్ట్ టార్గెట్ కోలీవుడ్!
ఇటీవల రిలీజ్ అయిన `పుష్ప2` విజయంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఖాన్ లు..కపూర్ రికార్డులను సైతం తిరగరా యడంతో ఈ ఖ్యాతి సాధ్యమైంది.
పాన్ ఇండియాలో తెలుగు సినిమా సత్తా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు ఇండియాలో నెంబర్ వన్ ఇండస్ట్రీ ఏది? అంటే! అంతా వెలెత్తి చూపించేది టాలీవుడ్ వైపే. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇటీవల రిలీజ్ అయిన `పుష్ప2` విజయంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఖాన్ లు..కపూర్ రికార్డులను సైతం తిరగరా యడంతో ఈ ఖ్యాతి సాధ్యమైంది. బాలీవుడ్, శాండిల్ వుడ్, మాలీవుడ్, భోజుపురీ ఇండస్ట్రీలో నెంబర్ వన్ గా దూసుకుపోతుంది.
కానీ ఆ ఒక్క పరిశ్రమలో మాత్రం టాలీవుడ్ పాగా వేయలేకపోతుంది. చేస్తున్న ప్రయత్నాలు విఫలం తప్ప సఫలం కావడం లేదు. ఎంత మంది హీరోలు కలిసి పనిచేసినా ఎలాంటి కంటెంట్ తో రిలీజ్ అయినా అక్కడ మాత్రం సత్తా చాటడం సాధ్యం కావడం లేదు. ఇంతకీ ఏ పరిశ్రమ అంటే? పక్కనున్న తమిళనాడు కోలీవుడ్ ఇండస్ట్రీ అని చెప్పా లి. టాలీవుడ్ కి దూరంగా ఉన్న పరిశ్రమలు తెలుగు సినిమా సక్సెస్ ని అంగీకరించినా పక్కనే ఉన్న కోలీవుడ్ మాత్రం ఆ ఛాన్స్ ఇవ్వడం లేదు.
తమ హీరోల తర్వాతే ఇతర భాషల హీరోలంటూ ఎంతో యూనిటీగా అక్కడ పరిశ్రమ పని చేస్తుంది. అయితే ఇక్కడే ఎన్నో కారణాలున్నాయి. చరిత్రలో ఎన్నో సత్యాలున్నాయి. మద్రాసు ప్రావిన్స్ నుంచి తెలుగు రాష్ట్రం ఏర్పాటైన నేపథ్యంలో భాషాబేధం తలెత్తిన సంగతి తెలిసిందే. తమిళం-తెలుగు అనే ప్రత్యేక వాదన తమిళనాడులో ఎప్పుడూ బలంగా వినిపిస్తుందన్నది తెలిసిందే. తమిళ హీరోల చిత్రాల్ని తెలుగు హీరోలు నెత్తిన పెట్టుకుంటారు.
కానీ తెలుగు హీరోల సినిమాల్ని మాత్రం తమిళులు పట్టించుకునే పరిస్థితి కూడా ఉండదు. ఇప్పటి వరకూ తమిళనాడులో తెలుగు హీరోలు నటించిన సినిమాలెన్నో రిలీజ్ అయ్యాయి. కానీ అక్కడ హీరోల రికార్డులకు మాత్రం అక్కడ దరిదాపుల్లో కూడా వెళ్లలేదు. తెలుగు సినిమాకి అక్కడ ఆదరణ అంతంత మాత్రమే. థియేటర్ల కేటాయింపులోనూ ఎంతో రాజకీయం చోటు చేసుకుంది. తెలుగు సినిమాకి థియేటర్లు ఇవ్వాలా? అని అక్కడి డిస్ట్రిబ్యూటర్లే ప్రశ్నిస్తారు.
అక్కడి ప్రజల్లో సైతం తెలుగు సినిమా అనే చిన్న చూపు ఉంది. అందుకే తమిళనాట తెలుగు సినిమా కొన్ని ప్రాంతాలకే పరిమితమవుతుంది తప్ప అన్ని ప్రాంతాలకు చేరడం లేదు. అయితే ఇప్పుడీ వ్యత్యాసం నిర్మూలనకు సమయం ఆసన్నమైంది. మునుపటి కంటే తెలుగు సినిమాలు అక్కడ కాస్త మెరుగైన ఫలితాలు సాధిస్తున్నాయి. సినిమాకి స్థిరమైన వసూళ్లు కనిపిస్తున్నాయి. తమిళ హీరోలు టాలీవుడ్ కి వచ్చి సినిమాలు చేస్తున్నారు. అక్కడ ఈ రకమైన మార్పు ఇంకా బలంగా తెలుగు సినిమా తేగలగాలి. అది సరైన కంటెంట్ తో మాత్రమే సాద్యం. ఎందు కంటే తెలుగు రాష్ట్రాల కంటే విపరీతమైన సినిమా అభిమానం తమిళనాడులోనే అధికం. రానున్న ఐదారేళ్లలో ఈ వ్యత్యాసం మరింత తగ్గడానికి ఛాన్స్ ఉంది.