ఐఫిల్ అందం ముందు అందాల దక్షా
తేజ దర్శకత్వంలో వచ్చిన హోరా హోరి సినిమా తో నటిగా దక్షా నాగర్కర్ ఎంట్రీ ఇచ్చింది.
తేజ దర్శకత్వంలో వచ్చిన హోరా హోరి సినిమా తో నటిగా దక్షా నాగర్కర్ ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమా నిరాశ పరిచిన కూడా ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉంది. నటిగా, మోడల్ గా సుదీర్ఘ కాలంగా కెరీర్ ను కొనసాగిస్తున్న ఈ అమ్మడు సోషల్ మీడియాలో రెగ్యులర్ గా అందమైన ఫోటోలను షేర్ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. సోషల్ మీడియా సెన్షేషన్ అంటూ ఈ అమ్మడికి పేరు ఉంది. అందాల దక్షా నగర్కర్ షేర్ చేసిన ప్రతి ఫోటో షూట్ కూడా అందరి దృష్టిని ఆకర్షించడం తో పాటు వైరల్ అవ్వడం మనం చూస్తూనే ఉంటాం.
తాజాగా మరోసారి ఈమె ఇన్ స్టా లో షేర్ చేసిన అందమైన ఫోటో షూట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆకట్టుకునే దక్షా నగర్కర్ తాజాగా ఫ్రాన్స్ లో ఉన్న ఐఫిల్ టవర్ ముందు ఫోటోలకు ఫోజ్ ఇచ్చింది. సాధారణంగా ఈమె అందమైన ఫోటోలు షేర్ చేస్తేనే ఎక్కువ మంది నెటిజన్స్ లైక్ చేస్తూ షేర్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు అందమైన ఐఫిల్ టవర్ ముందు ఈ అందాల దక్షా నగర్కర్ నిల్చుని ఫోటోలకు ఫోజ్ ఇవ్వడంతో అందరూ వావ్ అంటూ కామెంట్స్ చేస్తూ ఉన్నారు. విభిన్నమైన ఔట్ ఫిట్ లో ఐఫిట్ టవర్ ముందు ఉన్న దక్షా ఫోటోలకు నెటిజన్స్ నుంచి మంచి స్పందన దక్కింది.
జాంబీ రెడ్డి మరియు బంగార్రాజు సినిమాల్లో ముఖ్య పాత్రల్లో నటించిన దక్షా నగర్కర్ గత ఏడాది రవితేజ హీరోగా నటించిన రావణాసురుడు తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా కూడా పెద్దగా విజయాన్ని సొంతం చేసుకోక పోవడంతో పాపం దక్షా నాగర్కర్ కి నిరాశే మిగిలింది. హీరోయిన్ గా ఒకటి రెండు అవకాశాలు వచ్చినా కూడా అవి పెద్దగా ప్రభావం చూపించలేదు. ప్రస్తుతం కెరీర్ లో ఆఫర్ల కోసం ఈ అమ్మడు తెగ ప్రయత్నాలు చేస్తుంది. ఇదే సమయంలో సోషల్ మీడియాలో ఇలాంటి అందమైన ఫోటోలను షేర్ చేయడం ద్వారా వార్తల్లో ఉంటుంది.
టాలీవుడ్ లో కాకుండా ఈ అమ్మడు ఇతర భాషల సినిమాల్లో కూడా నటించేందుకు ప్రయత్నిస్తే ఫలితం ఉండే అవకాశం ఉందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈమె షేర్ చేస్తున్న ఫోటోల కారణంగా అన్ని చోట్ల మంచి గుర్తింపు దక్కింది. కనుక ఒక మంచి ఆఫర్ వస్తే కచ్చింగా అన్ని చోట్ల కూడా తన ప్రతిభ చూపించే అవకాశం ఉందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆకట్టుకునే అందంతో పాటు మంచి ఫిజిక్, ఎక్స్ప్రెషన్స్ ను బాగా పలికించే రూపం అవ్వడం వల్ల దక్షా కి ముందు ముందు అయినా మంచి అవకాశాలు వస్తాయని కొందరు భావిస్తున్నారు.